Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో షేఖ్పురా జిల్లా ఒకటి. 1934 జూలై 31 ముంగేర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. షేఖ్పురా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. షేఖ్పురా జిల్లా ముంగేర్ డివిజన్లో భాగం. జిల్లా డాక్టర్ శ్రీ కృష్ణా సింగ్ (బీహార్ మొదటి ముఖ్యమంత్రి), స్వాతంత్ర్య సమర యోధుడు, నాయకులు శ్రీ రాధా రమణ్ శర్మ, సుఖదేవ్ ప్రసాద్ సింగ్, పార్లమెంటు సభ్యుడు రావు సింగ్ వంటివారికి స్వస్థానంగా ఉంది. భారతీయ చలనచిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు సుధాకర్ స్నేహ్ కూడా ఈ జిల్లాకు చెందిన వాడే. 2011 గణాంకాల ప్రకారం బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసఆంధ్రతా పరంగా షేఖ్పురా జిల్లా జిల్లా అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది..[1]
షేఖ్పురా జిల్లా
शेखपुरा जिला,ضلع شیخ پورہ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | ముంగేర్ |
ముఖ్య పట్టణం | షేఖ్పురా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | జమూయి |
విస్తీర్ణం | |
• మొత్తం | 689 కి.మీ2 (266 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 6,34,927 |
• జనసాంద్రత | 920/కి.మీ2 (2,400/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.96 % |
• లింగ నిష్పత్తి | 926 |
ప్రధాన రహదార్లు | NH 82 |
Website | అధికారిక జాలస్థలి |
షేఖ్పురా జిల్లా వైశాల్యం 689 చ.కి.మీ.,[2] ఇది సొలోమన్ ద్వీపాలకు చెందిన కొలోమంగర [3]
షేఖ్పురా బీహార్ రాష్ట్రంలోని చిన్న జిల్లాలలో ఒకటి. ఇదిలో 6 బ్లాకులు మాత్రమే ఉన్నాయి. ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిసున్నారు. సోన్ మైనింగ్ జిల్లాలో ప్రధానంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షేఖ్పురా జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[4]
జిల్లాలో ఒక ఉపవిభాగం ఉంది. జిల్లాలో 6 మండలాలు ఉన్నాయి: అరియారి, షేఖ్పురా, బార్భిగా, అసెంబ్లీ నియోజకవర్గాలు షేఖ్పురా, బర్బిఘా
షైఖ్పుర పి.ఎస్, సిరరి ఒ.పి, అరియరి పి.ఎస్, కసర్ ఒ.పి, మహులి ఒ.పి, కుసుంభ ఒ.పి,చెవర పి.ఎస్.కరందే ఒ.పి, కుర్మా పి.ఎస్. మెహుస్ పి.ఎస్, బర్బిఘ పి.ఎస్, ఝయ్రంపుర్ ఒ.పి.
జిల్లా మొత్తం చక్కగా రహదార్లతో అనుసంధానితమై ఉంది. అన్ని తరచుగా నగరాలకు బసులు లభిస్తాయి.
షేఖ్పురా రైల్వే స్టేషన్ బ్రాడ్గేజ్ రైలుమార్గం నుండి కియుల్ జంక్షన్, గయ నగరాలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడి నుండి దినసరి కొలకత్తా, వారాంతర రైళ్ళు గౌహతి నగరాలకు రైలు వసతి లభిస్తున్నాయి. ఇక్కడి నుండి పాట్నాకు రైలు వసతి లభిస్తుంది. ఫాతుయా - ఇస్లాంపూర్, భక్తిపూర్ - రైగర్ రైలు మార్గాలు ఉన్నాయి.
జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం " పాట్నా ఎయిర్పోర్ట్ " ఇక్కడి నుండి దేశీయంగా పలు నగరాలకు విమానసేవలు లభిస్తున్నాయి.
.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 634,927,[1] |
ఇది దాదాపు. | మోణ్టెంగ్రొ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 516వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 920 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.82%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 926:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | స్వల్పంగా తక్కువ |
అక్షరాస్యత శాతం. | 65.96%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో ప్రధానంగా హిందీ, ఉర్దూ, ఇండో - ఆర్యన్ భాష మాగహి (దేవనాగరి లిపిలో వ్రాయబడుతుంది) భాషలు వాడుకలో ఉన్నాయి.
పర్యాటక ఆకర్షణలు: ఆర్ఘుతి పోకర్, గిరిహింద పహర్ (శివాలయం ఉంది), సమాస్ (విష్ణు ఆలయం ఉంది), నిమిలో ప్రముఖ మహారాణి ఆలయం ఉంది. .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.