షాన్ (గాయకుడు)

From Wikipedia, the free encyclopedia

షాన్ (గాయకుడు)

శంతను ముఖర్జీ (జననం 1972 సెప్టెంబరు 30) భారతీయ నేపథ్య గాయకుడు, స్వరకర్త, నటుడు, టెలివిజన్ హోస్ట్. ఆయన షాన్‌గా సుప్రసిద్ధుడు. ఆయన వివిధ భారతీయ భాషలలో సినిమాలు, ఆల్బమ్‌ల కోసం అనేక పాటలను రికార్డ్ చేశాడు. ఆయన స రే గ మ ప, సరేగమపల్ చాంప్స్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా 2 షోలకు హోస్ట్ గా వ్యవహరించాడు. అలాగే సరేగమపల్ చాంప్స్ 2014–2015, ది వాయిస్ ఇండియా కిడ్స్ 2016-2017 షోలకు ఆయన న్యాయనిర్ణేతగా కూడా ఉన్నాడు.[2]

త్వరిత వాస్తవాలు షాన్, జననం ...
షాన్
Thumb
2013లో మ్యూజిక్ మానియాలో షాన్
జననం
శంతను ముఖర్జీ

(1972-09-30) 30 సెప్టెంబరు 1972 (age 52)[1]
వృత్తి
  • ప్లేబ్యాక్ సింగర్
  • కంపోజర్
  • నటుడు
  • టెలివిజన్ ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు1995 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాధికా ముఖర్జీ
(m. 2000)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • మానస్ ముఖర్జీ (తండ్రి)
  • సోనాలి ముఖర్జీ (తల్లి)
బంధువులుసాగరిక (సోదరి)
మూసివేయి
దస్త్రం:ShaanatImprint.jpg
IBM ఈవెంట్ IMPRINT 2008లో ప్రదర్శన ఇస్తున్న షాన్

గానంతో పాటు షాన్ డామన్: ఎ విక్టిమ్ ఆఫ్ మ్యారిటల్ వయోలెన్స్ (2001) చిత్రంలో నటించాడు. అలాగే 2003లో జమీన్, హంగామా హిందీ సినిమాలలోనూ కనిపించాడు.

అక్కినేని నాగార్జున హీరోగా 2002లో వచ్చిన మన్మథుడు చిత్రంలోని చెలియ చెలియా.., అల్లు అర్జున్ హీరోగా 2004లో వచ్చిన ఆర్య చిత్రంలోని యూ రాక్ మై వరల్డ్.. పాటలతో షాన్ తెలుగు ప్రేక్షకులనూ ఉర్రూతలు ఊగించాడు.

ప్రస్తుతం షాన్ ఐక్యరాజ్యసమితిలో భారతదేశ అంతర్జాతీయ ఉద్యమం (India's International Movement to Unite Nations) సలహాదారుల బోర్డు సభ్యుడు.[3]

వ్యక్తిగత జీవితం

1972 సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని ముంబైలో బెంగాలీ కుటుంబంలో శంతను ముఖర్జీ జన్మించాడు.[4] అతని తండ్రి దివంగత మానస్ ముఖర్జీ సంగీత దర్శకుడు, సోదరి సాగరిక కూడా గాయని. అతని తాత జహర్ ముఖర్జీ ప్రసిద్ధ గీత రచయిత.

కెరీర్

సంగీతం

ప్రారంభంలో ప్రకటనల కోసం జింగిల్స్ పాడటం షాన్ ప్రారంభించాడు. జింగిల్స్‌తో పాటు, రీమిక్స్‌లు, కవర్ వెర్షన్‌లను కూడా చేసాడు. మాగ్నాసౌండ్ రికార్డింగ్ కంపెనీతో సైన్ అప్ చేసిన షాన్, అతని సోదరి కలసి హిట్ ఆల్బమ్ నౌజవాన్‌తో పాటు Q-ఫంక్‌తో సహా కొన్ని విజయవంతమైన ఆల్బమ్‌లను రికార్డ్ చేశారు. ఆ తర్వాత షాన్ లవ్-ఓలజీని ప్రారంభించాడు. 2000లో తన ఆల్బమ్ తన్హా దిల్ నుండి తన్హా దిల్ తన్హా సఫర్ అనే సూపర్‌హిట్ పాటను అందించాడు.

2002లో తన ఆల్బమ్ తన్హా దిల్ కు గాను ఉత్తమ సోలో ఆల్బమ్‌గా ఫేవరేట్ ఆర్టిస్ట్ ఇండియా ఎం.టీవీ ఆసియా అవార్డును గెలుచుకున్నాడు. 2003లో ఆల్బమ్ అక్సర్‌ను షాన్ ప్రారంభించాడు. విజయవంతమైన ఇందులో బ్లూ, మెలానీ సి, సమీరా సెయిడ్ వంటి అంతర్జాతీయ తారలు కూడా ఉన్నారు. తన్హా దిల్, అక్సర్ రెండు ఆల్బమ్‌లకు, రామ్ సంపత్ కంపోజ్ చేసిన టైటిల్ ట్రాక్ తన్హా దిల్ మినహా అన్ని పాటలను షాన్ పాడి, కంపోజ్ చేసాడు. అంతేకాకుండా సాహిత్యం రాసాడు.

2004లో తోమర్ ఆకాష్ అనే బెంగాలీ ఆల్బమ్‌ను తన సోదరితో కలిసి షాన్ విడుదల చేశాడు. ఇందులో తన తండ్రి విడుదల చేయని పాటలను కూడా కలిపాడు. 2006లో ఎం.ఎల్.టి.ఆర్తో టేక్ మి టు యువర్ హార్ట్ అనే పాటను ఆయన విడుదల చేశాడు. ఈ పాట అతని ఆల్బమ్ తిష్నాగిలో కనిపిస్తుంది, దీనిని రంజిత్ బారోట్ నిర్మించగా ఆశిష్ మంచాండా ఇంజనీరింగ్ చేసాడు.[5]

ప్లేబ్యాక్ సింగింగ్‌

1999లో ప్యార్ మే కభీ కభీ చిత్రంతో షాన్ ప్లేబ్యాక్ సింగర్ గా అడుగుపెట్టాడు, ఈ చిత్రంలో అతని రెండు పాటలు కూడా యువతను అమితంగా ఆకట్టుకున్నాయి.[6] డబ్బు స్వరపరిచిన బెంగాలీ చలన చిత్రం నెట్‌వర్క్ కోసం షాన్ ప్లేబ్యాక్ రికార్డ్ చేశాడు.[7]

టీవీ షోస్ హోస్ట్, జడ్జి

2000-2006 సంవత్సరాల మధ్య జీ టీవీలో స రే గ మ ప అనే టెలివిజన్ షోకు షాన్ హోస్ట్ గా చేశాడు. అనేక టాలెంట్ షోలకు న్యాయనిర్ణేతగా షాన్ వ్యవహరిస్తున్నాడు. స్టార్ ప్లస్ మ్యూజిక్ కా మహా ముక్కాబ్లా లో షాన్స్ స్ట్రైకర్స్ టీమ్ కు షాన్ జట్టు కెప్టెన్, న్యాయనిర్ణేత. స రే గ మ ప ఎల్ చాంప్స్ 2014–2015, ది వాయిస్ ఇండియా కిడ్స్ 2016లలో షాన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2015, 2016లలో ది వాయిస్ మొదటి రెండు సీజన్‌లలో షాన్ విన్నింగ్ కోచ్‌గా ఉన్నాడు.

గుర్తింపు

ఫనా చిత్రం నుండి చాంద్ సిఫారిష్.., సావరియా చిత్రం నుండి జబ్ సే తేరే నైనా.. పాటలకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ అవార్డు, జీ సినీ అవార్డ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ - మేల్ పురస్కారాలు అందుకున్న షాన్ అనేక ఇతర నామినేషన్ లు కూడా జరిగాయి. 2002లో తన్హా దిల్ ఆల్బమ్ కు ఆయన ఉత్తమ సోలో ఆల్బమ్‌గా MTV ఆసియా మ్యూజిక్ అవార్డును గెలుచుకున్నాడు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.