Remove ads
From Wikipedia, the free encyclopedia
శ్రీ గంగానగర్, ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రణాళికాబద్ధమైన నగరం. దీని సరిహద్దుకు సమీపంలో పంజాబ్ రాష్ట్రాలు, భారతదేశ-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. ఇది శ్రీ గంగానగర్ జిల్లా ప్రధాన కార్యాలయ పరిపాలనా కేంద్రస్థానం. దీనికి బికనీర్ మహారాజు గంగా సింగ్ బహదూర్ పేరు పెట్టారు.దీనిని "రాజస్థాన్ ఆహార బుట్ట" అని పిలుస్తారు. ఇది సట్లెజ్ నదీ జలాలు రాజస్థాన్ లేదా మునుపటి బికనీర్ రాష్ట్రంలోకి ప్రవేశించే చోట ఉంది.
శ్రీ గంగానగర్ | |
---|---|
Coordinates: 29.92°N 73.88°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | శ్రీ గంగానగర్ |
Founded by | మహారాజా గంగాసింగ్ |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | పట్టణ స్థానిక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 225 కి.మీ2 (87 చ. మై) |
Elevation | 178 మీ (584 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,54,760 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,900/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 335001 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 0154 |
ISO 3166 code | RJ-IN |
Vehicle registration | RJ-13 |
లింగ నిష్పత్తి | (పురుషులు)-1000:887-(స్త్రీలు) |
రామనగర్ సమీపంలో మహారాజా గంగా సింగ్ చేత శ్రీ గంగానగర్ స్థాపించబడింది.[1] దీనికి రామ్ సి ధారా అని, రామ్ సింగ్ సహారన్ పేరు పెట్టారు. ఇప్పుడు దీనిని 'పురాణి అబాది' 'ఓల్డ్ అబాది' అని పిలుస్తారు.శ్రీ గంగానగర్ భారతదేశంలోని మొట్టమొదటి ఆధునిక ప్రణాళిక నగరాలలో ఒకటి.ఇది పారిస్ పట్టణ ప్రణాళిక ద్వారా ప్రభావితమవుతుందని చెబుతారు.ఇది నివాస గృహాల వరసలుతో ధన్ మండి (వ్యవసాయ పంటల వర్తక స్థలం) ను కలిగి ఉన్న వాణిజ్య ప్రాంతంగా విభజించబడింది.
ఈ ప్రాంతం పూర్వం మొదట బహవల్పూర్ రాష్ట్రం క్రిందకు వచ్చిందని పెద్దలు చెబుతారు.కానీ, పెద్ద బహిరంగ ప్రదేశం కారణంగా, ఇది రక్షణ లేకుండా పోయింది.హిందూ మాల్ (మహారాజా గంగా సింగ్ సహచరుడు) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరిహద్దులో ఉన్న సరిహద్దులను లేదా ప్రాంతాల అధికారాలను మార్చాడు.దక్షిణాదిలోని సూరత్‌గఢ్ నుండి ఈ జిల్లాకు ఉత్తరాన హిందూమల్కోట్ నగరం వరకు ప్రాంతాల అధికారాలను మార్చడానికి అతను తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అతను ఉత్తర ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఈ ప్రాంతంపై తన విజయవంతమైన దాడి గురించి మహారాజాకు సమాచారం ఇచ్చాడు.ఆ తరువాత హిందూమల్ కోట అని నగరానికి పేరు పెట్టాడు.
1899-1900లో, బికనీర్ రాష్ట్రం తీవ్రమైన కరువుతో ప్రభావితమైంది.ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి, మహారాజా గంగా సింగ్ చీఫ్ ఇంజనీర్ ఎడబ్యుఇ స్టాండ్లీ సేవలను పొందాడు. అతను బికనీర్ రాజ్యం పశ్చిమ ప్రాంతం సట్లెజ్ జలాల నుండి నీటిపారుదల కిందకు తీసుకురావడానికి సాధ్యతను ప్రదర్శించాడు. సట్లెజ్ వ్యాలీ ప్రాజెక్ట్ ప్రణాళికను అప్పటి పంజాబ్ చీఫ్ ఇంజనీర్ ఆర్.జి.కెన్నెడీ రూపొందించాడు.దీని ప్రకారం పూర్వపు బికనీర్ రాజ్యం విస్తారమైన ప్రాంతాన్ని నీటిపారుదల కిందకు తీసుకురావటానికి అవకాశం కలిగింది.అయితే, పూర్వపు బహవాల్పూర్ రాజ్యం అభ్యంతరాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగింది.
1906 లో అప్పటి వైస్రాయ్ ఆఫ్ లార్డ్ కర్జన్ జోక్యంతో, త్రైపాక్షిక సమావేశంలో ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 1920 సెప్టెంబరు 4 న సంతకం చేయబడింది. ఫిరోజ్పూర్లో కాలువ ప్రధాన పనులుకు పునాది రాయి 1925 డిసెంబరు 5 న వేయబడింది.1923 లో 143 కి.మీ (89 మైళ్లు) చెట్లతో కూడిన కాలువ నిర్మాణంతో పనులు పూర్తయ్యాయి.అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 1927 అక్టోబరు 26 న ప్రారంభోత్సవం చేసారు.
ఆ సమయంలో శ్రీ గంగానగర్ నగరానికి ప్రణాళిక రూపొందించారు.బికనీర్ రాష్ట్రంలోని సాగునీటిని శ్రీ గంగానగర్ జిల్లా పరిధిలోకి తీసుకువచ్చారు.తరువాత 1994 లో హనుమన్‌గఢ్ జిల్లాగా ఉపవిభజన చేశారు.
గంగానగర్ నగరాన్ని గంగానగర్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి వచ్చే మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా తెక్కలు ప్రకారం గంగానగర్ నగర మొత్తం జనాభా 224,532; వారిలో పురుషులు 120,778 మంది ఉండగా, 103,754 స్త్రీలు ఉన్నారు. గంగానగర్ నగరంలో 224,532 జనాభా ఉన్నప్పటికీ; దాని పట్టణ / మెట్రోపాలిటన్ జనాభా 249,914, ఇందులో 134,395 మంది పురుషులు, 115,519 మంది మహిళలు ఉన్నారు.[2]
ఇక్కడ హిందూవులు ఎక్కువుగా ఉన్నారు.పంజాబ్‌తో సామీప్యత కారణంగా సిక్కులును అనుసరిస్తుంది.ఈ ప్రదేశంలో అనేక హిందూ మందిరాలు ఉన్నాయి.శ్రీ గంగానగర్ పట్టణంలో పిందువులు 72.98%, సిక్కులు 24.11%, ఇస్లాం మతానికి చెందిన వారు 2.57%, ఇతరులు 0.34% మంది ఉన్నారు
దాదాపు 70-75 శాతం మంది జీవనోపాధి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది.వారు గోధుమలు, వరి, చెరకు వంటి అనేక రకాల పంటలను పండిస్తారు.ఈ ఉత్పత్తులు పంజాబ్, హర్యానా, ఇంకా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరుగుతుంది.
శ్రీ గంగానగర్ యువకులు కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ వంటి క్రీడలను ఆడతారు. వారు ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయస్థాయి ఆటలపొటీలలో పాల్గొని వందలాది పతకాలు, జ్ఞాపికలు గెలుచుకుంటారు.
శ్రీ గంగానగర్ ప్రకృతి దృశ్యం దేవాలయాలు, మత ప్రదేశాలతో నిండి ఉంది.శ్రీ గంగానగర్ లో పేరుగడించిన ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి.
ఆటో రిక్షాలు,సైకిల్ రిక్షాలు ప్రధానంగా అంతర్గత రవాణా కోసం ఉపయోగిస్తారు.శ్రీ గంగానగర్ పట్టణం నేరుగా ఢిల్లీ, జైపూర్, హరిద్వార్, అహ్మదాబాద్, పూణే, రూర్కీ, కాన్పూర్, బెంగళూరు నగరాలకు రహదారుల ద్వారా అనుసంధానించబడి ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.