Remove ads
రాజస్థాన్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో గంగానగర్ జిల్లా ఒకటి.ఇది రాజస్థాన్ ధాన్యాగారంగా కీర్తించబడుతుంది.
శ్రీ గంగానగర్ | |
---|---|
జిల్లా | |
Coordinates: 29.92°N 73.88°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
పరిపాలనా ప్రధానకేంద్రం | శ్రీ గంగానగర్ |
Founded by | మహారాజా గంగా సింగ్ |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
• Body | నగరపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 225 కి.మీ2 (87 చ. మై) |
Elevation | 178 మీ (584 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,54,760 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,900/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
• ప్రాంతీయ భాషలు | బాగ్రి, పంజాబీ , ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 335001 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 0154 |
ISO 3166 code | RJ-IN |
Vehicle registration | RJ-13 |
లింగ నిష్పత్తి | (పురుషులు) 1000: 887 (స్త్రీలు) |
ఈ ప్రాంతానికి బికనీర్ మహారాజా గంగా సింగ్ పేరు పెట్టబడింది. శ్రీగంగానగర్ జిల్లా బికనీర్ రాజాస్థానంలో భాగంగా ఉండేది. జిల్లా అధికభూభాగం జనావాస రహితం.1899-1900 లలో కరువు సంభవించినప్పుడు కరువు నివారణ కొరకు మహారాజా బృహత్తర ప్రణాళిక ద్వారా భవిష్యత్తు సమృద్ధిని ఊహించి గంగాకాలువ త్రవ్వకానికి రూపకల్పన చేసాడు. 1927 నాటికి 89 మైళ్ళ పొడవైన కాలువను నిర్మించి సటైజ్ నదీ జలాలను ఈ ప్రాంతంలో ప్రవహింపజేసి ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసాడు.[1] ఈ ప్రాంతం ఒకప్పుడు బహవాల్పూర్ రాజాస్థానం ఆధీనంలో ఉండేది. నిర్జనమైన బహిరంగ ప్రదేశానికి తగిన రక్షణ లేకుండా ఉండేది. గంగామహారాజు మిత్రులలో ఒకడైన హిందూ మల్ దీనిని అనుకూలంగా చేసుకుని, దక్షిణంలోని సూరత్గర్ నుండి, ఉత్తరంలో ఉన్న హిందూమల్‌కోట వరకు ఈ ప్రాంతపు సరిహద్దులలో ఉన్న స్తంభాలను మార్చి భూభాగ విస్తరణ చేసాడు. తరువాత హిందూమల్, గంగామహారాజుకు తన విజయం గురించి వర్తమానం అందించాడు. తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన గంగా మహారాజు ఈ ప్రాంతానికి హిందూమల్‌కోట అని నామకరణం చేసాడు.
శ్రీ గంగానగర్ జిల్లా 28.4 నుండి 30.6 డిగ్రీల అక్షాంశం, 72.2 నుండి 75.3 డిగ్రీల రేఖాంశంలో ఉంది.[2] జిల్లా వైశాల్యం 11,154.66 చ.హెక్టార్లు.జిల్లా తూర్పు సరిహద్దులలో హనుమాన్‌గఢ్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో బికనీర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులలో పాకిస్థాన్ దేశంలోని భావనగర్ జిల్లా, ఉత్తర సరిహద్దులలో పంజాబు ఉన్నాయి.
గంగానగర్ జిల్లా థార్ ఎడారిలో ఉన్నప్పటికీ జిల్లాలో గంగాకాలువ, ఐ.జి.పి కాలువ ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. ఈ కాలువలు జిల్లా వృక్షజాలం, జంతుజాలంలో మార్పు తీసుకువచ్చాయి.
తరువాత జైత్సర్, విజయనగర్, అనూప్గర్ ద్వారా ఇండో పాకిస్థాన్ సరిహద్దును చేరుకుంటుంది.
గంగానగర్ జిల్లాలో తొమ్మిది తాలుకాలు ఉన్నాయి.
కెసరిసింగ్పుర్, గజ్సింగ్పుర్, రైసింగ్ నగర్, జైత్సర్, రవ్ల మండి మొదలైన ప్రధాన పట్టణాలు, వ్హెరేస్ లల్గర్హ్ జతన్, రిద్మల్సర్, రజీసర్, పత్రొద, సమెజ కొథి, చునవధ్, గనెష్గర్హ్, లధువల, హిందుమల్కొత్, బజువల, అంద్ బిర్మన విల్లగే బెల్వన, అరే స్మల్ల్ తౌన్స్, ఇతర గ్రామాలు.శ్రీ గంగనగర్ల్లో పలు పట్టణాలు బికనీర్ రాజవంశ కుంటుంబీకుల మరణం తరువాత వారి ఙాపకార్ధం నామకరణం చేయబడ్డాయి.
శ్రీగంగానగర్ జిల్లా ఆర్థికంగా వ్యవసాయ ఆధారిత నగరంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా గోధుమ, పత్తి, ఆవాలు, పప్పుధాన్యాలు, చెరకు పండిస్తారు. వ్యవసాయ దారుల మధ్య హార్టీకల్చర్ కూడా ఆసక్తికరంగా మారింది. హార్టీకల్చర్ ఉత్పత్తులలో పంటల్లో కిన్నో పండ్లు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. పుల్లని పండ్లరకాలకు చెందిన ఇతర పండ్లుకూడా పండిస్తారు. గంగానగర్ పరిశ్రమలు అన్నీ వ్యవసాయ ఆధారితమైనవి. జిల్లాలో కాటన్ జిన్నింగ్, ప్రెసింగ్, ఆవనూనె మిల్లులు, పిండిమరలు, షుగర్ మిల్లులు, టెక్స్టైల్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు అధికంగా గంగానగర్ నగరం లోపల, వెలుపల ఉన్నాయి. బి.డి. అగర్వాల్ శ్రీగంగానగర్‌లో మెడికల్ కాలేజ్ నిర్మించడానికి 50 కోట్లు చందాగా ఇచ్చాడు. దాతృత్వంలో ఇది అత్యధిక మొత్తం అని గుర్తించబడుతుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,969,520, [3] |
ఇది దాదాపు. | స్లొవేనియా దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 235 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 179 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 10.06%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 887:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 70.25%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
రాజస్థానీ భాషాకుటుంబానికి చెందిన బగ్రి భాష జిల్లాలో అత్యధికంగా వాడుకలో ఉంది.[5] బగ్రి భాష గంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాలు, పంజాబు, హర్యానా రాష్ట్రాలలోని కొన్ని తాలూకాలలో మాత్రమే వాడుకలో ఉంది. జిల్లాలోని ప్రజలలో ఎక్కువమంది హిందీ, సరైకి, సింధి, పంజాబీ ప్రజల బగ్రి భాష వాడుకలో ఉంది. జిల్లాలో హిందీ, ఆంగ్లభాషలు అధికారభాషలుగా ఉన్నాయి. జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలలో పంజాబీ భాష ఆప్షనల్ సబ్జెక్టుగా బోధించబడుతుంది. జిల్లాలో గంగానగర్ జిల్లాలో పంజాబీ సంగీతం అత్యధిక ప్రజాభిమానాన్ని కలిగి ఉంది. బగ్రి, పంజాబీ భాషలు రెండింటిలో సాధారణమైన పదాలు అనేకం ఉన్నాయి. సరైకి భాష అరోయా, రైసిఖ్స్, సరైకి ప్రజలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని ఉత్తర భూభాగంలో సరైకి భాష మరుగున పడుతుంది. సింధీ ప్రజలు సింధీభాషను మాట్లాడుతుంటారు. సింధీలు అధికంగా విజయనగర్, కేద్రిసింఘ్నగర్ అనుప్గర్లో వాడుకలో ఉంది.
ఒధిని ఎంబ్రాయిడరీ (అధికంగా ఎర్రని రంగులో ఉంటుంది) బగ్రీ స్త్రీలకు చిహ్నంగా ఉంది. పొడవైన షర్టు, ఘాఘ్రో (పొడవైన గౌను వంటిది), బ్రోలో (శిరోభూషణం) బంగ్రీ స్త్రీల సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి. పంజాబీ స్త్రీలు సూట్, సల్వార్, చున్నీ దుస్తులను ధరిస్తుంటారు. ఇతర సమూహాలకు చెందిన స్త్రీలలో కూడా ఈ దుస్తులు ఆదరణ కలిగి ఉన్నాయి.హిందూ, ముస్లిం సరైకి స్త్రీలు కొందరు గాగ్రా (పొడవైన గౌను) ధరిస్తుంటారు. బగ్రీ స్త్రీలలో పరదా వాడుకలో ఉంది. పురుషులు సాధారణంగా ప్యాంటు, షర్టు, కుర్తా - పైజమా, ధోవతి (పంజాబీలు దీనీని చద్రా - కుర్తా అంటారు ) ధరిస్తుంటారు. సంప్రదాయ సిక్కు, రాజస్థాని భక్తి సంగీతం ప్రజాదరణ కలిగి ఉంది. ఇతర ఉత్తరభారతంలో ఉన్నట్లే హిందీ సినిమా పాటలు కూడా ప్రజాభిమానాన్ని చూరగొంటాయి. పంజాబీ, బగ్రీ సంప్రదాయాలు జిల్లాలో ఆధిక్యత కలిగి ఉన్నాయి.
ప్రజలలో అధికంగా హిందువులు, సిక్కులు ఉన్నారు. ప్రజలు గ్రామదేవతలైన రాందేవ్‌జి, గోగజిలను ఆరాధిస్తుంటారు. ప్రజలు అధికంగా పీర్లు, సన్యాసులపట్ల విశ్వాసం కలిగి ఉండి వారి ఖంఘాలకు (మందిరం) పోతుంటారు. కొంతమంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది సచ్చా - సౌదా, రాధా - సొయామి, నిరంకారి డెరా ప్రజలు డెరా - సంప్రదాయాన్ని అనుసరిస్తుంటరు.
జిల్లాలో జైపూర్ నుండి రాష్ట్రస్థాయి వార్తాపత్రికలను గంగానగర్‌లో, రైసింగ్నగర్లలో పునఃప్రచురణ చేయబడుతున్నాయి. గంగానగర్‌లో " సీమా సందేశ్ " అనే హిందీ పత్రిక ముద్రించబడుతుంది.[6]
జిల్లాలో " ఎయిర్ సురత్గర్ " అనే రేడియో స్టేషను ఉంది. ఇది హిందిక్, రాజస్థానీ, పంజాబీ భాషలలో ప్రసారాలు అందిస్తుంది. 1981లో స్థాపించబడ్జింది. ఫ్రీక్వెంసీ 918.[7]
జిల్లాలో నిర్మించబడిన కాలువలు జిల్లాలో వృక్షజాలం, జంతుజాలంలో తగినంత మార్పును తీసుకు వచ్చింది. జిల్లాలో పెంపుడు జతువులు, సాధారణ జంతువులలో ఆటవిక జంతువులు ఉన్నాయి. రోజ్, నీల్గాయ్ (బొసెలాఫస్ ట్రాగోకెమేల్స్) సాధారణ క్షీరదాలను ఫాంలలో, ఇసుక తిన్నెలలో కనిపిస్తుంటాయి. రైతులు వారి పొలాలను ఈ జంతువుల నుండి రక్షించుకోవలసిన అవసరం ఉంది. కొన్ని సార్లు నీల్గాయ్ రహదారి మీద సంచరిస్తూ ప్రమాదాలకు కారణం ఔతున్నాయి. పాములు, గోహ్, సంహా (సద్న), అడవి ఎలుకలు వంటి అడవి జంతువులు కనిపిస్తుంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.