పక్షము
From Wikipedia, the free encyclopedia
Remove ads
పక్షము;-అనగా 15 [రోజులకు](లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి: 1.'శుక్ల పక్షం'( శుద్ధ తిధులు, అమావాస్య నుంచి పున్నమి వరకు)రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెలుపు అని అర్థం) 2.'కృష్ణ పక్షం (బహుళ పక్షం: పున్నమి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).
Remove ads
తిథి
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పక్షంలోని తిథులు
- పాడ్యమి (అధి దేవత - అగ్ని)
- విదియ (అధి దేవత - బ్రహ్మ)
- తదియ (అధి దేవత - గౌరి)
- చవితి (అధి దేవత - వినాయకుడు)
- పంచమి (అధి దేవత - సర్పము)
- షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)
- సప్తమి (అధి దేవత - సూర్యుడు)
- అష్టమి (అధి దేవత - శివుడు)
- నవమి (అధి దేవత - దుర్గా దేవి)
- దశమి (అధి దేవత - యముడు)
- ఏకాదశి (అధి దేవత - శివుడు)
- ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
- త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
- చతుర్దశి (అధి దేవత - శివుడు)
- పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)
Remove ads
ఇవి కూడా చూడండి
Look up పక్షము in Wiktionary, the free dictionary.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads