వృక్ష శాస్త్రీయ నామం అనగా ఒక మొక్కకి ప్రపంచ వ్యాప్తంగా అందరికి అమోదయోగ్యమైన పేరును శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నిర్ణయించడం. వృక్షశాస్త్రీయ నామంను ఆంగ్లంలో Botanical name అంటారు. శాస్త్రీయ నామంలో ప్రధానంగా రెండు పేర్లు ఉంటాయి. మొదటి పేరును ప్రజాతి నామమని, రెండవ పేరును జాతి నామమని పిలుస్తారు. ఇట్లా రెండు పేర్లతో జీవులను పిలవడాన్నే ద్వినామీకరణ విధానమని వ్యవహరిస్తారు. ఈ ద్వినామీకరణ పద్ధతిని గాస్పర్డ్ బాహిన్ (Gaspard Bauhin) 1596లో ప్రవేశపెట్టాడు. కరోలస్ లిన్నేయస్ (Linnaeus) 1753లో తన మొక్కల జాతులు (Species plantarum)లో ద్వినామీకరణ విధానాన్ని అన్ని మొక్కలకు అనువర్తింపజేశాడు.

Thumb
బొప్పాయి చెట్టు (దీని శాశ్త్రీయ నామం కారియా పాపయా) దృశ్యచిత్రం

కొన్ని మొక్కలు - శాస్త్రీయనామాలు

మరింత సమాచారం మొక్క, శాస్త్రీయనామం ...
మొక్కలు - వాటి శాస్త్రీయనామాలు
మొక్కశాస్త్రీయనామంఆధారం/మూలాలు
అరటిమ్యూస పారడైసిక[1]
అశ్వగంధివిథానియా సోమ్నిఫెరా[2]
ఆముదంరిసినస్ కమ్యూనస్
ఆపిల్ఫైరస్ మాలస్
ఆవాలుబ్రాసికా నైగ్రా
ఉమ్మెత్తదతూర మెటల్
ఉల్లిఎల్లియం సెపా
ఉసిరిఎంబ్లికా అఫిషినాలిస్
ఎర్ర చందనంరోకార్పస్ సాంటలైనస్
కందికజానస్ కజాన్
కాఫీకాఫియా అరబిక
కాలిఫ్లవర్బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
కొబ్బరికస్ న్యూసిఫెరా
క్యాబేజీబ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
గంజాయి (హెరాయిన్)కన్నాబినస్ సటైవం
గడ్డిచామంతిట్రైడాక్స్ ప్రొకెంబెన్స్
గోంగూరహైబిస్కస్ కన్నాబినస్
గోధుమట్రిటికం ఈస్టివం
జనుముక్రోటలేరియా జెన్షియా
చామంతిక్రైసాంథియమ్ ఇండికా
చింతటామరిండస్ ఇండికా
చిక్కుడుడాలికస్ లాబ్ లాబ్
చెరకుశాఖారమ్ అఫిసినెరం
జామసిడియం గువా
జీడిమామిడిఅనకార్డియం ఆక్సిడెంటేలిస్
జీలకర్రకుకుమినమ్ సిమినమ్
జొన్నసోర్గం వల్గేర్
టమాటోలైకోపెర్సికం ఎస్కులెంటమ్
టేకుటెక్టోనా గ్రాండిస్
తమలపాకుహైపల్ బీటిల్
తామరనీలంబో న్యూసిఫెరా
తులసిఆసిమం సాంక్టం[3]
తేయాకుధియోసైనెన్‌సిస్
దానిమ్మప్యూనికా గ్రనాటమ్
దాల్చిన చెక్కసిన్నమోమమ్ జైలానిక
ద్రాక్షవైటిస్ వినిఫెర
నువ్వులుసిసామమ్ ఇండికం
పత్తిగాసీపియం హెర్బీషియం
పనసఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
పామ్ఇల్యుసిస్ గైనన్‌సిస్
పెసరపేసియోలస్ అరియస్
పైనాపిల్ అనానాస్ సెటైవా
పొగాకునికోటియానా టొబాకమ్
ప్రొద్దు తిరుగుడుహీలియాంథస్ ఎన్యూవస్
బంగాళాదుంపసొలానం ట్యూబరోసమ్
బంతిటాజినెస్ పాట్యులా
బెండహైబిస్కస్ ఎస్కులేంటస్[1]
బఠాణిపైసమ్ సెటైవం
బార్లిహార్డియం వల్లారే
బిళ్ల గన్నేరువింకారోజియస్
బొప్పాయికారియా పపాయా
మందారహైబిస్కస్ రోజా సైనెన్సిస్[1]
మల్లెజాస్మినం ఇండికం
మామిడిమాంజిఫెరా ఇండికా[4]
మినుముపేసియోలస్ ముంగో
మిరియాలుపైపర్ నైగ్రం
మిరపకాప్సికం ప్రూటెన్సిస్
ముల్లంగిరఫానస్ సెటైవమ్
మెంతిట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
మొక్కజొన్నజియామేజ్
రాగులుఇల్యుసైన్ కొరకానా
లవంగంయాజీనియా కారియోఫిల్లెటా
వంగసొలానం మెలాంజినమ్
వరిఒరైజా సటైవా
వెదురుబాంబూసా
వెల్లుల్లిఎల్లియం సెటైవమ్
వేపఅజాడిరక్టా ఇండికా
వేరుశనగఅరాఖిస్ హైపోజియం
శనగసైసర్ అరాటినం
సజ్జపెన్నిసేటం టైపాయిడం
సీతాఫలంఅనోనా స్క్వామోజ
సోంపుపోనీక్యులమ్ వల్గేర్
సోయాబీన్గ్లైసిన్ మాక్స్
మూసివేయి

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.