Remove ads
From Wikipedia, the free encyclopedia
వెల్లుల్లి | |
---|---|
Allium sativum, known as garlic, from William Woodville, Medical Botany, 1793. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | Monocots |
Order: | Asparagales |
Family: | |
Subfamily: | Allioideae |
Tribe: | Allieae |
Genus: | |
Species: | A. sativum |
Binomial name | |
Allium sativum | |
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది[1] వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.[2]
వెల్లుల్లి (Garlic) [3] మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి. ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడా వెల్లుల్లి విలువని గుర్తించింది.
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట.
అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఒక బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి 1890లో సేకరించిన "బోవర్ మేన్యుస్క్రిప్ట్ (Bower Manuscript) అనే భూర్జపత్ర గ్రంథం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బొడ్లియెన్ గ్రంథాలయంలో ఉంది. ఇది ఆరవ శతాబ్దంలో రాసిన మాతృకకి నకలుట. ఈ గ్రంథంలో వెల్లుల్లి ప్రస్తావన అనేక సార్లు కనిపిస్తుంది.[4][5]
ప్రతి 100 గ్రాములలో లభ్యమయే పోషక విలువలు ఈ దిగువ చూపిన విధంగా ఉంటాయని అంచనా వేసేరు:
వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా వినియోగపడుతుంది. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రిక యాసిడ్ రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లి మీద చేసిన అనేక అధ్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని ఈ అధ్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. లూయీ పాశ్చర్ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన గాంగ్రీన్ వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు ఐరోపా దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు, మొదలైన వాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు. వెల్లుల్లిని పొడిగా కూడా తయారుచేసుకుని నిల్వవుంచు కుంటారు. ఒక చెంచాలో 1/8వ వంతు వెల్లుల్లి గుండ ఒక వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది. వెల్లుల్లిలో థయామిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడు పులో నులిపురుగుల నివారణకి, లివర్ (కాలేయం) వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్ని మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి దీనికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారానికి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని ఉత్పత్తులు గణనీయంగా ఉన్నా యి. ఈ కోవలో చైనా 12,088,000, ఇండియా 645,000, సౌత్ కొరియా 325,000, ఈజిప్ట్ 258,608, రష్యా 254,000, యునైటె డ్ స్టేట్స్ 221,810, స్పెయిన్ 142,400, అర్జంటీనా 140,000, మయన్‌మార్ 128,000, ఉక్రయిన్ 125,000క్వింటాలు ఉత్పత్తి చేస్తూ చైనా అగ్రస్థానంలోను, ఇండియా రెండ వస్థానం లోను నిలిచాయి. ఇంత విలువైన ఔషధ గుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
మనలో చాలా మందికి తరచుగా జలుబు, ముక్కు దిబ్బడ, జ్వరం వస్తు ఉంటాయి. అలాంటివారు వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది. అరచెంచా నేతిలో వేయించిన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజూ తినాలి. మీ ముఖం, శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు, మసాలా వస్తువులు తినకూడదు .
ఒక వెల్లుల్లి పాయ తిని, రాగిచెంబులో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం, మనం తినే ఆహారంలో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది . ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా? .. సగం నిమ్మకాయ రసంలో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము, సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయంలో కొవ్వుపదార్ధాలు, పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక). అర్ధ రాత్రి చెవిపోటు వస్తే ... డాక్టర్, మందులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది . గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది . రోజూ రెండు వెల్లుల్లి పాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సెర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది . వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి . వీళ్ళు వెల్లుల్లి తినరాదు . ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .
వెల్లుల్లి మసాల దినుసులు జాబితాలోకి వస్తాయి. దీనిని అన్ని రకాల కూరలోను రుచి కొరకు వేస్తారు. ముఖ్యంగా మసాలాలకు ఇది తప్పనిసరి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.