From Wikipedia, the free encyclopedia
వెల్కమ్ టు ది స్టిక్స్ 2008లో విడుదలైన ఫ్రెంచ్ హాస్యరసప్రధాన చిత్రం. 'డానీ బూన్' దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కాడ్ మేరడ్, డానీ బూన్ లు నటించారు. ఫ్రాన్స్ చలనచిత్రరంగంలో దాదాపు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం, 793 సైట్లలో మొదటి చలనచిత్రంగా నిలిచింది.[2]
వెల్కమ్ టు ది స్టిక్స్ | |
---|---|
దర్శకత్వం | డానీ బూన్ |
రచన | డానీ బూన్, అలెగ్జాండర్ షార్లెట్, ఫ్రాంక్ మాగ్నియర్ |
నిర్మాత | క్లాడ్ బెర్రి, జెరోం సెడౌక్స్ |
తారాగణం | కడ్ మెరడ్, డానీ బూన్, జోయ్ ఫెలిక్స్ |
సంగీతం | ఫిలిప్ రోంబి |
పంపిణీదార్లు | పతే డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీ | 20 ఫిబ్రవరి 2008 |
సినిమా నిడివి | 106 నిముషాలు |
దేశం | ఫ్రాన్సు |
భాష | ఫ్రెంచి భాష |
బడ్జెట్ | 11 మిలియన్ల యూరోలు ( దాదాపు 15 మిలియన్ల డాలర్లు) |
బాక్సాఫీసు | 245,144,417 డాలర్లు[1] (దాదాపు 162,347,296 యూరోలు) |
చిత్ర కథానాయకుడైన ఫిలిప్ అబ్రామ్స్, నిరుత్సాహంగా ఉన్న తన భార్య జూలీని సంతోషంగా ఉంచడంకోసం సముద్రతీరానికి బదిలీచేయించుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఒక నేరారోపణపై ఉత్తర ఫ్రాన్స్ లోని బెర్గూస్ పట్టణముకు పంపివేయబడుతాడు. తన కుటుంబంను విడిచి సుదూర ప్రాంతంలో ఉన్న తనకు అక్కడి వాతావరణం నచ్చదు. ఎన్నో కష్టాలను అనుభవించి, మూడు సంవత్సరాల తరువాత తిరిగివస్తాడు. తన కుటంబంతో తాను కోరుకున్న ప్రాంతానికి వెలుతాడు.
Seamless Wikipedia browsing. On steroids.