వెంకయ్య స్వామి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక అవధూత. నెల్లూరు జిల్లాలోని గొలగలమూడి వెంకయ్య స్వామి ఆలయం ప్రసిద్ధ క్షేత్రం.[1] ఈ క్షేత్రం నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలంలో ఉంది.[2] ఈ ఆలయ స్వామి వెంకయ్యను ఆ ప్రాంత ప్రజలు భగవంతునిగా కొలుస్తారు.తెనాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కంచర్లపాలెంలో మరొక వెంకయ్య స్వామి ఆశ్రమం ఉంది.[3]   

త్వరిత వాస్తవాలు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం, పేరు ...
శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం
Thumb
పేరు
స్థానిక పేరు:శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:నెల్లూరు
ప్రదేశం:గొలగలమూడి
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వెంకయ్యస్వామి
ప్రధాన పండుగలు:వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
మూసివేయి
Thumb
గొలగమూడి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రచురించిన వాల్ పోస్టర్
Thumb
శ్రీ వెంకయ్య స్వామిదేవాలయము ముందువున్న భజన మందిరం, గొలగమూడి

జీవిత చరిత్ర

ఇతని స్వస్థలం ఆత్మకూరు సమీపం లోని నాగుల వెల్లటూరు ఇతను చిన్నతనంలో అందరి బాలురువలే ఉండేవాడు కాదు.చిన్నతనం నుంచే ఏకాంతలో గడిపేవాడు. ఆ వూరి లోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే ఇతని వద్దకు వచ్చి తగువు తీర్చమనేవారు. ఇతను ఒక అవదూతగా, షిర్డీ సాయి తరువాతి అవతారంగా చెపుతారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివానిగా పిలవబడుతూ 12 సంవత్సరాలు ఎక్కడ తిరిగాడో తెలియదు. తదనంతర కాలంలో గొలగలమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వడం చేసేవారు. సత్యంగల నాయన అని పేరు పొందాడు. తన వద్దకు వచ్చిన భక్తుల నుద్దేశించి వారికోసం తన సందేశాలను తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవాడు. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దేవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి.

వెంకయ్యస్వామి ఆలయం

వెంకయ్య ఆలయంచుట్టు విశాలమైన ప్రాకారం నిర్మించారు.ప్రాకార ముఖద్వారం వద్దనిలుచొని చూసిన గర్భగుడి లోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కన్పిస్తుంది.. గర్భగుడి పైన గోపురం ఉంది. గర్భగుడి చుట్టు స్ధంబాలమీద స్లాబు వేసారు. ముఖద్వారానికి ఎడమపక్కన ధుని (అగ్ని గుండం) ఉంది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ధునిలో ఎండుకొబ్బరికాయ, నవధాన్యాలు, ధూపద్రవ్యాలు 3 లేదా 6 లేదా 9 సార్లు ధునిచుట్టు ప్రదక్షిణచేసి ఇందులో వేస్తారు. ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్లి వెంకయ్య స్వామి దర్శనం చేసుకుంటారు. గర్భగుడిలోని వెంకయ్యస్వామి విగ్రహాన్ని పాలరాతితో చేసారు.గర్భగుడి ద్వారానికి ఎదురుగా జ్యోతి వెలుగుతుంది. జ్యోతిపక్కన వెండి పాదుక ఉంది. భక్తులు జ్యోతికి నమస్కరించి, పాదుకను తాకి, దర్శనం చేసుకుంటారు. పుజారి తీర్థం ఇచ్చిన తరువాత, వుడికించిన శనగలను ప్రసాదంగా యిస్తారు. వెంకయ్యస్వామి గుడికి చేరువలోనే, గుడికిఎడమ వైపున ఆంజనేయస్వామి ఆలయంవుంది. వెంకయ్య గుడికి కుడి వైపున, రోడ్డుకు అవతలి వైపున వెంకయ్యస్వామి నివాసమున్న కుటీరముంది.కుటీరం గోడలు మట్టితో కట్టబడి, పైన గడ్దితో కప్పిన కప్పు ఉంది. కుటీరం పాడవ్వకుండ ఈ కుటీరం చుట్టు కాంక్రీట్‌ స్దంభాలతో స్లాబు వేశారు. కుటీర దర్శనం చేసుకున్న భక్తులకు పవిత్రదారం యిస్తారు. వెంకయ్య బ్రతికివున్నప్పుడు తనవద్దకు వచ్చిన వారికి వారి రోగనివారణ, పీడల నీవారణకై ఇలా దారం యిచ్చేవాడు. కుటీరం ముందు ప్రక్కన రామాలయం వుంది..

మొక్కులు

స్వామి ధర్శనానికి వచ్చు భక్తులు కొందరు తమ తలనీలాలను సమర్పించుకుంటారు.తలనీలాలను తీయు క్షురశాల ఉంది.ఆలయ నిర్వహణపనులు ఒక అడ్‌హక్‌ కమిటి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఉచిత అన్నదాన సత్రం ఉంది. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు. మరుసటిరోజు స్వామి దర్శనంచేసుకుని తిరుగు ముఖం పడతారు. ఆలాగే అంతకు ముందు స్వామి వారిని దర్శనం వలన కోరికలు తీరినవారుకూడ మళ్ళి వచ్చి యిక్కడ రాత్రి నిదురచేస్తారు. భక్తులు రాత్రి నివసించుటకై బయలు ప్రదేశం ఉంది. భక్తులు శయనించుటకై చాపలు యిచ్చట అద్దెకు/బాడుగకు లభిస్తాయి. అడ్‌హక్‌ కమిటి వారు భక్తుల చందాలతో ఎ.సి./నాన్‌ఎ.సి. విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, దర్శనం చేసుకుని, రాత్రి యిచ్చటనే గడిపి వెళతారు.

సౌకర్యాలు

గొలగమూడిలో భక్తుల సౌకర్యార్ధం రూ.7.8 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టారు. ఆలయం ముందు వైభవోత్సవ మండపం నిర్మించారు. పాఠశాల, అన్నదానానికి వేర్వేరుగా ట్రస్టులు ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి 44 ఎకరాల 31 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో 105 గదులు, పాఠశాల భవనం, భోజనశాల నిర్మించారు.

ఆదాయం

2006 కు ముందు రూ. 7.69 కోట్ల ఆదాయం ఉండగా, గడిచిన ఐదేళ్లలో రూ.22.12కోట్ల ఆదాయం పెరిగింది.

ఆరాధనోత్సవాలు

ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఆరాధనోత్సవాలు జరుగుతున్న రోజుల్లో అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.

పత్రిక

వెంకయ్య స్వామి తత్వచింతనను ప్రసారం చేయటానికి "భగవావ్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప" అనే తత్వచింతనాధ్యేయ ఆధ్యాత్మిక మాసపత్రిక స్థాపించబడింది. ఇది వెంకయ్యస్వామి, షిర్డీ సాయిబాబా వంటి మహాత్ముల సాన్నిధ్యాన్ని అందిస్తుంది.

సూక్తులు

వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులు దేవాలయ కుడ్యాలపై రాసారు.వాటిలో ముఖ్యమైన కొన్ని

  • ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.
  • ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.
  • సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.
  • అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.
  • కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.
  • ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.
  • పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.
  • అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.