విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం

From Wikipedia, the free encyclopedia

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంmap
Remove ads

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: VTZ, ICAO: VOVZ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం లో గల పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది భారత నావికాదళ విమానాశ్రయం ఆధ్వర్యంలో పౌరవిమానయానసేవలందిస్తుంది. గాజువాక, ఎన్ఎడిక్రాస్ రోడ్ నగర ప్రాంతాల మధ్య వుంది. 21శతాబ్ది ప్రారంభంలో వేగంగా విస్తరించబడింది. కొత్త టర్మినల్, రన్వే నిర్మించినతరువాత ఆంతర్జాతీయ విమానసేవలు ప్రారంభించబడ్డాయి. 350 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం వుంది.

త్వరిత వాస్తవాలు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, సంగ్రహం ...
Remove ads
Remove ads

చరిత్ర

Thumb
విమానాశ్రయం పచ్చని పరిసరాలు

1981లో రోజుకు,ఒక్క విమానం ద్వారా ఈ విమానాశ్రయం పనిప్రారంభించింది. తొలి రన్వే , 6,000 అ. (1,800 మీ.) పొడుగు కలది.10,007 అ. (3,050 మీ.) పొడవు, 45 మీ. (148 అ.) వెడల్పుగల కొత్త రన్వే 2007 జూన్ 15 న ప్రారంభించడంతో మధ్యరకం వెడల్పైన విమానాలు సేవలు మొదలయ్యాయి. ఐఎల్ఎస్ (ILS) సేవలు వాణిజ్య విమానసేవలకు 2008 మార్చి 30 న న ప్రారంభమయ్యాయి. కొత్త టర్మినల్ భవనం 27 మార్చి 2009 ఉపయోగం లోకి వచ్చింది.[4]

Remove ads

సేవలు

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత రద్దీ గల, పెద్ద విమానాశ్రయం.ఇక్కడి నుండి ఇండిగో,స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ట్రుజెట్,సిల్క్ ఏయిర్వేస్, శ్రీలంక ఏర్ లైన్స్ వంటి సర్వీసులు దేశ విదేశాలకు విమాన రాకపోకలు జరుగుతుంటాయి.ఇక్కడి నుండి ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి,చెన్నై,ముంబై,బెంగళూరు,ఢిల్లీ ,వారణాసి నగరాలకు విమాన సర్వీసులు కలవు.

మూలాలు

బయటి లంకెలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads