From Wikipedia, the free encyclopedia
1952, మార్చి 7న ఆంటిగ్వా లోని సెయింట్ జాన్స్ లో జన్మించిన వివియన్ రిచర్డ్స్ పూర్తి పేరు ఐజాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్ (Sir Isaac Vivian Alexander Richards). అయిననూ అతడు వివియన్ లేదా వివ్ రిచర్డ్స్ గానే ప్రసిద్ధి చెండాడు. ఇతడు వెస్ట్ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 2002లో వివ్ రిచర్డ్స్ వన్డేలలో సర్వకాల అత్యున్నత బ్యాట్స్‌మెన్‌గా గుర్తించబడ్డాడు. కాని 2003లో భారత్ కు చెందిన సచిన్ టెండుల్కర్ కు ప్రథమస్థానం ఇచ్చి ఇతనికి ద్వితీయస్థానంతో సరిపెట్టారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఐసాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | [1] సెట్ జాన్స్, బ్రిటిష్ లీవార్డ్స్ ఐలాండ్స్ | 1952 మార్చి 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మాస్టర్ బ్లాస్టర్, స్మోకిన్ జో,[2][3] కింగ్ వివ్[4] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (1.78 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batsman | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 151) | 1974 నవంబరు 22 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1991 ఆగస్టు 8 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 14) | 1975 జూన్ 7 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1991 మే 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1971–1981 | Combined Islands | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1971–1991 | Leeward Islands | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1974–1986 | Somerset | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1976/77 | Queensland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990–1993 | Glamorgan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2007 ఆగస్టు 18 |
వివియన్ రిచర్డ్స్ తన తొలి టెస్ట్ జీవితాన్ని 1974లో భారత్‌పై బెంగుళూరులో ఆరంగేట్రం చేసాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో 192 పరుగులతో నాటౌట్‌గా నిల్చాడు. టెస్టులలో అతడు మొత్తం 121 మ్యాచ్‌లు ఆడి 50.23 సగటుతో 8540 పరుగులు చేసాడు. అందులో 24 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 291 పరుగులు. టెస్టులలో 50 సార్లు వెస్టిండీస్ కు నాయకత్వం వహించి 24 సార్లు గెలిపించాడు. కెప్టెన్‌గా ఓడిపోయినవి కేవలం 8 మాత్రమే. ఇప్పటివరకు కూడా ఒక్క టెస్ట్ సీరీస్ ఓడిపోని వెస్ట్ఇండీస్ కెప్టెన్‌గా రికార్డు అతని పేరిటే ఉంది. 1986లో ఆంటిగ్వాలో ఇంగ్లాండుకు విరుద్ధంగా టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించినవాడిగా రికార్డు సృష్టించాడు. టెస్టులలో వివ్ 84 సిక్సర్లు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 291 వెస్ట్ఇండీస్ తరఫున ఆరవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1976 సంవత్సరం అతనికి కలిసివచ్చిన సంవత్సరం. టెస్టులలో 90.00 సగటుతో 11 సెంచరీలతో మొత్తం 1710 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోరు 291 పరుగులు కూడా ఇదే కాలంలో సాధించబడింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఇతని రికార్డు 30 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి 2006 నవంబర్ 30నాడు పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్ ఈ రికార్డును అధికమించాడు.
వివ్ రిచర్డ్స్ 187 వన్డేలు ఆడి 6721 పరుగులు సాధించాడు. అతని తొలి వన్డే శ్రీలంకపై 1975లో ఆడినాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 189 నాటౌట్. 11 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు కూడా వన్డేలలో సాధించాడు. 1986-87 లో ఒకే వన్డేలో సెంచరీ, 5 వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు. 2005 వరకు వన్డేలలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా గుర్తించబడ్డాడు.
1975, 1979, 1983. 1987 ప్రపంచ్‌కప్ క్రికెట్లో వివ్ రిచర్డ్స్ వెస్ట్ఇండీస్ జట్టుకు ఇతను ప్రాతినిధ్యం వహించాడు. 1975, 1979 లో జరిగిన మొదటి, రెండో ప్రపంచ కప్ లను గెలిచిన వెస్ట్ఇండీస్ జ ట్టు లో ఇతను కీలక ఆటగాడు. 1979లో లార్డ్స్ లో జరిగిన ఫైనల్ లో వివ్ సెంచరీతో వెస్ట్ఇండీస్ కు విజయం చేకూర్చాడు.1983లో కూడా ఫైనల్ వరకు వచ్చి కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ చేతిలో పరాజయం పొందినారు.
1980లలో వివియన్ రిచర్డ్స్ ఒక భారతీయ సినిమా నటి నీనా గుప్తా తో సంబంధం పెట్టుకుని మసాబ గుప్తా అనే కుమార్తెను కన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.