కె. విజయ భాస్కర్

సినీ దర్శకుడు From Wikipedia, the free encyclopedia

కె. విజయ భాస్కర్

కుంభకోణం విజయ భాస్కర్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రార్థన ఆయన మొట్టమొదటి సినిమా. నువ్వే కావాలి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేశాడు. ఆయన సినిమాలు చాలా వరకు హాస్య ప్రధానంగా సాగుతాయి.

త్వరిత వాస్తవాలు కె. విజయ భాస్కర్, జననం ...
కె. విజయ భాస్కర్
Thumb
జననం
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
మూసివేయి

బాల్యం, విద్యాభ్యాసం

ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఆయన పదో సంవత్సరంలో కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరాడు. [1] చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. 1979లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి అక్కడే ఏడేళ్ళపాటు పనిచేశాడు.

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, పేరు ...
సంవత్సరం పేరు భాష గమనికలు
1991 ప్రార్థన తెలుగు
1999 స్వయంవరం తెలుగు
2000 నువ్వే కావాలి తెలుగు నిరమ్ రీమేక్
2001 నువ్వు నాకు నచ్చావ్ తెలుగు
2002 మన్మధుడు తెలుగు
2003 తుఝే మేరీ కసమ్ హిందీ నిరమ్ రీమేక్
2004 మల్లీశ్వరి తెలుగు
2005 జై చిరంజీవ తెలుగు
2007 క్లాస్‌మేట్స్ తెలుగు క్లాస్‌మేట్స్ రీమేక్
2008 భలే దొంగలు తెలుగు బంటీ ఔర్ బబ్లీకి రీమేక్
2011 ప్రేమ కావాలి తెలుగు
2013 మసాలా తెలుగు బోల్ బచ్చన్ రీమేక్
2023 జిలేబి తెలుగు
2024 ఉషా పరిణయం తెలుగు [2][3]
మూసివేయి

పురస్కారాలు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.