విజయనగరం రైల్వే స్టేషను
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషను (Vizianagaram railway station), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషను.
Vizianagaram Junction విజయనగరం జంక్షన్ विजयनगरम जंक्शन | |
---|---|
భారతీయ రైల్వే Junction Station | |
సాధారణ సమాచారం | |
Location | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 18°06′43″N 83°23′46″E |
Elevation | 74 మీ. (243 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము of హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము and Jharsuguda-Vizianagaram line |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | Broad gauge 1,676 mm (5 ft 6 in) |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on ground station) |
పార్కింగ్ | Available |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | VZM |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Opened | 1900 |
Previous names | బెంగాల్ నాగపూరు రైల్వే |
ప్రయాణికులు | |
ప్రయాణీకులు () | 150,000+ |
1893 - 1896 సంవత్సరాల మధ్య, 1,288 కి.మీ. (800 మై.) of the తూర్పు తీర స్టేట్ రైల్వే ప్రజల కోసం తెరవబడింది. 1898-99 మధ్య, బెంగాల్ నాగపూర్ రైల్వే దీనికి లింకు చేయబడింది.[1] విజయనగరం రైల్వే స్టేషను ఈ మధ్యకాలంలో ప్రారంభించబడింది. విజయనగరం రైల్వే స్టేషను వద్ద నుండి రైల్వేను హౌరా, రాయపూర్ విడీపోతుంది.విజయనగరం జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషను కావడం వల్ల చాల మంది ఈ రైల్వే స్టేషను గుండా ప్రయాణాలు చేస్తారు. దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి వేగవంత రైళ్ళూ ఇక్కడ ఆగుతాయి. వాల్థ్రర్ డీవీజన్ లో ఈ రైల్వే స్టేషనును మొదటీ తరగతి రైల్వే స్టేషను వర్ఘికరించారు. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉండటం వల్ల ఆ మార్గంలో ప్రయాణం చెయూ ప్రధాన రైలు బళ్ళూ ఆగుతాయ్.
79 కి.మీ. (49 మై.) విజయనగరం - పార్వతీపురం బ్రాంచి లైను 1908-09 సంవత్సరంలో ప్రారంభించబడింది.[1]
బెంగాల్ నాగపూర్ రైల్వే 1944లో జాతీయం చేయబడింది.[2] ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ, బెంగాల్ నాగపూర్ రైల్వే లలోని కొన్ని భాగాలతో తూర్పు రైల్వే తేదీ 1952 ఏప్రిల్ 14 న ప్రారంభించబడింది.[3] తూర్పు రైల్వేలోని కొన్ని భాగాలతో ఆగ్నేయ రైల్వే 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఎక్కువ ప్రాంతాలు పూర్వపు బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందినవే.[3][4] ఏప్రిల్ 2003 సంవత్సరంలో ఆగ్నేయ రైల్వే నుండి తూర్పు తీర రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వే లను ఏర్పాటుచేయబడ్డాయి.[3]
పలాస-తిలారు, శ్రీకాకుళం రోడ్డు-చీపురుపల్లి, చీపురుపల్లి-అలమండ రైలుమార్గాలు1998-99 మధ్యన విద్యుదీకరణ చేయబడ్డాయి. శ్రీకాకుళం-తిరాలు రైలుమార్గం మాత్రం 1999-2000 మధ్యన విద్యుదీకరించబడింది.[5]
ఈ రైల్వే స్టేషన్లో రెండు డబుల్ బెడ్డున్న నాన్-ఏ.సి. విశ్రాంతి గదులు, ఒక 8-పడకల డార్మిటరీ సౌకర్యాలు ఉన్నాయి.[6]
విజయనగరం రైల్వే స్టేషను ప్రతీ రోజూ సుమారు 153,000 ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.[7]
రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
12703/04 | ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ రైల్వే స్టేషను | హౌరా | ప్రతిరోజూ |
12839/40 | "హౌరా చెన్నై మెయిల్" | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
12863/64 | హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | యశ్వంతపూర్ | ప్రతిరోజూ |
17015/16 | విశాఖ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | భువనేశ్వర్ | సికింద్రాబాద్ రైల్వేస్టేషను | ప్రతిరోజూ |
11019/20 | కోణార్క్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | భువనేశ్వర్ | లోకమాన్య తిలక్ టెర్మినస్ | ప్రతిరోజూ |
18645/46 | ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | హౌరా | హైదరాబాద్ | ప్రతిరోజూ |
18463/64 | ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | భువనేశ్వర్ | బెంగుళూరు | ప్రతిరోజూ |
18189/90 | టాటానగర్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | టాటానగర్ | అలప్పుఝ | ప్రతిరోజూ |
13351/52 | ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | ధన్‌బాద్ జంక్షన్ | అలప్పుఝ | ప్రతిరోజూ |
18517/18 | కోర్బా - విశాఖపట్నం | ఎక్స్‌ప్రెస్ | కోర్బా | విశాఖపట్నం | ప్రతిరోజూ |
18047 | అమరావతి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | హౌరా | వాస్కోడ-గామా | ఆది,మంగళ,బుధ,శుక్రవారాలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.