విజయకుమార్ (నటుడు)

సినీ నటుడు, రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia

విజయకుమార్ (నటుడు)

విజయకుమార్ తమిళనాడుకు చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. తమిళ సినిమాలే కాక తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.

త్వరిత వాస్తవాలు విజయ కుమార్, జననం ...
విజయ కుమార్
జననం
పంచాక్షరం రంగసామి

(1943-08-29) 29 ఆగస్టు 1943 (age 81)
నట్టుచాలై, పట్టుకొట్టై, తమిళనాడు[1]
వృత్తినటుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1961, 1973 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • ముత్తుకన్ను (m.1969–ప్రస్తుతం)
  • మంజుల (m.1976–2013) (మరణించే దాకా)
పిల్లలుకవిత
అనిత
అరుణ్ విజయ్
వనితా విజయ కుమార్
ప్రీతా విజయకుమార్
శ్రీదేవి
తల్లిదండ్రులురంగసామి
చిన్నమ్మాళ్[2]
మూసివేయి

వ్యక్తిగతం

విజయ కుమార్ తమిళనాడులోని తంజావూరు జిల్లా, పట్టుకోట్టై తాలూకా, నట్టుచాలై అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు. ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి, రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు అరుణ్ విజయ్ నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి విజయకుమార్ కొన్ని సినిమాలలో నటించారు.

కెరీర్

విజయ కుమార్ మొదటి సారిగా 1961 లో శ్రీవల్లి అనే తమిళ సినిమాలో బాలనటుడిగా నటించాడు. శివాజీ గణేశన్, పద్మిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఆయన బాల కుమార స్వామిగా నటించాడు. [3]

నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.