2001 సినిమా From Wikipedia, the free encyclopedia
మృగరాజు గుణశేఖర్ దర్శకత్వం వహించిన 2001 నాటి యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఇందులో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు.[1] సిమ్రాన్, సంఘవి, నాగేంద్ర బాబు సహాయక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చాడు. దీన్ని వెట్టక్కారన్ పేరుతో తమిళం లోకి అనువదించారు. దీని హిందీ వెర్షన్‌కు రక్షక్, ది ప్రొటెక్టర్ అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని దేవి పుత్రుడు, నరసింహ నాయుడు లతో పాటు ఒకే రోజున విడుదల చేశారు.
ఈ చిత్రం అడవి నేపథ్యంలో చిత్రీకరించబడ్డది. ఎన్నో భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమైంది.
ఒక అడవిలో, మనిషి రుచిమరిగిన సింహం నివసిస్తోంది. రైలు వంతెనను నిర్మిస్తున్న చీఫ్ ఇంజనీరు ఆ సింహానికి తాజాగా బలైన మనిషి. అతడి స్థానంలో ఐశ్వర్య ( సిమ్రాన్ ) ను వంతెన నిర్మాణానికి వెళ్ళమని రైల్వే విభాగం అడుగుతుంది. ఐశ్వర్య నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన తరువాత కూడా, సింహం నిర్మాణ బృందంలోని సిబ్బందిని భయపెట్టడం కొనసాగిస్తుంది. అడవిపల్లిలో ఉన్న మహా గురికాడు మహా వేటగాడు రాజు (చిరంజీవి) కు సింహాన్ని వేటాడే పనిని అప్పగించారు.
మొదటి సగంలో మిగిలిన భాగమంతా రాజు సింహాన్ని బంధించడం, అప్పన్న దొర ( నాగేంద్ర బాబు) ను కోల్పోయి దాన్ని చంపెయ్యడంతో గడుస్తుంది. కానీ అడవిలోని ఇతర సింహం తన సహచరుడిని చంపినందుకు రాజుపై కోపంగా ఉంటుంది. ఫారెస్ట్ రేంజరు (సూర్య), స్థానిక స్మగ్లర్ల ( రామిరెడ్డి ) రూపంలో వంతెన ప్రాజెక్టుకు మరో ఇబ్బంది పొంచి ఉంది. రాజు విరామం లోపు ఈ ఇద్దరు గూండాలను కూడా వదిలించుకుంటాడు.
అప్పుడు ఐశ్వర్య రాజు భార్య అని ప్రేక్షకులకు తెలుస్తుంది. రెండవ భాగంలో, ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. తన మూలికలను అడవి నుండి అమ్మేందుకు క్రాఫ్ట్స్ ఫెయిర్‌లో పాల్గొనడానికి రాజు నగరానికి వస్తాడు. అక్కడ, అతను తన కాబోయే భర్త విక్కీ ( రాజా రవీంద్ర ) తో కలిసి ఒక సరదా దుకాణాన్ని సందర్శించడానికి వచ్చిన ఐశ్వర్యను కలుస్తాడు. ఐశ్వర్య బెలూన్ షూటింగ్ వద్ద షూట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె చేయలేదని చెప్పి విక్కీ ఆమెను నిరాశపరుస్తాడు. అది చూసిన రాజు ముందుకు వచ్చి ఆమెకు విశ్వాసం కలిగించి, షూట్ చేయడానికి చిట్కాలు ఇస్తాడు. అప్పుడు ఐశ్వర్య బుల్లెట్ సరిగ్గా బుల్స్ ఐలో తగులుతుంది. రాజు చేసిన సహాయం పట్ల సంతోషించిన ఆమె, అతడిని తన నిశ్చితార్థం పార్టీకి రమ్మని ఆహ్వానిస్తుంది.
పార్టీలో, విక్కీ మరొక అమ్మాయితో సరసాలాడుతూండడం రాజు గమనిస్తాడు. అతడికి మంచి మనిషిగా జీవించడం లోని ప్రాముఖ్యత గురించి చెబుతాడు. ఐశ్వర్య ఈ మొత్తం వ్యవహారాన్ని వెనుక నుండి చూస్తుంది. స్త్రీలోలుడైన విక్కీతో పోలిస్తే రాజే నమ్మకమైన వ్యక్తి, తనకు తగునవాడని ఆమె నిర్ణయిస్తుంది. రాజు కావాలని కోరుకుంటుంది. వారు పెళ్ళి చేసుకుంటారు. ఐశ్వర్య తండ్రి అపార్థాలను సృష్టించి చాకచక్యంగా దంపతులను విడదీస్తాడు. మిగిలిన చిత్రం రాజు, ఐశ్వర్య తమ వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకుంటారు, వంతెన నిర్మాణాన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది చూపిస్తుంది.
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "రామయ్య పాదాలెట్టి" | శంకర్ మహదేవన్ | 6:00 | ||||||
2. | "అలే లే అలే లే" | ఉదిత్ నారాయణ్, ఎస్. పి. శైలజ | 5:36 | ||||||
3. | "సత్తామనమన్నదిలే" | హరిహరన్, సాధనా సర్గం | 5:38 | ||||||
4. | "చాయ్ చాయ్" | చిరంజీవి | 6:00 | ||||||
5. | "హంగామా హంగామా" | రఘు కుంచె, కె.ఎస్.చిత్ర | 5:29 | ||||||
6. | "దమ్మెంతో" | సుఖ్వీందర్ సింగ్, స్వర్ణలత | 5:28 | ||||||
34:11 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.