From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 మర్చి 1 - 2019 మే 13
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
← పాత చర్చ 64 | పాత చర్చ 65 | పాత చర్చ 66 →
సినిమాల పేజీల్లో రెండు సమాచారపెట్టెలు కనబడుతున్నాయి - {{infobox film}}, {{సినిమా}}. మొదటి దాన్ని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ వర్గం:ఫలానా సంవత్సరం సినిమాలు ఆనే వర్గంలోకి చేరుతోంది. రెండో దాన్ని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ వర్గం:ఫలానా సంవత్సరం తెలుగు సినిమాలు అనే వర్గంలోకి చేరుతోంది. ఈ రెండు వర్గాలు వర్గవృక్షంలో ఒకదాని కింద ఒకటి ఉండే రకం. హారిజాంటల్గా ఉండేవి కావు. అందుచేత, ఏ పేజీ కూడా ఈ రెండు వర్గాల్లోకీ చేరకూడదు. రెండో వర్గానికి మిదటిది మాతృవర్గం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మూసలు ఉండటం చేత, కొన్ని పేజీలు మొదటి వర్గంలోకి, మరికొన్ని రెండో వర్గంలోకీ చేరుతున్నాయి. సులువైన పరిష్కారంగా {{infobox film}} ను సవరించి, ఆ మూసలో ఉన్న వర్గాన్ని మారిస్తే సరిపోతుంది అని నేను భావిస్తున్నాను. రవిచంద్ర గారూ, నేనేమైనా మిస్సయ్యానేమో తెలియదు. మీరు సినిమాలపై పనిచేస్తున్నారు కాబట్టి, సమస్య ఎక్కడుందో మీరు సరిగ్గా కనుక్కోగలరు. ఈ సంగతిని పరిశీలించి తగు విధంగా పరిష్కరించగలరా? __చదువరి (చర్చ • రచనలు) 03:12, 1 మార్చి 2019 (UTC)
నేను నా నిర్వాహకహోదా నుంచి స్వచ్ఛందంగా వైదొల్గుటకై నిర్ణయించి నిర్వాహకుల నోటీసుబోర్డులో పేర్కొన్నాను. ఇదివరకే నిర్ణయించిన ప్రకారం నేను రాజీనామా సమర్పిస్తున్నాను. రాజీనామాను ఆమోదించిన తర్వాత సభ్యుడిగా ఉంటూ, అవసరమైతే "తెవికీ విమర్శకుడి"గా మారి తెవికీని సంస్కరించడానికి, తెవికీలో లోటుపాట్లను లేవనెత్తి తెవికీ ప్రగతికి తోడ్పడగలను. అలాగే ప్రధాన చర్చలలో సీనియర్ సభ్యుడిగా పాల్గొనగలను. నిర్వాహకహోదాలో ఉంటూ ఒకవైపు నిర్వహణ చేయజాలని స్థితిలో మరోవైపు తెవికీలో జరుగుతున్న (ముఖ్యంగా నిర్వహణ లోపాలను) లేవెనెత్తే స్థితిలో లేని కారణంగా నిర్వాహక హోదా నుంచి బయటపడాలని నిర్ణయించాను. ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన వారికి కృతజ్ఞతలతో ... సి. చంద్ర కాంత రావు- చర్చ 17:29, 1 మార్చి 2019 (UTC)
సహ సభ్యులకు నమస్తే. సముదాయాల్లో చర్చలు, వాతావరణం ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా Community Health Initiatives పేరిట పని సాగుతోంది. అలా చేపడుతున్న చర్యల్లో భాగంగా పాక్షిక నిరోధం విధించగల ఉపకరణం ఒకటి అందుబాటులోకి వస్తోంది.
మనం వికీపీడియాలో విధించే నిరోధాలు శిక్షలు కావనీ, కేవలం అవతలివారు వికీపీడియాను దెబ్బతీయకుండేందుకే నిరోధాలు విధిస్తున్నాం అంటున్నాం కనుక ఇలా పాక్షిక నిరోధాలు ఉంటే దానికి మార్గం సుగమం చేస్తాయని నమ్ముతున్నాను. దీనిపై మనం చర్చించి, అన్ని విధాలా బావుందనుకుంటే తెచ్చుకుందాం. మరింత సమాచారం కోసం మెటాలో ఈ పేజీ చూడండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:10, 9 మార్చి 2019 (UTC)
తెలుగు వికీపీడియాలో సమిష్టిగా ఒక అంశంపై పనిచేయాలని, నాణ్యతా మెరుగుపరచాలని ఎన్నో సందర్భాల్లో చర్చలు చేసుకున్నాం. కొన్నిసార్లు ఆ విధంగా పనీ చేశాం. మళ్లీ సమిష్టిగా పనిచేయడం మొదలుపెడదాం. ఈసారి నాణ్యత పెంచేలా ఆ పని సాగిద్దాం. ఇందుకోసం ఇదీ ప్రతిపాదన:
"అందర మొకటై చేయి కలిపితే ఎదురేమున్నది" అంటూ ఆ విధంగా ముందుకుపోదాం. --పవన్ సంతోష్ (చర్చ) 04:45, 11 మార్చి 2019 (UTC)
సాధారణంగా నెలకు ఇంతని ఖర్చుచేసి ఖాతా తీసుకుంటే కానీ అందుబాటులోకి రాని పే వాల్డ్ పబ్లికేషన్లు, డేటాబేస్లు, డిజిటల్ లైబ్రరీలు, వగైరా వికీపీడియన్లకు కొన్ని ఖాతాల చొప్పున ఉచితంగా అందుబాటులోకి వచ్చేలా ద వికీపీడియా లైబ్రరీ అన్న ప్రాజెక్టు ద్వారా కృషి జరుగుతోందన్న సంగతి తెలిసే వుంటుంది. వందలు, వేలాది పుస్తకాలు, పత్రికలు అలా ప్రపంచవ్యాప్తంగా వికీపీడియన్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తెలుగులో అలా అందుబాటులోకి తీసుకువద్దామన్నా మనకు ప్రత్యేకించి పే వాల్డ్ డిజిటల్ లైబ్రరీలు అరుదు. (నాకు తెలిసి లేవు) కాబట్టి మనకున్న ఇ-బుక్స్ స్టోర్ అయిన కినిగె వారితో మాట్లాడి ద వికీపీడియా లైబ్రరీ ప్లాట్ ఫాం ద్వారా నెలకు 10 పుస్తకాలు ఉచితంగా మనకు అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నాం. ఇవి అచ్చంగా కాక నెలరోజుల అద్దె పద్ధతిలో వస్తాయి. ఇక్కడ ద వికీపీడియా లైబ్రరీ వారి కార్డ్ ప్లాట్ ఫాం వద్ద దీనిని అప్లై చేసుకోవచ్చు.
ఈ భాగస్వామ్యాన్ని నేను నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కాక వ్యక్తిగత హోదాలో ఒక వికీపీడియన్ గా చేస్తున్నాను. ఈ విషయంలో నాతో కలిసి పనిచేస్తున్న వెలగా కృష్ణచైతన్యకు, కినిగె నుంచి దీనిపై పనిచేస్తున్న రాజన్, అనుమతించిన కినిగె అధినేత కిరణ్ గార్లకు, ద వికీపీడియా లైబ్రరీ ఉద్యోగులకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:26, 12 మార్చి 2019 (UTC)
అందరికీ నమస్కారం. సీఐఎస్-ఎ2కె భవిష్యత్తు కార్యకలాపాలు, ప్రయత్నాల విషయమై ప్రణాళిక వేస్తున్నది. మిమ్మల్ని కొద్ది సమయాన్ని వెచ్చించి ఈ ఫాం నింపమని కోరుతున్నాం: https://docs.google.com/forms/d/e/1FAIpQLSduNuq2uneHuQBcBni15ffMZQ1_jnuMWUGQiJthIArnHRvT-w/viewform. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:42, 12 మార్చి 2019 (UTC)
Hello Wikimedians!
The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials on the Library Card platform:
Many other partnerships with accounts available are listed on our partners page, including Baylor University Press, Taylor & Francis, Cairn, Annual Reviews and Bloomsbury. You can request new partnerships on our Suggestions page.
Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 17:40, 13 మార్చి 2019 (UTC)
ప్రజల్లో తెవికీ ప్రాచుర్యానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే నాకు కింది విషయాలు తోచాయి:
ఈ గణాంకాల లింకును ఇక్కడ చూడవచ్చు.
వివిధ వికీల గణాంకాల పోలికను చటుక్కున చూసేందుకు ఈ లింకును చూడొచ్చు. xtools కు చెందిన ఈ లింకును ప్రతి పేజీలోనూ పైన కనబడేలా పెట్టుకోవచ్చు కూడా (ఇది వాడుకరి జావాస్క్రిప్టు ఫైలులో తగు చేర్పులు చేస్తేనే ఇది కనబడుతుంది). ఈ లింకులో అనేక ఇతర గణాంకాలను కూడా చూడొచ్చు. వాటిలో ఒకటి - మనం సృష్టించిన పేజీలకు ఎన్నేసి పేజీవ్యూలు వచ్చాయనేది. (నేను సృష్టించిన 1600 పైచిలుకు పేజీల్లో 15% పైగా పేజీలకు గత మూడు మూడు వారాల్లో ఒక్క పేజీవ్యూ కూడా లేదు.). __చదువరి (చర్చ • రచనలు) 04:06, 15 మార్చి 2019 (UTC)
@చదువరి గారి స్పందన మేరకు వికీపీడియా:బాటు/అనుమతి కొరకు అభ్యర్ధన లో స్పందించండి. ఇప్పటిదాకా వున్నవిషయాన్ని అక్కడకు తరలించాను. --అర్జున (చర్చ) 00:40, 24 మార్చి 2019 (UTC)
ఆంధ్ర ప్రదేశ్ జిల్లా పటము తాజా చేయడంతో పాటు,దానికి సంబంధించిన సరియైన సమదీర్ఘచతురస్రపటము తాజా పరచబడినది. ఇప్పుడు ఆ పటము వాడితే సరియైన స్థాన సూచికలు కనబడ్తాయి. అయితే {{IIJ}} వాడినచోట కాకుండా. ఈ మూసకు బదులుగా {{Infobox settlement}} తో మార్పులు చేయాలి (కర్నూలు జిల్లా మార్పు ఉదాహరణ). మరింత సమాచారం. వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు కూడా చూడండి. తాజా మార్పుల వలన ఎక్కడైనా దోషాలుంటే తెలియపరచండి. కొత్త జిల్లాలమార్పులు కల తెలంగాణ పటము మంచి నాణ్యతగలది ఇంకా సార్వజనీకంగా లభ్యం కావడంలేదు. అది దొరికితే తెలంగాణా పటాలలో కూడా మార్పులు చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 01:41, 29 మార్చి 2019 (UTC)
కొంత మంది సభ్యులు ఉచితం కాని బొమ్మలు చేర్చునపుడు, ఫైల్ అప్లోడ్ విజర్డ్ వాడకుండా సాదాఫారము వాడి అవసరమైన మూసలు చేర్చటంలేదు. ఇప్పటికి అటువంటి బొమ్మలు 86 శాతం (2218/2567) వున్నాయి(తాజా స్థితి).. మొత్తం ఉచితంకానివిగా పేర్కొన్న బొమ్మలు 20.7 శాతం (2567/12363) వున్నాయి. ఫైళ్లు ఎక్కించినవారు తమ ఫైళ్లని సరిచేయవలసిందిగా కోరుతున్నాను. వికీపీడియా నాణ్యత పరిరక్షించటం కోసం సాదా ఫారము వాడ వద్దు. ఒకవేళ వాడినా తప్పక {{Information}}, {{Non-free fair use}} మరియు {{Non-free use rationale}} మూసలు లేక వాటికి సరిపోయిన మూసలు వెనువెంటనే సరియైన వివరాలతో చేర్చమని మనవి. అలా చేయకుంటే సాదా ఫారముతో బొమ్మల ఎక్కింపు నిరోధించవలసి రావచ్చు. సందేహాలుంటే సహాయం కోరండి.--అర్జున (చర్చ) 07:09, 6 ఏప్రిల్ 2019 (UTC)
10:56, 8 ఏప్రిల్ 2019 (UTC)
Please help translate to your language
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/జిల్లా, నగర వ్యాసాలకు ప్రామాణిక సమాచారపెట్టెలు పరిశీలించి ఆ వ్యాస చర్చాపేజీలో స్పందించండి. చర్చకు తుది తేదీ 2015-04-292019-04-29. --అర్జున (చర్చ) 06:15, 15 ఏప్రిల్ 2019 (UTC)
వికీమీడియా ఫౌండేషన్‌లో కమ్యూనిటీ బ్రాండ్ అండ్ మార్కెటింగ్ టీం సమన్వయకర్త సమీర్ ఎల్షర్బొట్టి ఏప్రిల్ 21న బెంగళూరులో ఆసక్తిగల, చురుకైన వికీమీడియన్లతో వికీపీడియా బ్రాండింగ్ ప్రతిపాదనను చర్చించి, ఫీడ్బాక్ తీసుకునేందుకు సమావేశమవుతున్నారు. (మరిన్ని వివరాలకు ఈ బ్లాగ్ పోస్టు చదవండి). ఈ సందర్భంగా భారతీయ వికీమీడియా ప్రాజెక్టుల నుంచి ఆసక్తిగల చురుకైన వికీమీడియన్లు, యూజర్ గ్రూపుల సభ్యులకు చర్చించేందుకు ఆహ్వానం. బెంగళూరులోని దొమ్మలూరులోని దొమ్మలూరు క్లబ్ సమీపంలోని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి రెండు గంటల పాటు జరుగనున్న కార్యక్రమానికి ఆసక్తిగల చురుకైన వికీపీడియన్లు హాజరుకావచ్చు. మీటప్ గురించి మరిన్ని వివరాలకు, రిజిస్టర్ కావడానికి మెటాలోని కార్యక్రమ పేజీ సందర్శించండి. ఈ సందర్భంగా వసతి, ప్రయాణ సౌకర్యాలు కోరే చురుకైన వికీమీడియన్లు gopala@cis-india.org మెయిల్ ఐడీని సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:40, 16 ఏప్రిల్ 2019 (UTC)
వికీపీడియాలో కొంతకాలం క్రితం రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా ప్రముఖుల వర్గాలు (ఉదా:వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు ప్రారంభించాము. ప్రస్తుత ఆలోచనల కనుగుణంగా, మరియు ఆంగ్లంలోని పద్ధతులను అనుసరించి; వీటిని మార్పు చేసిన బాగుంటుంది. ప్రముఖులకు బదులుగా - జిల్లా వ్యక్తులు లేదా ప్రజలు అని మారిస్తే ఎలావుంటుంది. ఆలోచించండి. --Rajasekhar1961 (చర్చ) 07:38, 17 ఏప్రిల్ 2019 (UTC)
నాణ్యమైన వెక్టర్ దత్తాంశము దొరకటంతో తెలంగాణపటము నవీకరించబడినది.
తాజా చేయడంతో పాటు,దానికి సంబంధించిన సరియైన సమదీర్ఘచతురస్రపటము తాజా పరచబడినది. ఇప్పుడు ఆ పటము వాడితే సరియైన స్థాన సూచికలు కనబడ్తాయి. మరింత సమాచారం. వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు కూడా చూడండి. తాజా మార్పుల వలన ఎక్కడైనా దోషాలుంటే తెలియపరచండి. --అర్జున (చర్చ) 11:27, 17 ఏప్రిల్ 2019 (UTC)
2019 ఏప్రిల్ 19 న సేకరించిన తెలుగు, హిందీ వికీల గణాంకాలను పోల్చి చూస్తే కింది సంగతి దృష్టికొచ్చింది.
మొత్తం పేజీల సంఖ్య నిష్పత్తి
అంశం | తెలుగు | హిందీ | తెలుగు కంటే హిందీ ఎంత శాతం |
---|---|---|---|
మొత్తం విజ్ఞాన సర్వస్వ పేజీలు | 70,709 | 1,30,605 | తెలుగు కంటే 84% ఎక్కువ |
విజ్ఞాన సర్వస్వ పేజీల్లోని మొత్తం పదాల సంఖ్య | 3,51,43,448 | 3,90,55,554 | తెలుగు కంటే 11% మాత్రమే ఎక్కువ |
పై అంకెలను బట్టి చూస్తే హిందీలో మొలకలు ఎక్కువగా ఉన్నట్టు గమనించాను. ఇంకో సంగతి.. ఈ "విజ్ఞాన సర్వస్వ పేజీల్లోని మొత్తం పదాల సంఖ్య" బెంగాలీ, తమిళ, కన్నడ, మలయాళ వికీల కంటే తెలుగులోనే ఎక్కువ! దీన్ని బట్టి తెలుగులో మొలకలు తక్కువయ్యాయని అనుకోవచ్చు. గ్రామాల వ్యాసాల్లో మనం సమాచారాన్ని చేర్చడమే మొలకలు తగ్గడానికి ప్రధానమైన కారణమని నేను అనుకుంటున్నాను. సహచర వాడుకరులు ఏమంటారో చూడాలి. __చదువరి (చర్చ • రచనలు) 11:12, 19 ఏప్రిల్ 2019 (UTC)
గ్రామవ్యాసాల్లో గణాంకాల ఆధారంగా చేసిన మార్పుల వల్ల వాటి నాణ్యత దారుణంగా దెబ్బతిన్నదన్న వాదన నేను అంగీకరించను. ఒక దశాబ్ద కాలం పాటు ఏక వాక్య వ్యాసాలుగా పడి ఉన్నవాటిని చెప్పుకోదగ్గ మూలంలో సమాచారంతో విస్తరణ చేయడం అస్సలు ఏమీ సమాచారం లేకుండా ఉండటం కన్నా మంచిదే. అన్ని వ్యాసాల్లో ఒకేరకమైన మూస వాక్యాలుంటాయని మొదట్లో నేను వ్యతిరేకించాను. అయితే వేల సంఖ్యలో గ్రామాల వ్యాసాలను అసలే అత్తెసరు మంది సభ్యులతో నెట్టుకొస్తున్న తెలుగువికీలో మానవీయ మార్పులు చేసి అభివృద్ధి చేయలేరనిపించిది. బాటు ద్వారా కనీసం ఫ్యాక్ట్స్ చేరిస్తే మంచిదే కదా అని నా అభ్యంతరాన్ని వెనక్కి తీసుకున్నాను. రవిచంద్ర (చర్చ) 13:20, 24 ఏప్రిల్ 2019 (UTC)
అందరికీ నమస్కారములు!
న్యూ రీడర్స్ ఇన్స్పైర్ క్యాంపైన్లో భాగంగా Wikilover90 పంజాబీ వికీపీడియా గురించి అవగాహన పెంచుటకు యానిమేషన్ వీడియోను తయారుచేసారు. తెలుగు మాట్లాడేవారిలో వికీపీడియాని ప్రోత్సహించుట కొరకు దీనిని మేము తెలుగు భాషలోకి అనువదించుటకు ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టాము. డబ్బింగ్ మూడు దశల్లో జరిగింది. మొదటి దశలో, మేము ఆంగ్లంలోకి తెలుగు నుండి ఉపశీర్షికలను అనువాదం చేసాము. రెండొవ దశలో, మేము కంఠ ధ్వనిని సరిచేయడానికి రికార్డింగ్ పద్ధతులు మరియు సాంకేతిక పరికరాల గురించి తెలుసుకున్నాము. మూడవ దశలో, రిహార్సల్ మరియు డాక్యుమెంటేషన్ పూర్తిచేసాము. ఈ ప్రాజెక్టును మేము VVIT WikiConnect ఆధ్వర్యంలో చేసాము. VVIT WikiConnect లోని సభ్యులు ఈ వీడియో కి డబ్బింగ్ చెప్పారు. 20 ఏప్రిల్ 2019 లో వికీమీడియా కామన్స్ లో ప్రచురించబడినది. ఈ వీడియోను కామన్స్ లో ఇక్కడ చూడవచ్చు. MNavya (చర్చ) 16:31, 20 ఏప్రిల్ 2019 (UTC)
తెవికీలో గ్రామవ్యాసాలనేవి మొత్తం వ్యాసాలలో సుమారు 30% వరకు ఉంటాయి. పదేళ్ళ క్రితం నేను తెవికీలో ప్రవేశించే నాటికి గ్రామవ్యాసాలన్నీ ఏక వాక్య వ్యాసాలే. వాటిని కూడా బాటుద్వారా చేర్చారు. గ్రామవ్యాసాలకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా నేను వాటిని అభివృద్ధిపర్చాలని ముందుగా మండలాల మూసలు తయారుచేసి వ్యాసాలలో పెట్టే పనిని ప్రారంభించాను. తర్వాత బాటుద్వారా అన్ని గ్రామవ్యాసాలలో చేర్చబడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోని చాలా గ్రామవ్యాసాలను కొంతవరకు అభివృద్ధి చేశాను. కొంతకాలానికి మరికొందరు సభ్యులు తెవికీలో ప్రవేశించారు. అసలుకథ అప్పుడే మొదలైంది. గ్రామవ్యాసాలలో ఇన్ఫోబాక్సులు, జనగణన తదితర చేర్చాలని నిర్ణయం తీసుకున్నాకా వైజాసత్యగారు బాటుద్వారా వాటిని చేర్చగలనని చెప్పిన పిదప కూడా కొందరు సభ్యులు ఎంత వారించిననూ వినకుండా ఏకపక్షంగా ప్రతిపేజీలో ఖాళీ విభాగాలు చేర్చడం, అసంపూర్తి ఇన్ఫోబాక్సులు చేర్చడం లాంటివి మానవీయ్ంగా పెట్టారు. వారి అత్యుత్సాహం వల్ల ఆ సమయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. అది మొదలు, ఆ తర్వాత గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి మొదలై అప్రతిహితంగా కొనసాగుతూనే వస్తోంది. అప్పుడు నాణ్యత గురించి చెప్పిన సూచనలు ఎవరూ పట్టించుకోలేరు. సంవత్సరాల తరబడి గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి జరిగి గ్రామవ్యాసాలనేవి కేవలం వ్యాస పరిమాణం పెరగడానికీ మరియు సభ్యుల దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడానికే తప్ప ఎలాంటి ఉపయోగం లేనట్లుగా తయారయ్యాయి. వ్యాసాలనేవి పరిమాణంలో కాకుండా నాణ్యతలో మెరుగుపడాలని చేసిన సూచనలన్నీ వృధాప్రయత్నాలుగానే మిలిగిపోయాయి. గ్రామవ్యాసాలలో కొందరు సభ్యులు ఇచ్చిన లింకులు కూడా అనవసర లింకులే. గ్రామవ్యాసాలను నాణ్యమైనవిగా తయారుచేయడానికి నేను స్వయంగా జిల్లాస్థాయి అధికారుల నుంచి సమాచారం తీసుకొని, ప్రతిగ్రామవ్యాసంలో గ్రామస్థానపు చిత్రాన్ని తయారుచేసి కొన్ని మండలాలలో చేర్చినపిదప కూడా గ్రామవ్యాసాలపై అనవసర దిద్దుబాట్ల దాడులవల్ల ప్రక్కకు జరగాల్సి వచ్చింది. ఒకానొకదశలో అర్జునరావుగారు కూడా గ్రామవ్యాసాలను తొలగించాలని చేసిన ప్రతిపాదనను ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక పేజీ ఉండటానికి అభ్యంతరపర్చిన సమయంలో నేను తీవ్రంగా వ్యతిరేకించాను కాని చివరకు గ్రామవ్యాసాలు చూడలేకపోయే ఈ స్థితికి వస్తాయని మాత్రం ఊహించలేకపోయాను. ప్రస్తుత స్థితిలో గ్రామవ్యాసాలు కేవలం పరిమాణంలోనే పెద్దవిగా ఉన్నట్లుగా, పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడినట్లుగా, నాణ్యత లేనట్లుగా అర్జునగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు నేను పూర్తిగా మద్దతు తెల్పుతున్నాను. గ్రామవ్యాసాల లోపాలపై సభ్యుడు:పవన్ సంతోష్ చేసిన సవాలు ఆధారంగా ఆయనే ఇచ్చిన మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసాన్నే (23-04-2019 నాటి స్థితి) పరిగణలోకి తీసుకుని సమీక్ష జరిపాను. దాదాపు అన్ని గ్రామ వ్యాసాలు ఇదేరకమైన లేదా ఇంతకంటే అధ్వానస్థితిలో ఉన్నాయన్న సంగతి కూడా గ్రామవ్యాసాలు పరిశీలించినవారికి తెలుస్తుంది. (కొందరికీ ఇలాంటి వ్యాసాలే నచ్చుతుంటే అది వారి అభిప్రాయం) కేవలం ఏదో ఒకటి రెండు వ్యాసాలని కాకుండా వేలాది వ్యాసాలలో అప్రయోజకరమైన మరియు అసమగ్రమైన సమాచారం ఉండుట అనేది ఏ మాత్రం మెచ్చుకోదగిన లేదా సమర్థించుకోగల్గిన పరిస్థితి కాదు.
పట్టికలలో ఉన్న సమాచారమే వాక్యాలుగా పేరాలలో చేర్చబడింది కాని ఈ సమాచారం విజ్ఞానసర్వస్వానికి యోగ్యమైన సమాచారం కాదు. సాధారణంగా ప్రభుత్వం తరఫున ముద్రించే లేదా విడుదల చేసే పట్టికల సమాచారం ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినదై ఉంటుంది. అలాంటి ఏదో ఒక కాలానికి మాత్రమే వర్తించే సమాచారం ఆన్లైన్ విజ్ఞానసర్వస్వానికి తగునా అని పరిశీలించడం అత్యావశక్యం. ప్రస్తుత కాలంలో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. మారిన పరిస్థితులకనుగుణంగా సమాచారం కూడా మార్చాల్సి ఉంటుంది కాని ఎప్పటిదో పాతబడిన సమాచారం, అదీ అసమగ్రమైన అంటే ఖచ్చితమైన సమాచారం ఇవ్వని వాక్యాలు చేర్చడం ఎంతవరకు అవసరం, ఎంతవరకు సమంజసం అనేది నిర్ణయించుకోవాలి. తెలంగాణ అవరతణ అనంతరం జాతీయ రహదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తెవికీ గ్రామవ్యాసాలలో 10 కిమీ పైబడి దూరంలో జాతీయ రహదారులున్నాయని చెప్పే గ్రామాలు కూడా జాతీయ రహదారులపైనే ఉన్నాయి. అలాగే విద్యుత్ సరఫరా, పారిశుద్ద్యం, నీటి సరఫరా తదితర విషయాలలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఇప్పటి వాస్తవ సమాచారానికి తెవికీ సమాచారానికి గ్రామవ్యాసాలలో విపరీతమైన తేడాలున్నాయి. అయితే ఇప్పుడు కేవలం ఒక్క మేడపల్లి (నల్లబెల్లి) వ్యాస సమాచారం ఆధారంగానే సమీక్ష జరిపాను. కాని ఈ లోపాలు ఇలాంటి పొరపాట్లు ఉన్న వేలాది గ్రామవ్యాసాలకు వర్తిస్తుంది. కేవలం ఏదో ఒకట్రెండు వ్యాసాలలో పొరపాట్లు ఉన్నాయని కాకుండా వేలాది గ్రామవ్యాసాలలో ప్రక్షాళన కోసమే ఈ సమీక్ష. సమీక్షలో తెలిపిన అభ్యంతరకర వాక్యాలు, అస్పష్టమైన మరియు అసమగ్రమైన సమాచారం తొలగిస్తే ఇక మిగిలేది ఎంత అనేది కూడా సభ్యులు గ్రహించాలి. అసలు గ్రామ వ్యాసంలో నాణ్యమైన సమాచారం ఉన్న వాక్యాలెన్ని అనేవి కూడా లెక్కపెట్టండి. అవసరమైతే ఇదే గ్రామవ్యాసం ఎలా ఉండాలో (ఎలా వ్రాయాలో) నేను వ్రాసి చూపించగలను. (గ్రామవ్యాసంలోని అభ్యంతర వాక్యాలు, దానికి ముందు బ్రాకెట్లలో నా అభ్యంతరం కూడా వ్రాశాను. చర్చను కొనసాగించేవారు ఈ చర్చను విడదీయకుండా నా సంతకం క్రిందుగా మాత్రమే వ్రాయండి)
1) గ్రామంలో నాలుగుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. (ఇది ఎప్పటి సమాచారం, ప్రస్తుతానికి ఇది సరైనదేనా? ఏటా పుట్టగొడుగుల్లా గల్లీకొకటి పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఖ్యకు కొలమానం ఏమిటి? అసలు బాలబడులంటే ఏమిటి ? నర్సరీలా, ప్రాథమిక పాఠశాలలా?)
2) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. (గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా? ప్రాథమికోన్నత అంటే ఏమిటి ? మాధ్యమిక అంటే ఏమిటి ?)
3) ... ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వరంగల్లోనూ ఉన్నాయి. (50 కిమీ దూరం వరకు డిగ్రీ కళాశాల ఇప్పటికీ లేదా? మరి 15 కిమీ దూరంలో ఉన్న నర్సంపేట గ్రామవ్యాసంలో డిగ్రీకళాశాల ఉన్నట్లుగా వ్రాయబడింది కదా! నల్లబెల్లి మండలంలోని శనిగరం (నల్లబెల్లి), ముచింపుల వ్యాసాలలో సమీప డిగ్రీ కళాశాల నర్సంపేట అని కూడా వ్రాయబడింది.)
4) మేడపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. (ఎప్పటికీ 5గురు సిబ్బందే ఉంటారా ? ఇది నమ్మశక్యంగా లేదు)
5) ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. (డాక్టర్లు ఎప్పుడూ ఉండరా? పారామెడికల్ సిబ్బంది ఎప్పుడూ ఒకరే ఉంటారా?)
6) ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు (సర్వకాలం ఒక డాక్టరే, ఒక పారామెడికల్ సిబ్బందే ఉంటారా?)
7) సంచార వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. (సంచార వైద్యశాల అంటేనే స్థిరంగా లేనిది. అది ఒకచోటు నుంచి మరో చోటుకు వెళుతూ సేవలను అందిస్తుంది. మరి ఆ సంచార వైద్యశాల ఈ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించదు? ఈ గ్రామంలో ఎందుకు సేవలందించదు? ఈ గ్రామానికి 5 కిమీ లోపు ఎప్పుడూ రాదా? 10 కిమీ దూరం వదిలి వెళ్ళదా?)
8) గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. (ఇది ఎప్పటి సమాచారం ? ఇప్పటికీ మూడే ఉన్నాయా? ముగ్గురికీ ఇప్పటికీ డిగ్రీ లేదా?)
9) రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. (ఇదెప్పటి సమాచారం ? చిన్న గ్రామంలో 2 మెడికల్ షాపులున్నాయంటేనే గ్రేట్ ! సాధారణంగా చిన్న గ్రామాలలో ప్రత్యేకంగా మెడికల్ షాపులుండవు, కిరాణా షాపులలోనే కొన్ని ముఖ్యమైన మందులను మాత్రం అమ్ముతారు. లేదా అక్కడి వైద్యులే మందులను కూడా ఉంచుకుంటారు. దీనికి తాజా ఆధారం కావాలంటే ఎలా చూపించాలి?)
10) గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. (వేసవిలో కూడానా? )
11) బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. (పై వాక్యానికి దీనికి తేడా స్వల్పం, చేతిపంపులైనా, పవర్ బోర్లైనా బోరింగులే కాని దీనికి తాజా పరిస్థితి ఆధారం ఎలా చూపించాలి?)
12) గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. (పెద్ద పట్టణాలలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేనప్పుడు గ్రామాలలో ఉన్నదనుకోవడం అనుమాస్పదమే ! దీనికి తాజా ఆధారం ఎలా అందించాలి?)
13) మేడపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉన్నప్పుడు సబ్-పోస్టాఫీసు దూరం గురించి వ్రాసే అవసరం ఉన్నదా?)
14) పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉంది అనే వాక్యం ఉన్న తర్వాత మళ్ళీ 10 కిమీ పైబడి దూరంలో ఎందుకు? ఇక టెలిగ్రాఫ్ విషయానికి వస్తే అసలు భారతదేశంలో ఎక్కడైనా టెలిగ్రాఫ్ సౌకర్యం ఉన్నదా? ఈ ఒక్క పాయింటు చాలు సమాచారం ఎంత పాతదో తెలుసుకోవడానికి !)
15) గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. (ప్రధాన రహదారి అయితే తప్ప అన్ని గ్రామాలకు ఆర్టీసి సౌకర్యం ఉండదు, ఈ గ్రామం గురించి నాకు తెలియదు కాని ఇలాంటి సమాచారమే ఉన్న నాకు తెలిసిన మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) గ్రామవ్యాసంలోని సమాచారం చూస్తే పూర్తిగా తప్పు అని చెప్పగలను)
16) వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. (ఇలాంటి వాక్యాల తాజాకరణకు ఆధారం లభ్యమౌతుందా? ఎలా నిరూపించాలి ?)
17) రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (10 కిమీ పైబడి అని కాకుండా సమీప రైల్వేస్టేషన్ పేరు ఇస్తే వ్యాసానికి బలం చేకూరుతుంది, కేవలం పట్టికలలోని సమాచారం మాత్రమే వాక్యాలుగా పేరాలలో చేర్చడం వల్ల వ్యాస నాణ్యత దిగజారింది. రైలురవాణా గురించి భూత్పూర్ గ్రామవ్యాసంలో నేను వ్రాశాను చూడండి)
18) గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. (ఇది సాధారణ సమాచారం మాత్రమే, విజ్ఞానసర్వస్వానికి ఇలాంటి సమాచారం తగదు. కనీసం ఏయే రకం రోడ్లు ఎంత పొడవు కలిగిఉన్నాయో వ్రాసినా బాగుండేది.)
19) రోజువారీ మార్కెట్, వారంవారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. (దూరం కాదు అది ఎక్కడనేది ముఖ్యం, అది తెలిస్తేనే సమాచారం చేర్చబడాలి కాని పట్టికలలోని సమాచారం చేర్చడం సరైనది కాదు)
20) ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (ఒక గ్రామానికి సమీప ఏటీఎం, సమీప బ్యాంకు ఎక్కడనేది ముఖ్యమైన సమాచారమే కాని కేవలం దూరం మాత్రం తెలపడం అనవసరం. 10 కిమీ పైబడి అంటే అది ఖచ్చితమైన దూరం కూడా కాదు. అది ఎక్కడైనా ఉండవచ్చు. ఇలాంటి సమాచారం కూడా సాధారణ సమాచారంగానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాక్యాలనేవి అనవసర సమాచారం కిందికే వస్తాయి)
21) వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామంలో పండిన పంటలను అమ్ముకోవడానికి సమీప వ్యవసాయ మార్కెట్ కమిటి ఎక్కడుంది అనేది ముఖ్యమైన సమాచారమే కాని ఇక్కడ కూడా 10 కిమీ దూరంలో ఉంది అని ఇవ్వడం ఏ మాత్రం ఉపయోగకరమైన సమాచారం కాదు. 10 కిమీ పైబడి దూరంలో ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ సమాచారం కిందికే పరిగణించడం జరుగుతుంది)
22) అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. (అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ అనేది ఒక కార్యాలయం కాదు. అసెంబ్లీ అయినా, లోక్‌సభ అయినా, గ్రామపంచాయతీ / ఎంపీటీసి/ జడ్పీటీసి ఇలా ఏ ఎన్నికలైనా గ్రామంలో ఉండే ఒక పాఠశాలనో మరేదో అందుబాటులో ఉన్న భవనాన్నో తాత్కాలికంగా పోలింగ్ బూత్‌గా చేస్తారు అంతేకాని శాశ్వతంగా ఏ గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్లు ఉండవు. అలాగే జనన మరణాల నమోదు కార్యాలయం కూడా ఎక్కడా ప్రత్యేకంగా ఉండదు. సాధారణంగా ఈ పని గ్రామపంచాయతీలే నిర్వహిస్తాయి)
23) ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామాలలో ఆటలాడటానికి మైదానాలకు కొదువేమీ ఉండదు కాని స్టేడియం అన్నప్పుడు మాత్రం ఎక్కడుందో చెప్పాలి)
24) సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (10 కిమీ పైబడి ఎలాగూ ఉంటుంది. అది ఎక్కడ అనేదే ముఖ్యం)
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. (ఈ కాలంలో గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉంటే అది ప్రత్యేకత కాదు, ఏదేని గ్రామంలో విద్యుత్ సరఫరా ఇప్పటికీ లేనట్లయితేనే అది ప్రత్యేకత కిందికి వస్తుంది. విద్యుత్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది. సమీప విద్యుత్ సబ్‌స్టేషన్ ఎక్కడ లాంటి సమాచారం ఇస్తేనైనా ఉపయోగకరం.)
25) రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. (తెలంగాణలో వ్యసాయానికి, వాణిజ్య అవసరాలకు 24 గంటల సరఫరా ఉంది, తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఏమీ లేదు కాబట్టి ఈ సమాచారం ప్రస్తుతానికి వర్తించదు మరియు తప్పుడు సమాచారంగా పరిగణించవచ్చు)
26) విజ్ఞానసర్వస్వం అందులోనూ ఆన్లైన్ విజ్ఞానసర్వస్వం అన్నప్పుడు తాజాకరించిన నాణ్యమైన సమాచారం ఉండాలి కాని అస్పష్టమైన, నిరుపయోగమైన, తాజాకరణ లేని సమాచారం ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
27) తెవికీలోని వ్యాసాలు తాజాకరించిన సమాచారంతో ఆధారం చూపగలిగేలా ఉండాలి కాని గ్రామవ్యాసాలు ఇటు తాజాకరణ లేవు అటు తాజా ఆధారమూ లేదు
28) తెవికీలోని వ్యాసాలలోని వాక్యాలపై అనుమానం ఉంటే ఎవరైనా ఆధారం కోరబడినది మూస పెట్టవచ్చు. కొంతకాలం వరకు సరైన ఆధారం చూపబడినచో ఆ వాక్యాలను తొలగించవచ్చు. అలాంటప్పుడూ గ్రామవ్యాసాలలోని అధికభాగం తొలగింపునకు గురికావడం ఖాయం. అధిక సంఖ్యలో ఇలాంటి వాక్యాలు చేర్చడం సరైనది కాదు.
29) అసలు మేడపల్లి గ్రామచరిత్ర ఏమిటి ? ఆ గ్రామంలోని పురాతన దేవాలయాలు ఏవి ? ఏమైనా ప్రాచీన శాసనాలు లభించాయా ? గ్రామప్రముఖులెవరు ? ఇటీవల జరిగిన సంఘటన ముఖ్యాంశాలు, చెరువులు, కాలువలు, నదులు (ఏవైనా ఉంటే) తదితరాలు చేరిస్తే వ్యాసం నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాని అక్కడి ప్రజలకు కాని పాఠకులకు కాని గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులకు గానీ ఏ మాత్రం ఉపయోగపడని సమాచారం చేర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? (వ్యాస పరిమాణం పెరగడం తప్ప, వ్యాసాలు రచించేది పాఠకుల కొరకే కాని మన దిద్దుబాట్ల సంఖ్యకోసం కాదు, ఇన్నిబైట్ల సమాచారం చేర్చామని చెప్పుకోవడం కోసం కాదు)
30) పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడింది అనేదానికి మరో మంచి ఉదా: దుగ్గొండి గ్రామవ్యాసంలో ఉన్న "ఇది మండల కేంద్రమైన దుగ్గొండి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది." అనే వాక్యం. (అంటే అదే గ్రామం అదే గ్రామం నుంచి సున్నా కిమీ దూరంలో ఉంది!! ఇదీ ఒక సమాచారమేనా?)
31) వికీపీడియా లాంటి ఆన్లైన్ విజ్ఞానసర్వస్వాలలో సమాచారం లేకుండుట కంటే తప్పుడు లేదా అసమగ్ర సమాచారం ఉండుట పొరపాటు. గ్రామస్థులు కాని ఆ గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులు కాని ఆశించేది, వారికి మనం అందించేది సమగ్రమైన మరియు వాస్తవ సమాచారమే కాని ఎప్పటిదో పాత సమాచారం కాదు, స్పష్టంగా వివరించని అసమగ్ర సమాచారమూ కాదు. వ్యాసాలలో పాఠకులు చూసేది, ఆశించేది, కోరుకొనేది, మెచ్చుకొనేది సమగ్రమైన సమాచారమే కాని వ్యాస పరిమాణం కానేకాదు. ఇలా ఏ రకంగా చూసిననూ వ్యాసాలకు రాశి కంటే వాసియే ముఖ్యమని ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడే తెవికీ బాగుపడుతుంది.
గమనిక: పై పాయింట్లన్నీ అభ్యంతరాలు కావు. అందులో కొన్ని అనుమానాలు, సందేహాలు కూడా ఉన్నాయి. గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:51, 24 ఏప్రిల్ 2019 (UTC)
నమస్కారం,
2019 మే 31, జూన్ 1, 2 తేదీల్లో ట్రైన్-ద-ట్రైనర్ (టీటీటీ) 2019 కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె నిర్వహించనుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం.
టీటీటీ అంటే ఏమిటి?
ట్రైన్ ద ట్రైనర్ లేక టీటీటీ అన్న ఈ కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయ సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించే శిక్షణా కార్యక్రమం. గతంలో టీటీటీ 2013, 2015, 2016, 2017, 2018ల్లో జరిగింది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
దయచేసి మెటాలో కార్యక్రమ పేజీ సందర్శించి కార్యక్రమం గురించి మరింత తెలుసుకోండి. అర్హతను బట్టి దరఖాస్తు చేయడం కానీ, అర్హులైన తోటి సముదాయ సభ్యులను దరఖాస్తు చేసుకొమ్మని ప్రోత్సహించడం కానీ చేయగలరు. ధన్యవాదాలతో. -- Tito (CIS-A2K), అనువదించినవారు పవన్ సంతోష్ (చర్చ)
Apologies for writing in English, please consider translating
Hello,
It gives us great pleasure to inform that the Train-the-Trainer (TTT) 2019 programme organised by CIS-A2K is going to be held from 31 May, 1 & 2 June 2019.
What is TTT?
Train the Trainer or TTT is a residential training program. The program attempts to groom leadership skills among the Indian Wikimedia community members. Earlier TTT has been conducted in 2013, 2015, 2016, 2017 and 2018.
Who should apply?
Please learn more about this program and apply to participate or encourage the deserving candidates from your community to do so. Regards. -- Tito (CIS-A2K), sent using MediaWiki message delivery (చర్చ) 05:07, 26 ఏప్రిల్ 2019 (UTC)
I am participating in Train the Trainer program/2019 at Vishakapatnam.--యర్రా రామారావు (చర్చ) 15:19, 6 మే 2019 (UTC)
I am participating in Train the Trainer program 2019.- వాడుకరి :adbh266
"హిందీ వికీతో పోలికలో.." అన్న శీర్షికన చదువరి గారు ప్రారంభించిన చర్చలో గ్రామాల వ్యాసాల్లో జనగణన సమాచారం చేర్పు సహా గత రెండు మూడేళ్ళుగా సాగుతున్న ప్రాజెక్టుపై జరిగిన వాదోపవాదాల అనంతరం నేను ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తున్నాను. ఆ చర్చలో ఇప్పుడు జరిగిన పని నాణ్యత దెబ్బతీసిందనీ, చర్చోపచర్చల తర్వాత నిర్ణయించి పని నడుస్తూండగా కూడా చర్చలకు వీలిచ్చిన ఈ ప్రాజెక్టు చర్చలు లేకుండా జరిగిందనీ, గత చర్చలు చదవకుండా సాగిందనీ వాదన బలం లేకుండా అంటే అంగీకరించలేకపోయాను. కానీ, ఇప్పుడున్న గ్రామ వ్యాసాల రూపమే అత్యున్నతమైన స్థాయిలోనిదని నాకేమీ భ్రమలు లేవు. ఇంతకన్నా మరెన్నో విధాలుగా, ఎంతగానో మెరుగుపరచవచ్చన్నది నిస్సందేహం. సారాంశం ఏమిటంటే ఇప్పుడున్నది ఇంతకుముందు కన్నా నిస్సందేహంగా మెరుగైన స్థాయిలో ఉంది, భవిష్యత్తులో మరెంతో మెరుగుపడాల్సిన అవసరమూ ఉంది. ఈ నేపథ్యంలో కార్యవాదిగా నేను ఈ చర్చ నుంచి ఒక కార్యాచరణ నిర్ణయించుకుని ప్రతిపాదిస్తున్నాను:
దయచేసి మీమీ అభిప్రాయాలు చెప్పగలరు. ఎవరికైనా మూలాలు కావలిస్తే శాయశక్తులా పంచుకుంటాను. సహాయం కావాలంటే నేనూ చేస్తాను. ఈ ప్రతిపాదననే మెరుగుపరిచినా సంతోషమే. స్పందనల కోసం ఎదురుచూస్తూ పవన్ సంతోష్ (చర్చ) 12:47, 26 ఏప్రిల్ 2019 (UTC)
Sorry to post in English. Please translate for the community. I would like to grant bot DiBabelYurikBot written by Yurik a bot flag. The bot makes it possible for many wikis to share templates and modules, and helps with the translations. See project page. Capankajsmilyo (చర్చ) 17:29, 26 ఏప్రిల్ 2019 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.