Remove ads
From Wikipedia, the free encyclopedia
లునవాడ (లూనవాడ అని కూడా అంటారు) మహిసాగర్ జిల్లా లోని ఒక పురపాలక సంఘం. ఇది గతంలో భారతదేశం, గుజరాత్ రాష్ట్రం లోని ఉత్తర భాగంలో ఉంది.
Lunavada | |
---|---|
Town | |
Coordinates: 23.1333°N 73.6167°E | |
Country | India |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | Mahisagar |
జనాభా (2011) | |
• Total | 36,954 |
Languages | |
• Official | Gujarati, Hindi, English |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 389230 |
Telephone code | 02674 |
Vehicle registration | GJ 35 |
Website | http://www.lunavada.com |
లునవాడ మహిసాగర్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. మధ్య గుజరాత్ లోని అత్యంత అభివృద్ధి చెందుతున్నపట్టణాలలో ఇది ఒకటి. లునవాడ అధికారికంగా తాలూకా, పరిపాలనా ఉపవిభాగం.ఇది 2013 ఆగష్టు 15 వరకు పంచమహల్ జిల్లాలో భాగంగా ఉంది. లునవాడ అనే పేరు శివుని ఆలయమైన లూనేశ్వర్ మహాదేవ్ నుండి వచ్చింది. లునవాడ నగరం చుట్టూ నీటితో అనగా పనం నది, వసంత్ సాగర్, కిషన్ సాగర్, కంక తలావ్, వెరి, మహినది, దార్కోలి తలావ్ సరస్సులతో చుట్టుముట్టబడి ఉంది.
లునవాడ పూర్వ రాచరిక రాష్ట్రానికి లునవాడ పట్టణం రాజధానిగా పనిచేసింది. ఇది 1225లో స్థాపించిన పట్టణం. దీని ఉనికికి ముందే లునవాడ సుమారు 200 సంవత్సరాల ముందునుండే రాచరిక రాష్ట్రం. దీని రాష్ట్రపాలకులు సోలంకి లేదా చౌళుక్య రాజవంశం నుండి వచ్చినట్లు పేర్కొన్నారు.వారు సోలంకి తెగ పదహారుశాఖలలో ఒకటిగా ఉన్నారు.ఆ తెగలను విర్పురా సోలంకిస్ అనిపిలిచేవారు. లునవాడ పట్టణం స్థాపించబడక ముందు, రాచరిక రాష్ట్రం రాజధాని లునవాడకు పశ్చిమాన మహి నదికి అడ్డంగా ఉన్న వీర్పూర్ పట్టణం రాజధానిగా ఉండేది.[1]
సాంప్రదాయ కథనాల ప్రకారం, లునవాడ పట్టణాన్ని సా.శ. 1434లో వీర్పూర్ పట్టణానికి చెందిన రాణా భీమ్ సింగ్ స్థాపించాడు. మహి నది మీదుగా జరిపిన ఒక వేట యాత్రలో, భీమ్ సింగ్ తన సహచరులను కోల్పోయి విడిపోయాడు. అతను ఒక సన్యాసి నివాసం చూశాడు. ఆ వ్యక్తిని గౌరవంగా పలకరించిన తరువాత, అడవిలో తూర్పు దిక్కుకు వెళుతున్నప్పుడు, ఒక కుందేలు తను వెళుతున్న దారిని దాటినట్లు చెప్పబడుతుంది. ఆ ప్రదేశంలో తాను ఒక నగరం కనుగొంటానని సన్యాసి చెప్పాడు. భీమ్ సింగ్ సన్యాసి చెప్పినట్లు చేసాడు.ఇప్పుడు భవనేశ్వరి మాత ఆలయం గుర్తించబడిన ప్రదేశంలో కుందేలును చూశాడు. అదే ప్రదేశంలో అతను పట్టణాన్నినిర్మించాడు. సన్యాసి లూనేశ్వర్ దేవునిభక్తుడు, కాబట్టి, రాణా గౌరవంగా కొత్త పట్టణానికి లునవాడ అని పేరు పెట్టాడు.[1]
జేమ్స్ఎం. కాంప్‌బెల్, సన్యాసి, కుందేలు కథ నగరాలకు ఒక సాధారణ స్థాపక పురాణం అని పేర్కొన్నాడు. బదులుగా, భీమ్ సింగ్ బంధువు ధోల్కా పాలకుడు లవణ ప్రసాద్ గౌరవార్థం లునవాడ పేరుపెట్టాలని అతను సూచించాడు. ధోల్కారాజుల శక్తి పెరగడం వల్ల భీమ్ సింగ్ బహుశా మహి మీదుగా నడవబడ్డాడని క్యాంప్‌బెల్ చెప్పాడు. అతను లునవాడను తన కొత్త రాజధానిగాఎంచుకున్నాడు, ఎందుకంటే అది బలమైన రక్షణ స్థానం, ఒక కఠినమైన కొండ, దాని వెనుక చిక్కుకున్న అడవి అవసరమైతే సురక్షితంగా తప్పించుకుంటానికి అనువైన మార్గంగా ఉందని అలోచించాడు.[1]
భీమ్ సింగ్ ప్రత్యక్ష వారసులు సా.శ. 1600 వరకు లూనవాడను పాలించారు.సా.శ. 1500ల మొదటి సగం స్పష్టంగా గుజరాత్ సుల్తానేట్తో విభేదాలను చూసింది. బోడి మొఘల్, మహ్మద్ బెగడ జనరల్, సా.శ.1505లో సమీపంలోని బాలాసినోర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సా.శ. 1545లో ఒక విధమైన భంగం సంభవించింది. సాశ. 1586 నాటి ఒక పత్రం ఆ సమయంలో లునవాడ రాచరికరాష్ట్ర ప్రాదేశిక విస్తీర్ణాన్ని సూచిస్తుంది. ఇది ఇప్పటికీ విర్పూర్, దాని ఆధారిత గ్రామాలను కలిగి ఉంది. ఇది తరువాత బాలాసినోర్ రాష్ట్రం కిందకు వచ్చింది. అలాగే ఉత్తరాన కొంతభూభాగాన్ని మేఘరాజ్ ఠాకూర్ల నుండి స్వాధీనం చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ, పానంనదికి దక్షిణంగా ఉన్న భూభాగం, తరువాత లునవాడ రాష్ట్రంలో భాగమైంది. ఇది ఇంకా లునవాడ నియంత్రణలో లేదు. బదులుగా, ఇది గోద్రా పాలకులు, థాస్రా సమీపం లోని ఝనోర్లో ఉన్న సోలంకీల శాఖచే నియంత్రించబడింది.[1]
సా.శ.1600లో, భీమ్ సింగ్ మరణం తరువాత, లునవాడకు రాజు కావడానికి గాంధారి గ్రామం నుండి కుంభో రానో అనే అనుషంగిక బంధువు తీసుకురాబడ్డాడు. అతని వారసులలో ఒకరైన నార్ సింగ్ సా.శ.1718లో చారిత్రాత్మకమైన లునవాడ పట్టణ గోడకు పునాది వేశాడు. నాలుగు సంవత్సరాల తరువాత, సా.శ.1722లో, అతను గుజరాత్ మొఘల్ వైస్రాయ్ హైదర్ కులీ ఖాన్‌కు 80,000 రూపాయల పారితోషకం అర్పించాడు. సా.శ. 1700లలో, లునవాడ రాష్ట్రం పొరుగున ఉన్నబాలాసినోర్ రాచరిక రాష్ట్రానికి భూభాగం కోల్పోయింది. అయితే గోద్రా అధిపతులు, సోలంకి ఠాకూర్ల క్షీణత కారణంగా దక్షిణాన కొత్త భూములను పొందింది.[1] 1872 జనాభా లెక్కల ప్రకారం, లునవాడలో 9,662 జనాభా ఉన్నారు. వీరిలో 7,206 మంది హిందువులు ఉండగా, 2,456 మంది ముస్లింలు ఉన్నారు .[1]
లూనేశ్వర్ ఆలయం, రామ్‌జీ మందిర్, హనుమాన్ ని వెరి, కాకచియా త్రివేణి సంగం, పనం వంతెన, పనం నది ప్రాజెక్టు, ఫతే బాగ్, ఫువారా చౌక్, ఇందిరా గాంధీ స్టేడియం, కల్కా మాతాని టేకారి, జవహర్ గార్డెన్, వాసియ తలవ్, అమేజ్ లిటిల్ గార్డెన్, గనిపీర్ దర్గా షరీఫ్ మొదలైనవి సందర్శకులు సందర్శించగల ముఖ్య ప్రదేశాలు. సందర్శకులు సాయంత్రం పూట పానం వంతెన వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన రాజభవనం సందర్శించదగిన మరొక ప్రదేశం. లునవాడ సమీపంలో లిమాదియా అనే గ్రామం ఉంది, అక్కడ రాజభవనం ఉంది.
కలక మాతని టెకారి లునవాడ నగరంలోని కొండ శిఖరాలలో ఒకటి. ఇది లునవాడ లోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. కొండపై నుండి నగరం అందమైన దృశ్యం పర్వాటకులకు ఒక ఆకర్షణ. కొండపైన ఉన్న ఒక ఆలయం, స్లైడ్లు, స్వింగ్‌ల సమూహం ఉంది. దాని పైభాగంలో కోట శిథిలాలు ఉన్నాయి. వారాంతాల్లో ప్రజలు చల్లని గాలి, మంచి అహ్లాదకర వాతావరణం పరిపూర్ణ వీక్షణను ఆస్వాదిస్తూ పర్యాటకులు విహారయాత్ర కోసం ఇక్కడకు వస్తారు. ప్రజలు జాగింగ్ కోసం, కొండపైన ఉన్న ఆలయాన్ని సందర్శించడానికి పైభాగాన్ని సందర్శిస్తారు.
లూనవాడ లూనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ప్రసిద్ధి. ఈ పురాతన శివాలయానికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. దీని పరాణ కథనం ప్రకారం పాండవులు అడవిలో ఉన్న సమయంలో ఈ ఆలయంలో నివసించారని చెబుతారు.శివలింగం విగ్రహం మధ్యప్రదేశ్ లోని గనులలో లభించిన తెల్లని రాతితో మలచబడింది. ఈ శివాలయానికి ఎదురుగా పవిత్ర కబీర్ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమ అన్ని గోడలపై పవిత్ర కబీర్ చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. భైరవనాథ్ మహాదేవ్ మరొక పురాతన ఆలయం లూనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయంలో భైరవుని విగ్రహం, శివుని విగ్రహం ఉన్నాయి.
ఈ పట్టణంలో హిందువులు, జైనులు, సింధీలు, ముస్లింలు, దావూదీ బోహ్రాలు అన్ని రకాల మత విశ్వాసాలకు చెందిన ప్రజలు ఉన్నారు. లునవాడ ప్రజలు వ్యాపారం, విద్య, బ్యాంకింగ్, అక్షరాస్యత, ఆరోగ్య రంగాలలో విజయాలు సాధించారు. కువైట్, యుఎఇ, ఆస్ట్రేలియా, కెనడా, ఒమన్, యుఎస్, హాంకాంగ్, ఆఫ్రికా వంటి వివిధ విదేశీ దేశాలలో లునవాడ నగరానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ జనాభా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.