From Wikipedia, the free encyclopedia
జ్ఞాని లాస్య నందిత (1986 - 2024 ఫిబ్రవరి 23)[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైంది.
జ్ఞాని లాస్య నందిత | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 - 2024 ఫిబ్రవరి 23 | |||
ముందు | జి. సాయన్న | ||
---|---|---|---|
తరువాత | శ్రీ గణేష్ నారాయణన్ | ||
నియోజకవర్గం | కంటోన్మెంట్ | ||
కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ | |||
పదవీ కాలం 2016 - 2021 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1987 చిక్కడపల్లి, హైదరాబాదు, తెలంగాణ | ||
మరణం | 2024 ఫిబ్రవరి 23 పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | జి. సాయన్న, గీత | ||
నివాసం | అశోక్ నగర్, హైదరాబాద్, తెలంగాణ గృహలక్ష్మి కాలనీ, కార్ఖానా, సికింద్రాబాద్, తెలంగాణ |
లాస్య నందిత 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి భారత్ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయింది.[2][3][4][5]
లాస్య నందిత హైదరాబాద్, అశోక్ నగర్ లో జి. సాయన్న, గీత దంపతులకు జన్మించింది.[6] ఆమె కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది.[7]
లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైంది.[8][9] ఆమె 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయింది.[10]
కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను లాస్య నందితకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది.[11][12]
లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ సమీపంలో సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి మరణించింది.[13][14][15] ఆమె అంత్యక్రియలను మారేడ్‌పల్లి శ్మశానవాటికలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.[16]
Seamless Wikipedia browsing. On steroids.