From Wikipedia, the free encyclopedia
లతేహార్ జార్ఖండ్ రాష్ట్రం లాతేహార్ జిల్లా లోని పట్టణం, ఆ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది సహజ పర్యావరణం, అటవీ, అటవీ ఉత్పత్తులు, ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి. లతేహార్ 1924 నుండి పాలమౌ జిల్లాలో ఒక ఉప డివిజన్‌గా ఉంటూ వచ్చింది. 2001 ఏప్రిల్ 4 న జార్ఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్ నం. 946 నూ నౌసరించి ఇది ఉప విభాగ స్థాయి నుండి జిల్లాగా ఎదిగింది. లతేహార్ వాయువ్య జార్ఖండ్‌లో పలమౌ కమిషనరేటులో ఉంది. ఈ జిల్లా సరిహద్దుల్లో రాంచీ, లోహార్‌దాగా, గుమ్లా, పాలమౌ, చత్రా జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం 84.51198 తూర్పు రేఖాంశం, 23.741988 ఉత్తర అక్షాంశం వద్ద ఉంది.
Latehar | ||||||
---|---|---|---|---|---|---|
City | ||||||
Coordinates: 23.75°N 84.50°E | ||||||
Country | India | |||||
రాష్ట్రం | Jharkhand | |||||
జిల్లా | Latehar | |||||
Government | ||||||
• MLA, Latehar (Vidhan Sabha constituency) | Baidyanath Ram, Jharkhand Mukti Morcha | |||||
• Deputy Commissioner | Abu Imran, IAS | |||||
Elevation | 387 మీ (1,270 అ.) | |||||
జనాభా (2011) | ||||||
• Total | 8,64,677 | |||||
భాషలు | ||||||
• అధికార | హిందీ | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
Vehicle registration | JH-19 |
ఇది ప్రధానంగా గిరిజన జిల్లా. జనాభాలో షెడ్యూల్ తెగలకు చెందినవారి సంఖ దాదాపు 45.54% ఉంది. జనాభాలో 66% కంటే ఎక్కువ మంది SC, ST లకు చెందినవారు. జిల్లా మొత్తం వైశాల్యం 3,622.50 చ.కి.మీ.
జార్ఖండ్ రాష్ట్రం లోని రెండవ అతిపెద్ద జలపాతం లతేహార్‌లో ఉంది.
లతేహార్ 23.75°N 84.50°E వద్ద,[1] సముద్రమట్టం నుండి సగటున 327 మీ. (1,073 అ.) ఎత్తున ఉంది.
2011 నాటి భారత జనగణ ప్రకారం ,[2] లతేహార్ జనాభా 8,64,677. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% . లతేహార్ సగటు అక్షరాస్యత 61%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 70%, స్త్రీల అక్షరాస్యత 51%. లతేహార్‌లో, 15% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
ఆర్థిక వ్యవస్థ అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం, ఖనిజాలపై ఆధారపడి ఉంది. వరి, పండ్లు, మొక్కజొన్న, గోధుమ మొదలైనవి ఇక్కడ ప్రధాన పంటలు.
లతేహార్, చాత్రా జిల్లాల మధ్య ఉన్న, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌కు చెందిన మగధ్ ఆమ్రపాలి బొగ్గు గనుల సంస్థకు లతేహార్‌లో అనేక బొగ్గు గనులున్నాయి.[3] జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (JSMDC) కు సిక్నీ వద్ద బొగ్గు గని ఉంది. హిందాల్కో ఇండస్ట్రీస్‌కు కుకుట్‌పట్ వద్ద బాక్సైట్ గని ఉంది.[4]
చంద్వాలో ఒక తాప విద్యుత్కేంద్రం ఉంది. దీన్ని మాతృశ్రీ ఉషా జయస్వాల్ థర్మల్ పవర్ కార్పొరేషను స్థాపించింది. దీని సామర్థ్యం 1080 మెగావాట్లు.[5]
ఎస్సార్ పవర్ లిమిటెడ్‌కు టోరీ వద్ద 1800 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం ఉంది.[6]
లతేహార్ జిల్లాలో బార్వాడ్ నుండి 8 కి.మీ. దూరంలో 979 చ.కి.మీ విస్తీర్ణంలో బెట్లా నేషనల్ పార్క్ వ్యాపించి ఉంది. ఈఅభయారణ్యపు ప్రధాన ప్రాంతం 232 km 2. 1989 సెప్టెంబరులో దీన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం చోటానాగ్‌పూర్ పీఠభూమి పశ్చిమ ప్రాంతంలో ఉంది. దీన్ని 1960 లో హజారీబాగ్ జాతీయ ఉద్యానవనానికి పొడిగింపుగా ఏర్పాటు చేసారు. 1932 లో ప్రపంచంలో మొట్టమొదటి పులుల జనాభా గణన జరిగిన అడవిగా బార్వాదికి ప్రత్యేకత ఉంది. ఈ పార్కు, 1974 లో 'ప్రాజెక్ట్ టైగర్' కింద భారతదేశంలో ఏర్పాటుచేసిన తొలి 9 టైగర్ రిజర్వ్‌లలో ఒకటి.
ఇతర పర్యాటక ప్రదేశాలు
1) నెతర్‌హాట్ సూర్యోదయ స్థలం 2) నెతర్‌హాట్ సూర్యాస్తమయ స్థలం3) లోధ్ జలపాతం 4) ఎగువ ఘఘ్రి జలపాతం 5) దిగువ ఘఘ్రి జలపాతం 6) సుఘ బంధ జలపాతం 7) మిర్చి జలపాతం 8) ఇంద్ర జలపాతం 9) బేట్ల జాతీయ ఉద్యానవనం 10) గొట్టాల గుహ 11) పాలము కోట 12) నగర్ దేవాలయం 13) వైష్ణో దుర్గా మందిరం 14) తత్తా పానీ 15) నేతర్‌హాట్ పాఠశాల 16) టప్పా హిల్ 17) ట్రీ హౌస్ బెట్లా 18) నేతర్‌హాట్ ఆనకట్ట 19) లాల్మతీయా డ్యామ్ 20) ఝరియా డ్యామ్ 21) మా వైష్ణో ఆలయం 22) జాగరహ డ్యామ్ చంద్వా 23 ) దతం పటం నీటి పతనం బలుమత్ 24) దుమోహన్ చంద్వా 25) బోడా పహార్ చండ్వా 26) చుల్లా పాణి బోడా పహార్ చంద్వా 27) చతువాగ్ చనాద్వా
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.