From Wikipedia, the free encyclopedia
రోగ నిరోధ వ్యవస్థ (Immune system or Immunity) జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ (Defence system). దీనిని అసంక్రామ్య వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీనిలో తెల్ల రక్తకణాలు (White Blood Cells), ప్రతిదేహాలు (Antibodies), కొన్ని చిన్న అవయవాలు (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self), పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.
అసంక్రామ్యత రెండు రకాలు:
[1]స్వాభావిక అసంక్రామ్యత (Innate immune system) : పుట్టుకతో వచ్చే అసంక్రామ్యతను స్వాభావిక అసంక్రామ్యత అంటారు. దీనిలో కొన్ని రకాల అవరోధాలు పుట్టుకతోనే వస్తాయి. అవి.
అనుకూలన అసంక్రామ్యత (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు. దీని ముఖ్య లక్షనాలు నిర్దిష్టత, వైవిధ్యం, జ్ఞప్తి.
అసంక్రామ్యతలో వివిధ రకాల కణాలు పాల్గొంటాయి. వీనిలో శోషరస, భక్షక, ఉపక్రియా కణాలు ముఖ్యమైనవి.
Seamless Wikipedia browsing. On steroids.