From Wikipedia, the free encyclopedia
రామా చంద్రమౌళి (rama chandramouli) సమకాలీన తెలుగు రచయితలలో ఒకరు. 2020లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]
రామా చంద్రమౌళి | |
---|---|
జననం | రామా చంద్రమౌళి జూలై 8, 1950 ఆంధ్ర ప్రదేశ్ |
వృత్తి | వైస్ ప్రిన్సిపాల్, వరంగల్ |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత |
మతం | హిందువు |
తండ్రి | రామా కనకయ్య |
తల్లి | రాజ్యలక్ష్ |
రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు జూలై 8, 1950లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్ (మెకానికల్) ఎఫ్.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు. వీరు ప్రస్తుతం ప్రొఫెసర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు.[3]
రాష్ట్రపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం (1986) నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాలిటెక్నిక్ అధ్యాపక అవార్డు (2000, భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం (2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది. ‘యాజ్ ది విండో ఓపెన్స్’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్‌ఫెర్నో’ మూలగ్రంథం ‘అంతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది. జి.ఎం.ఆర్. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008), తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం (2019).
'ఎడారిలో చంద్రుడు' (నవల), 'చదరంగంలో మనుషులు' కన్నడంలోకి అనువదించబడ్డాయి. 8 కథలు కన్నడంలో టెలీ కథలుగా ప్రసారం చేయబడ్డాయి. దాదాపు 20 కథలు ఇంగ్లిష్, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి అనువదించబడ్డాయి.
ఇప్పటి వరకు 192 కథలు, 18 నవలలు, ఎనిమిది కవిత్వ సంపుటాలు, ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు, శాస్త్రీయ విద్యా విషయక వ్యాసాలు, ఇంజినీరింగ్ పాఠ్యగ్రంథాలు రాశారు. వీరి ద్విభాషా సంకలనం (ఇంగ్లిష్, తెలుగు) అమెరికాలో 2006లో జరిగిన ఆటా సభల్లో ఆవిష్కరించబడింది.
ఈ క్రింద సూచనాప్రాయంగా కొన్ని నవలలు ఇవ్వబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.