రాజ్‌నంద్‌గావ్ జిల్లా

ఛత్తీస్గఢ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

రాజ్‌నంద్‌గావ్ జిల్లా
Remove ads

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాజ్‌నందగావ్ జిల్లా ఒకటి. రాజ్‌నందగావ్ జిల్లాకు కేంద్రంగా ఉంది.

త్వరిత వాస్తవాలు రాజ్‌నందగావ్ జిల్లా राजनांदगांव जिला, దేశం ...
Remove ads
Thumb
రాజనందగావ్ జిల్లాలో ప్రముఖ యాత్రాస్థలం ప్రబల బంబ్లేశ్వరీ ఆలయం నుండి డోంగర్గర్ ప్రాంతం
Remove ads

చరిత్ర

1973 జనవరి 26న రాజ్‌నందగావ్ జిల్లా దుర్గ్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేయగా ఏర్పడింది. 1998లో ఈ జిల్లా నుండి కబీర్‌ధామ్ జిల్లాను రూపొందించారు.[1] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[2]

భౌగోళికం

జిల్లా వైశాల్యం 8222 చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో కబీర్‌ధామ్ జిల్లా, తూర్పు సరిహద్దులో దుర్గ్, దక్షిణ సరిహద్దులో బస్తర్, పశ్చిమ సరిహద్దులో మహారాష్ట్ర లోని గడ్‌ఛిరోలి, భండరా, మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...

పర్యాటక ఆకర్షణలు

జిల్లాలోని తాలుకా కేంద్రమైన డోంగర్గర్ ప్రత్యేక పర్యాటక కేంద్రం, ప్రముఖ యాత్రాస్థలంగా కూడా ఉంది. ఈ పట్టణంలోని 1600 అడుగిల ఎత్తైన కొండమీద ప్రబల బంబ్లేశ్వరీ ఆలయం ఉంది.[6] ఈ ఆలయానికి 0.5 కి.మీ దూరంలో నేలమట్టం మీద మరొక ఆలయం ఉంది. దీనిని చోటీ బంబ్లేశ్వరీ ఆలయం అంటారు. నవరాత్రి, చైత్ర మాసాల సమయంలో ఈ ఆలయానికి ఛత్తీస్‌గఢ్, వెలుపలి ప్రాంతాల నుండి వేలాది భక్తులు వస్తుంటారు. నవరాత్రి ఉత్సవాలు 24 గంటలూ పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి.

  • రైల్వే స్టేషన్‌కు 1.5 కి.మీ దూరంలో ఉన్న శక్తిపీఠం మాతా శీతలేశ్వరీ దేవి ఆలయం కూడా జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.
Remove ads

మూలాలు

Loading content...

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads