ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాజ్‌నందగావ్ జిల్లా ఒకటి. రాజ్‌నందగావ్ జిల్లాకు కేంద్రంగా ఉంది.
రాజ్‌నందగావ్ జిల్లా
राजनांदगांव जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | రాజ్‌నందగావ్ |
మండలాలు | 9 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,070 కి.మీ2 (3,120 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,37,133 |
• జనసాంద్రత | 190/కి.మీ2 (490/చ. మై.) |
• Urban | 2,31,647 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 77.2 % |
• లింగ నిష్పత్తి | 1023 |
సగటు వార్షిక వర్షపాతం | 1274 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
1973 జనవరి 26న రాజ్‌నందగావ్ జిల్లా దుర్గ్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేయగా ఏర్పడింది. 1998లో ఈ జిల్లా నుండి కబీర్‌ధామ్ జిల్లాను రూపొందించారు.[1] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[2]
భౌగోళికం
జిల్లా వైశాల్యం 8222 చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో కబీర్‌ధామ్ జిల్లా, తూర్పు సరిహద్దులో దుర్గ్, దక్షిణ సరిహద్దులో బస్తర్, పశ్చిమ సరిహద్దులో మహారాష్ట్ర లోని గడ్‌ఛిరోలి, భండరా, మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలు ఉన్నాయి.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,537,520, [3] |
ఇది దాదాపు. | గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 325వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 191 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.82%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1017:1000 [3] |
అక్షరాస్యత శాతం. | 76.97%.[3] |
పర్యాటక ఆకర్షణలు
జిల్లాలోని తాలుకా కేంద్రమైన డోంగర్గర్ ప్రత్యేక పర్యాటక కేంద్రం, ప్రముఖ యాత్రాస్థలంగా కూడా ఉంది. ఈ పట్టణంలోని 1600 అడుగిల ఎత్తైన కొండమీద ప్రబల బంబ్లేశ్వరీ ఆలయం ఉంది.[6] ఈ ఆలయానికి 0.5 కి.మీ దూరంలో నేలమట్టం మీద మరొక ఆలయం ఉంది. దీనిని చోటీ బంబ్లేశ్వరీ ఆలయం అంటారు. నవరాత్రి, చైత్ర మాసాల సమయంలో ఈ ఆలయానికి ఛత్తీస్‌గఢ్, వెలుపలి ప్రాంతాల నుండి వేలాది భక్తులు వస్తుంటారు. నవరాత్రి ఉత్సవాలు 24 గంటలూ పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి.
- రైల్వే స్టేషన్‌కు 1.5 కి.మీ దూరంలో ఉన్న శక్తిపీఠం మాతా శీతలేశ్వరీ దేవి ఆలయం కూడా జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.