Remove ads
From Wikipedia, the free encyclopedia
రబ్బరుగింజల నూనె శాకతైలం. కాని ఆహరయోగ్యం కాదు. కాని పారీశ్రామికంగా పలు వుపయోగాలున్నాయి.రబ్బరుచెట్టు యొక్క పుట్టుకస్థావరం, దక్షిణ అమెరికాలోని ఆమెజాన్ ప్రాంతం.అక్కడినుండి ఆఫ్రికా, ఆసియా ఉష్ణమండల అరణ్య ప్రాంతాలకు 19 శతాబ్దికాలానికి వ్యాపించింది.[1] ప్రపంచమంతటా 9.3 మిలియను హెక్టారులలో రబ్బరుతోటలు పెంచబడుచున్నవి, అందులో95% వరకు ఆసియా దేశాలలో పెంచబడుచున్నవి.
రబ్బరు చెట్టుఅనేది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క.[2] దీని వృక్షశాస్త్ర నామం హెవియే బ్రాసిలైన్నిస్. రబ్బరుచెట్టును రబ్బరు తయారుచేయు ముడిపదార్థం లెటెక్సు (latex) కై సాగు చేస్తారు. అయితే రబ్బరు చెట్టు నుండి 3 ఉపవుత్పత్తులు కూడా లభ్యం. అవి రబ్బరుచెట్టు కలప, రబ్బరుచెట్టు విత్తనాలు, రబ్బరు తేనె. రబ్బరుకై ఎక్కువగా సాగులో వున్నది హెవియే బ్రాసిలైన్నిస్ అయ్యినప్పటికి రబ్బరు నిచ్చు, లెటెక్సునిచ్చు యితర మొక్కలు వున్నాయు. అవి
1. Manihot glaziovil (యుఫోర్బియేసి)
2. Parthenium argentatuam (కాంపొసిటే)
3. Taraxaum kakasaghyz (కాంపొసిటే)
రబ్బరుచెట్టు నిటారుగా పెరిగే బహువార్షికం. పెరుగుదల చాలా వేగంగా వుంటుంది.రబ్బరుచెట్టు ఆకురాల్చుచెట్టు.30-40మీటర్ల ఎత్తువరకు పెరుగును.అయితే తోటలలో15-20 మీటర్ల ఎత్తుపెరుగు చెట్లు పెంచెదరు. కాండం దిగువన కొమ్మలు లేకుండా నిటార్గా పెంచెదరు.[3] రబ్బరుచెట్టు మూలం దక్షిణ అమెరిక ఆమెజాన్ ప్రాంతం. అక్కడి నుండి దక్షిణాసియా దేశాలకు మొదటవ్యాప్తి చెందినది. కీ.శ,1876లో ఇండియాకు తీసుకు రాబడింది. హెన్రి విక్మెన్, బ్రెజిల్ నుండి ఇండియాకు తెచ్చాడు. ఆ తరువాత రబ్బరుసాగు ఆసియా, ఆఫ్రికా,, అమెరికాలకు వ్యాప్తి చెందినది. ఇండియాలో ఆధికవిస్తీర్ణంలో కేరళ రాష్ట్రంలో సాగులోవున్నది. ఇండియాలో సాగులోవున్న రబ్బరుతోటల విస్తీర్ణంలో 85% కేవలం కేరళలోనీ సాగులో ఉంది. కేరళలోదాదాపు 45 వేలహెక్టారులలో సాగులో ఉంది.
రబ్బరు విత్తనాలు చూచుటకు ఆముదం విత్తనాల వలెవుండి, ఆముదం విత్తనాల కంటే పరిమాణంలో పెద్దవిగా వుండును[4] . రబ్బరు విత్తనం పొడవు 2.0 సెం.మీ వుండును, విత్తనం సాగిన అండాకరంగా వుండి ఒకపక్క చదునుగా వుండును. పైన గట్టిగావుండియు పెలుసుగా పగిలే పెంకును కల్గివుండును. పెంకుపైన మచ్చలుండును. లోపల పెంకుకు అంతుక్కొకుండగా వదులుగా పిక్క వుండును. పిక్క రెండు బద్దలను కల్గివుండును. తాజావిత్తనాలో పెంకు 35%,40-45% వరకు పిక్క/గింజ,, 25% వరకు తేమ వుండును. గింజలో నూనెశాతం 30-35% వరకు వుండును. ఆరబెట్టిన, ఎండబెట్టిన, తేమశాతం 6-8% వున్న విత్తనాల్లో నూనెశాతం 38-45% వరకు వుండును. విత్తనాలో తేమశాతం అధికంగా వున్నచో 'హైడ్రొలిసిస్' వలన నూనెలో F.F.A.త్వరగా పెరుగును, ఫంగస్ సంక్రమణ వలన విత్తనం పాడైపోవును. అందుచే విత్తనాల్లో తేమశాతాన్ని 6-8% వరకు తగ్గించాలి. విత్తన దిగుబడి 1000-1500 కే.జి.లు హెక్టరుకు వుండును.
రబ్బరువిత్తనాల నుండి నూనెను రోటరి మిల్లులు, స్క్రూప్రెస్ (ఎక్సుపెల్లరు) ల ద్వారా నూనెను తీయుదురు[5] . సాల్వెంట్ ప్లాంట్ ద్వారా ఎక్కువనూనెను విత్తనాల నుండి పొందు అవకాశం వున్నను, ఇండియాలో సాల్వెంట్ ప్లాంట్ ద్వారా నూనెను తీస్తున్నట్లు వివరాలు లభ్యం కాలేదు[6]. రబ్బరుతోటలసాగు కేరళలో అధికంగా వున్నప్పటికి, రబ్బరువిత్తనాల నుండి నూనెతీయు పరిశ్రమలు మాత్రం తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడు లోని అరుపుకొట్టాయ్, థెంగాసి,, నాగర్కోయిల్లో అధికంగా రబ్బరువిత్తనాలనుండి నూనెతీయు పరిశ్రమలున్నాయి. యిందుకుకారణం కేరళలో విత్తనదిగుబడి సమయంలో అక్కడ వర్షంఎక్కువగా పడుతుండటం, వాతావరణంలో తేమఅధికంగా వుండటం వలన విత్తనంనెమ్ము ఎక్కే అవకాశం ఉంది. అదే సమయంలో తమిళనాడులో వాతావరణ అనుకూలంగా వుండటం వలన నూనెతీయు పరిశ్రమలు అక్కడ అభివృద్ధిచెందాయి.
తాజాగా సేకరించిన విత్తనాలలో తేమశాతం 25 % వరకు వుండును. విత్తనాలను కళ్లంలో ఆరబెట్టి తేమ శాతాన్ని 6–8 %కు తగ్గించెదరు. కొన్నిపరిశ్రమలో 'రోటరొ డ్రయరు 'ద్వారా తేమను తగ్గించెదరు, గాలిని 60-700C వరకు వేడిచేసి రొటరి డ్రమ్కు పంపి విత్తనాలను వేడిచేసి విత్తనాలలోని తేమను తగ్గించెదరు. ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఉత్పత్తి అగునూనె రంగు పెరుగును. అందుచే 60-700C వరకు మాత్రమే వేడిచేసిన గాలిని పంపెదరు. చిన్న కెపాసిటివున్న పరిశ్రమలో విత్తనాలను కళ్లంలో ఎండలో ఆరబెట్టెదరు. తేమ శాతాన్ని 6-8% వరకు వున్న రబ్బరు విత్తనాలను మొదట జల్లెడ (screener) లో జల్లించి మట్టి పెళ్లలు, చిన్నచిన్నరాళ్ళు, పుల్లలవంటి వాటిని తొలగించెదరు.
జల్లించిన విత్తనాలను హెమరుమిల్లు ద్వారా చిన్నముక్కలుగా చెయ్యుదురు. చిన్నముక్కలుగా చెయ్యడంవలన నూనెతీయడం సులువుగా వుండును. ముక్కలుగా చేసిన తరువాత 'కండిసనరు' అనే యంత్రంలో విత్తన ముక్కలను స్టీము ద్వారా 60-70% వరకు వేడిచేయుదురు. ఇలా చెయ్యడం వలన విత్తన కణాలలోవున్న నూనె ద్రవీకరణ చెంది, కణపొరలవెలుపలి వైపుకు వచ్చును. కండిసను చేసిన విత్తనాలను ఎక్సుపెల్లరుకు పంపి అధిక వత్తిడిలో క్రష్ చేసి నూనెను తీయుదురు. నూనె తీయుటకు వాడిన ఎక్సుపెల్లరు కేపాసిటిని బట్టి కేకులో6-8% వరకు నూనె కేకులో మిగి లుండును.
రోటరి మిల్లులో తీసిన రబ్బరు విత్తన కేకులో 15-16% వరకు నూనె మిగిలివుండును. రోటరిద్వారా నూనెను తీయునప్పుడు 'మొలాసిస్'ను కలిపి విత్తనాలను క్రష్ చేయుదురు. మొలాసిస్ విత్తనాలను దగ్గరిగా పట్టివుంచి నూనె త్వరగా దిగునట్లు చెయ్యును. రబ్బరు విత్తననూనె చెక్కను (oil cake) ను తక్కువ మొత్తంలో పశువుల దాణా (live stock feed) గా వినియోగిస్తారు. మిగిలినది సేంద్రియ ఎరువుగా పంటపొలాలలో వాడెదరు.రబ్బరువిత్తనాలో సైనొజెన్టిక్ గ్లుకొస్ cyanogentic Glucose) ను కల్లివుంది. సైనొజెన్టిక్ గ్లూకొస్, లిపేజ్ ఎంజైమ్ చర్యవలన హైడ్రొసైనిక్ ఆమ్లంగా మారును. హైడ్రొసైనిక్ ఆమ్లం, విషగుణాలు కల్గివున్నది. అందుచే దాణాగా వాడుటకు కొంచెం సందేహపడు తున్నారు. అయితే రెండు నెలల వరకు 6.0% తేమ వద్ద నిల్వ వుంచిన విత్తనాలలో సైనొటిక్ గ్లూకొస్ శాతం గణనీయంగా తగ్గినట్లు గమనించారు. ఇటువంటి విత్తనాల నుండి వచ్చిన కేకును పశువుల దాణాగా వాడవచ్చును.
రబ్బరు విత్తననూనె కేకు పోషక విలువ పట్టిక
పోషకపదార్థం | విలువ మితి% |
---|---|
తేమ | 9.0-10% |
నూనె | 6-8 |
ప్రోటీను | 29-30 |
పిండిపదార్థం | 19-20 |
పీచు పదార్థము | 8.0 |
బూడిద | 6.5 |
తాజా విత్తనాల నుండి తీసిన నూనె పసుపురంగులో వుండును. ఎక్కువకాలం నిల్వ వుంచిన, పాడైపోయిన విత్తనాల నుండి తీసిన నూనె ముదురురంగులో వుండును. ఇది ఆహరయోగ్యం కాదు. కాని రసాయనిక పరిశ్రమలో పలుఉత్పత్తుల తయారిలో రబ్బరు విత్తన నూనెను ఉపయోగించ వచ్చును. రబ్బరుగింజల నూనె 50% మించి బహుబంధ అసంతృప్త కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. ఐయోడిన్ విలువ పొద్దుతిరుగుడు నూనెకు దగ్గరిగా వున్నను, యిది సెమి డ్రయింగ్ (semi drying) నూనె. అందువలన లిన్సీడ్ నూనెకు ప్రత్యామయంగా వాడవచ్చును.
రబ్బరునూనె భౌతిక, రసాయనిక దర్మాల పట్టిక[7]
భౌతిక, రసాయనిక ధర్మం | విలువ, మితి |
సాంద్రత | 0.92 |
వక్రీభవన సూచిక | 1.4656 |
స్నిగ్థత | 10.35 |
ఆమ్ల విలువ | 9 |
సపొనిఫికెసను విలువ | 193.61 |
అయోడిన్ విలువ | 134.51 |
అన్ సపొనిఫియబుల్పదార్థం | 0.7 |
పెరాక్సైడ్ విలువ | 14.4 |
రబ్బరు విత్తననూనెలోని కొవ్వుఆమ్లాల పట్టిక[8]
కొవ్వుఆమ్లాలు | శాతం |
సంతృప్త కొవ్వుఆమ్లం | |
---|---|
పామిటిక్ ఆమ్లం | 8.0-9.0 |
స్టియరిక్ ఆమ్లం | 10.0-11.0 |
అసంతృప్త కొవ్వుఆమ్లాలు | |
ఒలిక్ ఆమ్లం | 21.0-23.0 |
లినొలిక్ ఆమ్లం | 36.0-37.5 |
లినొలెనిక్ ఆమ్లం | 19.0-20.0 |
రబ్బురు విత్తన నూనె, బయోడిజెల్ తయారు చేయుటకు అనుకూలమైనది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.