From Wikipedia, the free encyclopedia
'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' 2024లో విడుదలైన తెలుగు సినిమా. హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దరకత్వం వహించాడు[3]. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 సెప్టెంబర్ 18న[4], ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 12న విడుదల చేసి సినిమాను మార్చి 1న విడుదల చేశారు.
భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒప్పుకోడు. నిజాం ప్రభువు అండగా రజాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైదరాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. మతమార్పిడులకు పాల్పడటంతో పాటు ఉర్దూ మాట్లాడని వారిని కఠినంగా శిక్షించాడు. చాలా మందిని అంతమొందించాడు. రజాకార్ల కుట్రలను కొంత మంది పోరాట యోధులు ఎలా ఎదురించి తమ ప్రాణాలను త్యాగం చేశారు? హైదరాబాద్‌ను భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా విలీనం చేశాడు? ఖాసీం రిజ్వీ జీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా సినిమా కథ.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "భారతి భారతి ఉయ్యాలో[5]" | కాసర్ల శ్యామ్ | మోహన భోగరాజు, భీమ్స్ సిసిరోలియో, స్ఫూర్తి జితేందర్ | 4:21 |
2. | "పోతుగడ్డ" | సుద్దాల అశోక్ తేజ[6] | భీమ్స్ సిసిరోలియో, స్వాతి రెడ్డి (యూకే) | 5:29 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.