భారత వాస్తుశిల్పి మరియు శిల్పి From Wikipedia, the free encyclopedia
రఘునాథ్ మహాపాత్ర (24 మార్చి 1943 - 9 మే 2021) [2] ఒక భారతీయ వాస్తుశిల్పి, శిల్పి రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు. రఘునాథ్ మహాపాత్ర 1975లో పద్మశ్రీ 2001లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నాడు [3] భారత 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2013లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. [4]
రఘునాథ్ మహాపాత్ర | |
---|---|
పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ | |
In office 2018 జూలై 14 – 2021 మే 9 | |
అంతకు ముందు వారు | అను ఆగా |
నియోజకవర్గం | నామినేటెడ్ (కళలు) |
వ్యక్తిగత వివరాలు | |
జననం | , పూరి, ఒడిశా భారతదేశం | 1943 మార్చి 24
మరణం | 2021 మే 9 78)[1] భువనేశ్వర్ , ఒడిశా, భారతదేశం | (వయసు
జీవిత భాగస్వామి | రజనీ మహా పాత్ర (m. 1966) |
సంతానం | 5 |
వృత్తి | వాస్తు శిల్పి |
పురస్కారాలు | రాజ్యసభ సభ్యుడు, 2018
పద్మ విభూషణ్, 2013 పద్మభూషణ్, 2001 పద్మశ్రీ, 1976 |
ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జన్మించారు, [5] రఘునాథ్ మహాపాత్ర 1976లో అప్పటి భారత రాష్ట్రపతి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 2001లో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు.
2000లో భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్)లో రఘునాథ్ మహా పాత్రకు సభ్యుడిగా అవకాశం కల్పించింది.
రఘునాథ్ మహాపాత్ర 1963 నుండి , భువనేశ్వర్, లో హస్తకళల శిక్షణ & డిజైనింగ్ సెంటర్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడు [6]
రఘునాథ్ మహాపాత్ర శిల్పకళ ప్రపంచంలో అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. రఘునాథ్ మహా పాత్ర భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. - రఘునాథ్ మహాపాత్ర పూరీలోని పతురియా సాహిలో బిశ్వకర్మ కుటుంబంలో జన్మించారు. రఘునాథ్ మహాపాత్ర చిన్నతనంలో పాఠశాలకు వెళ్లడానికి భయపడేవాడు, కానీ తల్లితండ్రుల సూచనల మేరకు పాఠశాలకు వెళ్లేవాడు. హఠాత్తుగా రఘునాథ్ మహా పాత్ర తండ్రి మరణించడంతో ఆయన మూడవ తరగతిలోనే చదువు ఆపేశాడు. శిల్పకళలో రఘునాథ్ మహాపాత్రకు చిన్నప్పటి నుంచే ప్రావీణ్యం ఉండేది. రఘునాథ్ మహాపాత్ర తాత కూడా శిల్పి కావడంతో శిల్పకళల మీద ఆసక్తి మరింత పెరిగింది.
రఘునాథ్ మహాపాత్ర శిల్ప కళల్లో ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. శిల్పకళల మీద రఘునాథ్ మహా పాత్ర మరణించేంతవరకు మక్కువ ఉండేది. రఘునాథ్ మహా పాత్ర రాళ్ళ మీద శిల్పాలని చెక్కేటప్పుడు ఎటువంటి యంత్రాల సహాయం తీసుకునేవాడుకాదు. సుత్తితోనే రాతి మీద బొమ్మలు చెక్కేవాడు.
1960లలో తన 20వ ఏట, రఘునాథ్ మహాపాత్ర దేవతలు దేవుళ్ళ బొమ్మలను రాళ్ల మీద చెక్కి ఊళ్లో ఆ శిల్పాలని అమ్మేవాడు. రఘునాథ్ మహాపాత్ర శిల్పకళల గురించి భువనేశ్వర్‌లోని శిల్పకళ శిక్షణ డిజైనింగ్ సెంటర్ అధికారుల దృష్టికి వచ్చింది. వారు రఘునాథ్ మహాపాత్రకు ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షకుడిగా ఉద్యోగాన్ని అందించారు. తరువాత రఘునాథ్ తను పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లో సూపరింటెండెంట్‌గా మారాడు.
1974లో రఘునాథ్ మహాపాత్ర పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రదర్శించబడిన సూర్య భగవానుడి ఆరు అడుగుల ఎత్తైన రాతి విగ్రహాన్ని రూపొందించినందుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 2001లో, రఘునాథ్ మహా పాత్రను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2013లో, రాతి శిల్పకళా రంగానికి ఆయన చేసిన కృషికి పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. రఘునాథ్ మహా పాత్ర 2021 మే 9న కరోనా తో బాధపడుతూ ఒడిశాలోని భువనేశ్వర్ లో మరణించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.