From Wikipedia, the free encyclopedia
రంపచోడవరం రెవెన్యూ డివిజను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. రంపచోడవరం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.
రంపచోడవరం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు |
ప్రధాన కార్యాలయం | రంపచోడవరం |
మండలాల సంఖ్య | 11 |
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిని, విశాఖపట్నం జిల్లా పరిధిని సవరించగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం రెవెన్యూ డివిజను భాగమైంది. రంపచోడవరం రెవెన్యూ డివిజను పాత తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వున్నప్పుడు 7 మండలాలు ఉన్నాయి.[1] వీటికి అదనంగా పాత తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న ఎటపాక, వరరామచంద్రపురం, చింతూరు, కూనవరం మండలాలు రంపచోడవరం రెవెన్యూ డివిజనులో చేరి మొత్తం సంఖ్య 11 మండలాలకు చేరుకుంది.దీని పర్యవసానంగా ఎటపాక రెవెన్యూ డివిజను రద్దై చారిత్రాత్మక రెవెన్యూ డివిజనుగా మిగిలింది.
ఆ తరువాత ఎటపాక ప్రాంత ప్రజలకోరిక మేరకు ఈ డివిజనులో ఉన్న 11 మండలాలలో ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం నాలుగు మండలాలు 2022 అక్టోబరు 25న ఏర్పడిన చింతూరు రెవెన్యూ డివిజనులో చేరాయి.[2][3]
ఈ పరిపాలన విభాగంలో ప్రస్తుతం 7 మండలాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.