From Wikipedia, the free encyclopedia
చింతూరు రెవెన్యూ డివిజను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. చింతూరులో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2] ఇది 2022 అక్టోబరు 25 నుండి అమలులోకి వచ్చింది.[3]
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిని, విశాఖపట్నం జిల్లా పరిధిని సవరించగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం రెవెన్యూ డివిజను భాగమైంది. రంపచోడవరం రెవెన్యూ డివిజను పాత తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వున్నప్పుడు 7 మండలాలు ఉన్నాయి.[4] వీటికి అదనంగా అవిభాజ్య తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న ఎటపాక, వరరామచంద్రపురం, చింతూరు, కూనవరం మండలాలు రంపచోడవరం రెవెన్యూ డివిజనులో చేర్చటంతో మొత్తం సంఖ్య 11 మండలాలకు చేరుకుంది.దీని పర్యవసానంగా ఎటపాక రెవెన్యూ డివిజను రద్దై చారిత్రాత్మక రెవెన్యూ డివిజనుగా మిగిలింది.
ఆ తరువాత ఎటపాక ప్రాంత ప్రజలకోరిక మేరకు చింతూరు రెవెన్యూ డివిజను ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రభుత్వం 2022 సెప్టెంబరు 13న ప్రాథమిక నోటిఫికేషను జారీచేసిింది.[5] దానిమీద ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2022 అక్టోబరు 25న రంపచోడవరం రెవెన్యూ డివిజను లోని ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజను ఏర్పడింది.[1][6][7]
Seamless Wikipedia browsing. On steroids.