వెంకీ అట్లూరి దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. From Wikipedia, the free encyclopedia
రంగ్ దే, 2021 మార్చి 26న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.[4] సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్, నరేష్, నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు. రొమాన్స్ నేపథ్యంలో తను చేసే చివరి సినిమా అని నితిన్ ప్రకటించాడు.[5]
రంగ్ దే | |
---|---|
దర్శకత్వం | వెంకీ అట్లూరి |
రచన | వెంకీ అట్లూరి పి. సతీష్ చంద్ర |
నిర్మాత | సూర్యదేవర నాగ వంశీ |
తారాగణం | నితిన్ కీర్తి సురేష్ |
ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరామ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 26 మార్చి, 2021[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹30 కోట్లు[2] |
బాక్సాఫీసు | est. ₹14 కోట్లు (2 రోజులు)[3] |
Untitled | |
---|---|
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, శ్రీమణి పాటలు రాశాడు. 2019, ఆగస్టులో ఈ సినిమా సంగీతం ప్రారంభించబడింది.[6] 2020, నవంబరు 5న మొదటి పాట "ఎమిటో ఇది" విడుదలకావాల్సివుంది,[7] కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 2020, నవంబరు 12న విడుదలైంది.[8] 2021, ఫిబ్రవరి 27న రెండవ పాట "బస్ స్టాండే బస్ స్టాండే" విడుదలైంది.[9] 2021, మార్చిలో మరో రెండు పాటలు విడుదలయ్యాయి.[10][11] 2021, మార్చి 19న పాటలు ఆవిష్కరించబడ్డాయి.[12]
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "రంగులే" | శ్వేత మోహన్ | 4:17 |
2. | "ఊరంతా" | మంగ్లీ | 4:18 |
3. | "చూసి నేర్చుకోకు" | డేవిడ్ సైమన్ | 3:11 |
4. | "నా కనులు ఎపుడు" | సిద్ శ్రీరామ్ | 4:09 |
5. | "బస్ స్టాండే బస్ స్టాండే" | సాగర్ | 3:38 |
6. | "ఏమిటో ఇది" | కపిల్ కపిలన్, హరిప్రియ | 4:41 |
మొత్తం నిడివి: | 8:19 |
2020, జూలైలో ఈ సినిమా టీజర్ విడుదలయింది. 2021, జనవరి 14న సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.[13] 2021, జనవరి 1న జరిగిన సమావేశంలో 2021, మార్చి 26న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.[1]
ఫన్ట్ పోస్టుకు చెందిన హేమంత్ కుమార్ ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు. "ఈ సినిమాలో కీర్తి సురేష్, నితిన్ మధ్య తెరపై కెమిస్ట్రీ బాగుంది" అని రాశాడు.[14] "ఈ సినిమా హాస్యంతో ఉంది. కీర్తి సురేష్ - నితిన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది" అని ది హిందూ విమర్శకుడు సంగీత దేవి దుండూ రాశాడు.[15] ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు చెందిన జర్నలిస్ట్ ఆర్. మనోజ్ కుమార్ ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు.[16] దక్కన్ క్రానికల్ ఈ సినిమాకు 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[17]
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో ఈ సినిమా ప్రారంభం రోజున ₹ 6.7 కోట్ల వసూలు చేసింది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.