యానాం

పుదుచ్చేరి లోని యానాం జిల్లా ముఖ్య పట్టణం From Wikipedia, the free encyclopedia

యానాం

యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం.[4] ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా హద్దుగా 30 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నివసించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు మాట్లాడతారు. 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానామ్ గా గుర్తింపు ఉంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఫ్రెంచి, తెలుగు సంస్కృతుల మేళవింపు యానాంలో కనిపిస్తుంది. ఫ్రెంచి పరిపాలనలో, యానాం ప్రజల పండగ రోజులలో జనవరి మాసంలో మంగళవారం జరిగే సంతలో దిగుమతి అయిన విదేశీ సరకు కొనటానికి తెలుగు వారు యానాం వెళ్లేవారు. ఇంతకు ముందు కళ్యాణపురం అనేవారు. ఎందుకంటే బ్రిటీషు వారు 1929 లో శారదా చట్టం ద్వారా బాల్యవివాహాలు నిషేధించిన తర్వాత, ఇక్కడ ఆ పెళ్ళిల్లు జరిగేవి.1995-2005 అభివృద్ధి నివేదికల ప్రకారం, పాండిచ్చేరిలో ఉత్తమ నియోజకవర్గంగా గుర్తించబడింది. కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా వుండేది.

త్వరిత వాస్తవాలు Yanam, Country ...
Yanam
Municipality
Thumb
Location of Yanam District in India along with the other districts of Pondicherry
Thumb
Yanam
Location of Yanam in Andhra Pradesh, India
Thumb
Yanam
Location of Yanam in India
Coordinates: 16°44′00″N 82°13′00″E
Country భారతదేశం
Union territoryPuducherry
DistrictYanam
Government
  TypeMunicipality
  BodyYanam Municipality
Area
  Total
30 కి.మీ2 (10 చ. మై)
Elevation
11 మీ (36 అ.)
Population
 (2011)[1]
  Total
55,626
  Density1,900/కి.మీ2 (4,800/చ. మై.)
Languages
  OfficialTelugu,[2] English,[2] French[3]
Time zoneUTC+5:30 (IST)
PIN
533 464
Telephone code+91-0884
Vehicle registrationPY 04
మూసివేయి

భౌగోళిక, వాతావరణం

రేఖాంశం: 16°42' ఉత్తరం - 16°46' ఉత్తరం., అక్షాంశం: 82°11' తూర్పు - 82°19' తూర్పు.

యానాంలో ఉష్ణోగ్రత వేసవిలో 27°సెం. నుండి 45°సెం. వరకు, చలికాలంలో 17° సెం. నుండి 28° సెం. వరకు ఉంటుంది. ఎండా కాలంలో ఇక్కడ వాతావరణంలోని తేమ శాతం 68% నుండి 80% వరకు ఉంటుంది. ఈ జిల్లా గోదావరి నది డెల్టాలో ఉంది. ఈ పట్టణం గోదావరి నది, కోరింగ నదితో కలిసే చోట ఉంటుంది. బంగాళా ఖాత తీరం నుండి 9 కి.మీ.లు దూరంలో ఉంది.

విశేషాలు

  • యానాం పట్టణమే కాకుండ ఈ జిల్లా అధికార పరిధిలో అగ్రహారం, దరియాలతిప్ప, ఫారంపేట, గ్వెరెంపేట, జాంబవన్‌పేట, కనకాలపేట, కురసంపేట, మెట్టకుర్రు మొదలైన గ్రామాలు ఉన్నాయి.
  • 45 కోట్ల రూపాయల ఖర్చుతో యానాంలో ఈఫిల్ టవర్ నిర్మించారు.

ప్రజా ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి జిల్లా పేపర్లలోనే వస్తాయి. యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో 870 కి.మీ. దూరంలో ఉంది. యానాం 1954 దాకా భారతదేశంలోని ఫ్రెంచ్ కాలనీగా ఉంది. నేడు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. 1954లో విమోచనం చెంది, స్వతంత్ర భారతావనిలో విలీనం చెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని గ్రేటర్ కాకినాడలో కలపాలని తీర్మానం చేసింది. 870 కిలోమీటర్ల దూరంలోని తమిళ పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది. పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తుంది.రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. కాకినాడ-పుదుచ్చేరిల మధ్య జల మార్గానికి జాతీయ హోదా కల్పించే బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించింది. దాదాపు 970 కి.మీ.ల పొడవు కలిగిన ఈ జలమార్గంలో 888 కిలోమీటర్లు మన రాష్ట్ర పరిధిలో ఉంది. కొన్ని చోట్ల బకింగ్ హామ్ కాలువకు, బంగాళా ఖాతానికి మధ్య వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. ఈ జాతీయ జలమార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్ హామ్ కాలువ, దీని పరిధిలోకి వస్తాయి. మూడు రోజులపాటు 50 లక్షల వ్యయంతో నిర్వహించే ఎనిమిదో యానాం ప్రజా ఉత్సవాలు ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 6.1.2010 న ప్రారంభించారు. యానాం ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చిన జలదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కోటి రూపాయల వ్యయంతో తయారు చేసిన 26 అడుగుల ఎత్తుగల భారతమాత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ చేశారు. ఇండోర్ స్టేడియం, కళ్యాణమండపం, ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.

చరిత్ర

1723లో భారతదేశంలో యానాం మూడవ కాలనీగా ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. అయితే ఆర్థికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించక పోవటం వలన ఈ కాలనీని ఫ్రెంచివారు 1727లో వదిలేసారు. తరువాత 1742లో దీనిని మరలా ఆక్రమించి మొగలు సామ్రాజ్యాధిపతులు వద్దనుండి ఒక ఫర్మానా ద్వారా అధికారాన్ని పొందారు. అయితే వారి అంగీకారమును వారు ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశమును మొదట విజయనగర రాజు, బొబ్బిలి యుద్ధంలో తనకు సహాయ పడినందుకుగాను, ఫ్రెంచి జెనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇక్కడ బుస్సీ పేరుతో ఒక వీధి కూడా ఉంది. అంతే కాదు అదే వీధిలో ఉండే ఒక భవంతిలో బుస్సీ నివసించేవాడని కూడా అంటారు. యానాంకు పడమరలో నీలిపల్లి అనే గ్రామం ఆంగ్లేయుల పాలనలో ఉండేది. అందుకని యానాము 18వ శతాబ్దంలో అడపాదడపా ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాము, ముసాఫర్ జంగ్, ఫ్రెంచివారి వాదనలను అంగీకరిస్తూ ఈ ప్రదేశమును వారికి అప్పగించాడు.

ఆంగ్లేయులనుండి భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా, యానాం జూన్ 13 1954 వరకు ఫ్రెంచి వారి ఆధీనంలోనే ఉండి పోయింది. యానాంలో 1954లో జరిగిన "భారత సైనిక దాడి" యానాం గతినే మార్చివేసింది. నవంబరు 1 1954 న ఫ్రెంచి స్థావరాలను భారతదేశానికి వాస్తవికాంతరణ (దె-ఫాక్తో ట్రాన్స్ఫర్) చేయబడింది. కాని విధితాంతరణ (దె-జూర్ త్రాన్స్ఫర్) మాత్రము ఆగస్టు 16 1962లో జరిగింది. ప్రతి సంవత్సరము, ఈ దినమును విధితాంతరణ దినముగా (దె-జూర్ త్రాన్స్ఫర్ డే) వేడుకలు జరుపుకుంటారు. మనకు స్వతంత్రం 1947 లో వచ్చినది బ్రిటిష్ ఇండియా నుండి. కానీ అప్పటికింకా కొంత ఫ్రెంచ్ ఇండియా కూడా మిగిలి ఉంది. పాండిచేరి, చంద్రనగర్, కారైకాల్, మాహె, యానాం ప్రాంతాలు ఫ్రెంచ్ వారి హయాంలో ఉండేవి.ఈ ప్రాంతాలలో ప్రజలు కొంతమంది భారతదేశంలో కలిస్తే బాగుంటుందనీ, మరికొంతమంది ఫ్రాన్స్ దేశంలో భాగంగా ఉండటమే బాగుంటుందనీ అనుకుంటూ ఉండేవారు. రెండు రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రానందున, స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అనేక సమస్యలు ఎదుర్కుంటున్న భారత ప్రభుత్వం కూడా 1954 దాకా పోలీస్ ఏక్షన్ తో లిబెరేట్ చేద్దామనే ఆలోచన చెయ్యలేదు. జూన్ 13 న ‘ డీ ఫ్యాక్టో ’ గా అలా స్వతంత్రమైనా ఫ్రెంచ్ దేశం 1956 మే 28 న ‘ డీ జ్యూరీ ’ గా (చట్టభద్దంగా) ఏర్పడింది. (భారతదేశంలో కలిసినట్టు కాదు). అలా కలిసినప్పుడు మిగిలిన ఫ్రెంచ్ కాలనీలతో బాటు యానాం కూడా ఒక యూనియన్ టెర్రిటరీగా ఆవిర్భవించింది. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి, ప్రజలకీ ఇరు దేశాల ఒడంబడిక ప్రకారం కొన్ని ప్రత్యేక సదుపాయాలున్నందువలన వీటిని ఇతర రాష్ట్రాలలో కలిపే వీలు లేదు.

పుణ్య క్షేత్రాలు

Thumb
వెంకన్న బాబు దేవాలయం, యానాం.

వేంకటేశ్వర స్వామి దేవాలయం

వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలు ఉన్నాయి. అందువలన ఇక్కడ వేంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ గుడిని 15 వ శతాబ్దంలో రాజమహేంద్రవరంని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్యులరాజులు సమయంలో కట్టించారు. ఈ దేవాలయం భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మునుపు బాల్యవివాహాలు నిషేధించడానికి పూర్వం, బాల్యవివాహాలకు వేదికగా ఉండేది. బ్రిటిషు వారి పరిపాలనలో రాజా రామ్మోహన రాయ్ వంటి సంఘసంస్కర్తల వలన శారదా చట్టం అమలులోకి వచ్చాక బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి.

యానాం ఫ్రెంచ్ వారి పరిపాలన జరుపుతున్న సమయంలో ఈ దేవాలయం బాల్య వివాహాలకు ఎంత ప్రసిద్ధి చెందినదంటే ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. ఇక్కడికి మద్రాసు రాష్ట్రం, హైదరాబాదు నుండి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. వందలకొద్ది వివాహాలు జరగడం వల్ల ఈ ఊరిని కళ్యాణపురం అని పిలిచేవారు.

Thumb
మస్జిద్, యానాం

మసీదు

1848 సంవత్సరంలో ఈ మసీదు (మస్జిద్) నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మితమైనది. తరువాతి కాలంలో 1956 సంవత్సరంలో మసీదుకి పునరుద్ధరణ పనులు జరిగాయి. 1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు. 1999-2000 సంవత్సరానికి ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు చాలా జరుపబడతాయి. తల్లరేవు, కొలంక, శుంకరపాలెం నుండి కూడా భక్తులు వచ్చి ప్రార్థన జరుపుకొంటారు.

Thumb
యానాం బీచ్

యానాం ప్రముఖులు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.