From Wikipedia, the free encyclopedia
యమునా కృష్ణన్ 25 మే 1974[1] న జన్మించిన ఒక భారత రసాయన శాస్త్రవేత్త. ఈమె బెంగుళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS, లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.[1][2]
యమునా కృష్ణన్ | |
---|---|
జననం | 25 మే, 1974 |
నివాసం | బెంగుళూరు |
జాతీయత | భారతీయులు |
రంగములు | రసాయనశాస్త్రం |
వృత్తిసంస్థలు | NCBS, బెంగుళూరు |
చదువుకున్న సంస్థలు | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), మహిళా క్రిస్టియన్ కాలేజ్-మద్రాసు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం |
యమునా కృష్ణన్ మద్రాసు లోని మహిళా క్రిస్టియన్ కాలేజ్ నుండి బాచిలర్స్ డిగ్రీ పొందారు.[2] 2001 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగుళూర్ నుండి 2001 లో ఈమె PhD పట్టా పుచ్చుకుంది.[2] తరువాత 2002 నుండి 2004 వరకు, ఈమె శంకర్ బాలసుబ్రమణ్యన్ యొక్క సమూహంలో, ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ ఫెల్లో పనిచేసింది.[1]
2005లో భారతదేశం తిరిగి వచ్చిన యమునా కృష్ణన్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్లో జునియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదవి స్వీకరించారు. 2009 లో, ఈమె సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. ఈమె న్యూక్లియిక్ ఆమ్లాలు నిర్మాణం, డైనమిక్స్, న్యూక్లియిక్ ఆసిడ్ నానోటెక్నాలజీ, సెల్యులర్, సబ్సెల్యులర్ టెక్నాలజీస్ లపై పరిశోధన చేస్తున్నారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.