మోతీహారి
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
మోతీహారి బీహార్ రాష్ట్రం, తూర్పు చంపారణ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది రాష్ట్ర రాజధాని పాట్నాకు ఉత్తరంగా 150 కి,.మీ. దూరంలో ఉంది..
భౌగోళికం
మోతీహారి వాయువ్య బీహార్‌లో, 26° 39' ఉత్తర అక్షాంశం, 84° 55' తూర్పు రేంఖాంశం వద్ద ఉంది. [3] ఇది రాష్ట్ర రాజధాని పాట్నా నుండి వాయువ్యంగా సుమారు 150 కి.మీ. దూరం లోను, బేతియా నుండి 45 కి.మీ., ముజఫర్పూర్ నుండి 72 కి.మీ., మెహ్సీ నుండి 40 కి.మీ., చాకియా నుండి 30 కి.మీ., సీతామఢీ నుండి 75 కి.మీ. దూరం లోనూ ఉంది ఇది ఒక సరస్సుకు తూర్పు ఒడ్డున ఉంది.
జనాభా
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మోతీహారి జనాభా 1,26,158, వీరిలో 67,861 మంది పురుషులు, 58,297 మంది మహిళలు. లింగ నిష్పత్తి 859. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 16,870. మోతీహారిలో అక్షరాస్యుల సంఖ్య 92,798, ఇది జనాభాలో 73.6%. పురుషుల్లో అక్షరాస్యత 76.2% కాగా, స్త్రీలలో 70.5%.. మోతీహారిలో ఏడేళ్ళకు పైబడీనవారిలో అక్షరాస్యత 84.9%. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.1%, స్త్రీల అక్షరాస్యత 81.2%. షెడ్యూల్డ్ కులాల జనాభా 7,373, షెడ్యూల్డ్ తెగల జనాభా 333. 2011 నాటికి పట్టణంలో 22,224 గృహాలు ఉన్నాయి. [1]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, 2011 లో మోతీహారి జనాభా 1,01,506, వీరిలో పురుషులు 54,629, స్త్రీలు 46,877. లింగ నిష్పత్తి 858. మోతీహారి నగరంలో మొత్తం అక్షరాస్యులు 69,576. వీరిలో 40,265 మంది పురుషులు కాగా, 29,311 మంది మహిళలు. అక్షరాస్యత రేటు 68.5%. ఏడేళ్ళకు పైబడిఅ వారిలో (ప్రభావశీలమైన) అక్షరాస్యత 80.3%. పట్టణంలో ఆరేళ్ళ లోపు పిల్లలు 14,910. బాలల్లో లింగ నిష్పత్తి 909.[4]
శీతోష్ణస్థితి
అధిక ఉష్ణోగ్రతలు, ఏడాది పొడవునా సమానంగా ఉండే అవపాతం మోతోహారి శీతోష్ణస్థితి ప్రత్యేకత. దీన్ని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) గా వర్గీకరించారు
శీతోష్ణస్థితి డేటా - Motihari | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
[మూలం అవసరం] |
మోతీహారి నుండి భారతదేశంలోని వివిధ నగరాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. నగరానికి సేవలు అందించే ప్రధాన రైల్వే స్టేషన్ బాపుధామ్ మోతీహారి రైల్వే స్టేషను. న్యూ ఢిల్లీ, ముంబై, జమ్మూ, కోల్‌కతా, గౌహతిలకు ఇక్కడి నుండి నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆసియా రహదారి 42, జాతీయ రహదారి 28 ఎ, రాష్ట్ర రహదారి 54 లు పట్టణం గుండా వెళ్తాయి. సమీప విమానాశ్రయం పాట్నాలో (150 కి.,మీ.) ఉంది. దర్భంగా విమానాశ్రయం ప్రారంభమైన తరువాత, ఇది సమీప విమానాశ్రయ మౌతుంది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.