From Wikipedia, the free encyclopedia
రాజేంద్ర చోళుడు లేదా మొదటి రాజేంద్ర చోళుడు (1014−1044) ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన 11వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తి (ప్రస్తుత తమిళనాడు, ఆంధ్రప్రదేశు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు) . ఈయనకు గంగైకొండ, కడారంకొండ, పండిత చోళ అనే బిరుదులు కూడా ఉన్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకులలో ఒకడిగా ఆయనను చరిత్రకారులు పరిగణిస్తారు. ఆయన తన తండ్రి రాజరాజ చోళుడి తర్వాత సా. శ 1014 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గంగానది తీరం వరకు, హిందూ మహాసముద్రం దాటి పశ్చిమానికి, ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరించింది. అందుకనే ఇది ప్రాచీన భారతీయ రాజ్యాలలో బలమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతోంది.[7][8] ఈయన జైత్రయాత్రలో భాగంగా శ్రీలంక, మాల్దీవులు జయించాడు. అంతేకాక మలేషియాలోని శ్రీవిజయ, ఆగ్నేయ ఆసియాలోని దక్షిణ థాయి ల్యాండు, ఇండోనేషియా మీద కూడా దాడులు చేశాడు.[7][9] థాయి ల్యాండు, కాంబోడియా రాజ్యానికి చెందిన ఖ్మేరు ప్రాంతాల నుంచి కప్పం వసూలు చేశాడు. ప్రస్తుతం బెంగాలు, బీహారు రాష్ట్రాలలో విస్తరించిన గౌడ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలవంశ రాజు మహిపాలుడిని ఓడించాడు. తన విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళుడు (గంగానది ప్రాంతాన్ని జయించిన వాడు) అనే బిరుదు పొందాడు.[10] గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని కూడా నిర్మించాడు.[11][12] ఈయన తన కుమార్తె అమ్మాంగ దేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అమ్మాంగ దేవి కుమారుడే కులుత్తోంగ చోళుడు(చాలుక్యుడు). తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు ఇతని విజయాలను గూర్చి వర్ణిస్తాయి. ఈయన తర్వాత ఇతని కుమారుడు రాజాధిరాజు విజయ రాజేంద్ర అనే పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు.
మొదటి రాజేంద్ర చోళుడు | |
---|---|
పరకేసరి, యుద్ధమల్లుడు, ముమ్ముడి, గంగై కొండన్, కదరం కొండన్[3] | |
పరిపాలన | సుమారు 1014 – 1044 CE[6] |
పూర్వాధికారి | మొదటి రాజరాజ చోళుడు |
ఉత్తరాధికారి | మొదటి రాజాధిరాజ చోళుడు |
మరణం | 1044 CE |
రాణి/రాణులు | త్రిభువన మహాదేవియార్ పంచవన్ మాదేవియార్ విరమాదేవి |
వంశము | మొదటి రాజాధిరాజ చోళుడు, రెండవ రాజేంద్రచోళుడు, వీరరాజేంద్ర చోళుడు, అరుల్మొళునంగయార్, అమ్మంగదేవి |
రాజవంశం | చోళ సామ్రాజ్యం |
తండ్రి | రాజరాజ చోళుడు |
తల్లి | తిరిపువన మడివియార్ |
మతం | శైవమతం |
మొదటి రాజేంద్ర చోళుడు రాజరాజ చోళ, కొడుంబలూరు యువరాణి తిరిభువన మదేవియారు దంపతుల కుమారుడు. ఆయన తమిళ మాసం ఆడిలో తిరువతిరాయిన జన్మించాడు. ఆయనను మొదట మదురాంతకను అని పిలిచేవారు. ఆయన తన బాల్యంలో ఎక్కువ భాగం పాలయరాయిలో గడిపాడు. ఆయన అత్త కుందవై, ముత్తవ్వ సెంబియను మాదేవి చేతిలో పెరిగాడు. సా.శ. 1012 లో ఆయన సహాయ రాజప్రతినిధిగా పనిచేశాడు. రాజేంద్ర అధికారికంగా సా.శ. 1014 లో చోళ సింహాసనాన్ని అధిష్టించాడు. సా.శ. 1018 లో ఆయన తన పెద్ద కుమారుడు మొదటి రాజాధీరాజ చోళుడిని యువరాజుగా నియమించాడు.[13][dubious ]
మొదట పాండ్య, చేర రాజ్యాలను జయించాడు. గంగానది వరకు వెళ్ళి పాలరాజు మహీపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదు పొందాడు. నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక శ్రీవిజయ రాజ్యాలను జయించాడు. సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయ రాజ్యం అని పిలిచేవారు. 1025లో శ్రీవిజయ రాజు శైవేంద్రుడిని ఓడించి ఆ రాజధాని కడారం పేరు మీదుగా కడారంకొండ అనే బిరుదు పొందాడు. 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు. అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పరిపాలకుడు మొదటి రాజేంద్ర చోళుడు.
చాళుక్య రాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగీ చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునికి సహాయం చేశాడు. అంతేకాక అతనికి తన కూతురు అమ్మాంగి దేవినిచ్చి వివాహం చేశాడు.
1002 నుండి రాజేంద్రచోళుడు పోరాటాలకు నాయకత్వం వహించారు. రాష్ట్రకూటులను జయించడం, పశ్చిమ చాళుక్యులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు వీటిలో భాగంగా ఉన్నాయి. ఆయన యెదటూరు లోని చాళుక్య భూభాగాలను (కృష్ణ, తుంగభద్ర మధ్య రాయచూరు జిల్లాలో ఎక్కువ భాగం), మైసూరు వాయవ్యంలో బనవాసి, రాజధాని మన్యఖేటలను జయించాడు. రాజేంద్ర భట్కలు వద్ద శివాలయం నిర్మించాడు. సా.శ. 1004 లో ఆయన తలాకాడును స్వాధీనం చేసుకుని దాదాపు 1000 సంవత్సరాలు మైసూరును పాలించిన పశ్చిమ గంగా రాజవంశాన్ని పడగొట్టాడు. కోలారులోని ఒక శాసనంలో తమిళంలో చెక్కబడిన ఒక సారాంశం ఇలా పేర్కొంది:
కొప్పరకేసరివంన్మారు శ్రీ రాజేంద్ర చోళ దేవా పాలన 8 వ సంవత్సరంలో అదృష్ట దేవత స్థిరంగా ఉన్నప్పుడు భూమి దేవత, యుద్ధంలో విజయ దేవత, సాటిలేని కీర్తి దేవత ఆయనకు గొప్ప రాణులుగా మారి సంతోషించారు. తన దీర్ఘకాల జీవితకాలంలో తన గొప్ప యుద్ధ-లాంటి సైన్యం అయిన ఇడైతురై-నాడుతో విజయాలు హస్థగతం చేసుకున్నాడు. ఆయన విశాల సైన్యప్రవాహానికి వనవాసి అడవులు కంచెతో మూసివేయబడింది; కొల్లిపాక్కై("కొల్లి"పాక), దీని గోడలుగా సుల్లి చెట్లతో చుట్టుముట్టాయి; మన్నైక్కడక్కం అనే ఆయన కోటను చేరుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.[14]
మొదటి రాజరాజ చోళుడు తన పాలనలో శ్రీలంక ఉత్తర భూభాగాన్ని జయించాడు. రాజేంద్ర క్రీస్తుశకం 1017 లో శ్రీలంక మీద దాడి చేసి మొత్తం ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[15] మొదటి పరాంతక స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన పాండ్యుల ఆభరణాలు, సింహళ రాజు కిరీటాన్ని పోరాటం ఫలితంగా రాజేంద్ర స్వాధీనం చేసుకున్నాడు. సింహళ రాజు 5 వ మహీందని ఖైదీగా తీసుకొని చోళ దేశానికి తరలించారు.
తమిళ రాగి ఫలక శాసనాలలో సూచించబడిన పాండ్య, చేరా రాజ్యాల మీదుగా విజయయాత్ర చేశారు. మొదటి రాజరాజ పాలనలోని భూభాగాలు అప్పటికే జయించబడ్డాయి.[13] రాజేంద్ర తన కుమారులలో ఒకరిని " జాతవర్మను సుందర చోళ-పాండ్య " అనే బిరుదుతో రాజప్రతినిధిగా నియమించారు.
సా.శ. 1015 లో రెండవ జయసింహ పశ్చిమ చాళుక్యుల రాజు అయ్యాడు. ఆయన తన పూర్వీకుడు సత్యాశ్రయ అనుభవించిన నష్టాలను తిరిగి స్వాధీనంచేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన తన రాజధాని నుండి పారిపోయి, తరువాత మొదటి రాజరాజ సామంతరాజుగా సింహాసనం పొందాడు. ప్రారంభంలో రాజేంద్ర శ్రీలంకలో తన పోరాటంలో ఉన్నందున రెండవ జయసింహ వారసత్వాధికారం స్వీకరించాడు.[16] సా.శ. 1021 లో వేంగిరాజు తూర్పు చాళుక్య రాజు విమలాదిత్య మరణం తరువాత రాజరాజు నరేంద్ర వారసత్వపోరాటానికి వ్యతిరేకంగా జయసింహ మూడవ విజయాదిత్యకు సింహాసనం అధిష్టించడానికి మద్దతు ఇచ్చాడు. రాజరాజ నరేంద్ర విమలాదిత్య, చోళ యువరాణి కుందవై(రాజరాజ చోళ కుమార్తె) కుమారుడు. [16] విజయాదిత్యను ఓడించడానికి రాజేంద్ర తన మేనల్లుడు రాజరాజుకు సహాయం చేశాడు.[17] ఆయన సైన్యాలు వెంగిలో విజయాదిత్యాను, మాస్కీ యుద్ధంలో జయసింహను ఓడించాయి.[16]
సా.శ. 1019 లో రాజేంద్ర దళాలు కళింగ మీదుగా గంగా నది వైపు వెళ్ళాయి. కళింగలో చోళ దళాలు సోమవంసి రాజవంశం పాలకుడు ఇంద్రరాతను ఓడించాయి.[18] చోళ సైన్యం చివరికి బెంగాలు పాల రాజ్యానికి చేరుకుని అక్కడ వారు మహిపాలాను ఓడించారు. దండభూక్తికి చెందిన కాంభోజ పాల రాజవంశం చివరి పాలకుడు ధర్మపాలాను కూడా చోళ సైన్యం ఓడించింది.[19][20] తరువాత చోళ సైన్యం తూర్పు బెంగాలు మీద దాడి చేసి, చంద్ర రాజవంశానికి చెందిన గోవిందచంద్రను ఓడించి బస్తరు ప్రాంతం మీద దాడి చేసింది.[21][22] 3 వ కుళోత్తుంగ కాలం వరకు చోళ రాజ్యానికి కప్పం చెల్లించే సామంతరాజులు, వాణిజ్య భాగస్వాములతో సంబంధాలు కొనసాగాయి.[23] గంగై కొండచోళ పురంలో కొత్త రాజధానిని నిర్మించి తంజావూరులోని బృహదీశ్వర ఆలయానికి సమానమైన బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు.
సైలేంద్ర రాజవంశం శ్రీవిజయ సుమత్రాలోని పాలెంబాంగు కేంద్రీకృతమై ఉన్న రాజ్యన్ని పాలించింది. మారా విజయతుంగవర్మను పాలనలో శ్రీవిజయ మొదటి రాజరాజ చోళుని పాలనలో చోళ సామ్రాజ్యంతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నారు; మారా విజయతుంగవర్మను నాగపట్నం వద్ద చూడామణి విహారాన్ని నిర్మించాడు. మారా తరువాత సంగ్రామ విజయతుంగవర్మను రాజ్యభారం వహించాడు.
ఖైమరు చక్రవర్తి మొదటి సూర్యవర్మను తాంబ్రలింగ రాజ్యం మీద (మలయ ద్వీపకల్పంలో) యుద్ధం చేయడానికి మొదటి సూర్యవర్మను రాజేంద్ర నుండి సహాయం కోరాడు.[24][25] రాజేంద్ర చోళుడితో సూర్యవర్మను పొత్తు గురించి తెలుసుకున్న తరువాత, తాంబ్రలింగ శ్రీవిజయ నుండి సహాయం కూరగా సంగ్రామ సహాయం చేయడానికి అంగీకరించాడు.[24][26] ఇది చివరికి శ్రీవిజియా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చోళుల దండయాత్రకు దారితీసింది. ఈ కూటమికి కొంతవరకు స్వల్పమైన మతపరమైన బేధం కూడా ఉంది. ఎందుకంటే చోళ సామ్రాజ్యం, ఖైమరు సామ్రాజ్యం రెండూ హిందూ శైవ సామ్రాజ్యాలు, తాంబ్రలింగ, శ్రీవిజయలు మహాయాన బౌద్ధులు.
సా.శ. 1025 లో రాజేంద్ర హిందూ మహాసముద్రం మీదుగా చోళ దళాలను నడిపించి శ్రీవిజయ, మలేషియా, ఇండోనేషియాలోని అనేక ప్రదేశాల మీద దాడి చేశాడు.[27] చోళులు కడారం (రాజధాని) సుమత్రాలోని పన్నై, మలయ ద్వీపకల్పంలోని మలైయూరులను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారు ఆధునిక మలేషియా, దక్షిణ థాయిలాండులోని తాంబ్రలింగా, లంగాసుకా రాజ్యం మీద కూడా రాజేంద్ర దండయాత్ర చేశాడు. [12][28][29] చోళ దళాలు సైలేంద్ర రాజవంశం చివరి పాలకుడు సంగ్రామ విజయతుంగ్గవర్మనును స్వాధీనం చేసుకున్నాయి.[30] చోళ దండయాత్రతో శ్రీవిజయ ముగింపుకు వచ్చింది.[31][32] చోళుల దాడిలో శ్రీవిజయ సముద్ర శక్తి క్షీణించింది.[33] దీని తరువాత చోళ సామ్రాజ్యం శ్రీవిజయ పెద్ద భాగాలను స్వాధీనం చేసుకుంది. వీటిలో లిగోరు, కేదా, తుమాసికు (ఇప్పుడు సింగపూరు) ఓడరేవులు ఉన్నాయి.[33][34] చోళుల దండయాత్రలో మణిగ్రామం, అయ్యవోలు, ఐనూట్రువరు వంటి తమిళ వ్యాపార సంఘాలను ఆగ్నేయాసియాలో విస్తరించడానికి దోహదపడింది.[35][36][37][38] తరువాతి శతాబ్దకాలం దక్షిణ భారతదేశంలోని తమిళ వాణిజ్య సంస్థలు ఆగ్నేయాసియాలో ఆధిపత్యం వహించాయి.[31][32] మొదటి రాజేంద్ర చోళుడి దండయాత్ర " మధ్యయుగ మలయ క్రానికలు " (సెజారా మెలయా) రాజా చులాను అనే పదరూప బేధంతో ప్రస్తావించబడింది. మలయ యువరాజులకు చులాను, వంటి పదాలతో (రాజ చులాను (పెరకు) ) ముగిసే పేర్లు ఉన్నాయి.[39][40][41][42][43] రాజేంద్ర చోళుడి ఒక రికార్డు ఆయనను ఉత్తర సుమత్రాలోని లమూరి రాజుగా అభివర్ణిస్తుంది.[44] చోళ దండయాత్ర శ్రీవిజయ సైలేంద్ర రాజవంశం పతనానికి దారితీసింది. చోళ దండయాత్ర 1025 లో సుమత్రా నుండి బౌద్ధ పండితుడు అతినా భారతదేశానికి తిరుగు ప్రయాణంతో సమానంగా ఉంటుంది.[45]
రాజేంద్ర చోళుడు శిల్పకళను బాగా ఆదరించాడు. తంజావూరులోని బృహదీశ్వరాలయం తమిళనాడులోని ఆలయాల్లోకెల్లా అతి పెద్దది. దీన్ని రాజేంద్ర చోళుడి తండ్రి రాజ రాజ చోళుడు నిర్మించాడు. రాజేంద్ర చోళుడు పాల వంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించి అందులో తండ్రి కట్టించిన ఆలయాన్ని పోలిఉండే మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. విస్తీర్ణపరంగా ఈ ఆలయం తంజావూర్ ఆలయం కంటే పెద్దది.[46] గంగైకొండ చోళపురం ఆగ్నేయ ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది.
ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించాడు. దాని పోషణకు కొంత భూభాగాన్ని కూడా దానమిచ్చాడు. పెద్ద కృత్రిమ రిజర్వాయరు నిర్మింపజేసి కొలెరుం, వెల్లార్ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని నింపాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.