Remove ads
From Wikipedia, the free encyclopedia
మొఘల్ ఎ ఆజం (ఆంగ్లం : Mughal-e-Azam) (హిందీ భాష: मुग़ल-ए आज़म, ఉర్దూ భాష: مغلِ اعظم) ఒక భారతీయ సినిమా. దీని నిర్మాత నిర్దేశకుడు కే. ఆసిఫ్. ఈ ఉర్దూభాషా చిత్రం 1960 లో నిర్మింపబడినది. ఈ చిత్రనిర్మాణానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది.ఈ చిత్రం 1960లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది
Mughal-e-Azam | |
---|---|
దర్శకత్వం | కే. ఆసిఫ్ |
రచన | అమాన్ కమాల్ అమ్రోహీ |
నిర్మాత | కే ఆసిఫ్ |
తారాగణం | దిలీప్ కుమార్, మధుబాల, పృథ్వీరాజ్ కపూర్ అజిత్ ఖాన్ దుర్గా ఖోటే నిగార్ సుల్తానా |
ఛాయాగ్రహణం | ఆర్.డి. మాథుర్ |
కూర్పు | ధరమ్వీర్ |
సంగీతం | నౌషాద్ |
విడుదల తేదీ | 1960 |
సినిమా నిడివి | 173 ని. |
భాష | ఉర్దూ |
సినిమాలో ఒక పాట, చివరి దృశ్యం మాత్రము ఈస్టుమన్ కలర్లో చిత్రీకరించారు. 2004లో దీనిని పూర్తి రంగుల చిత్రంగా తిరిగి విడుదల చేశారు.
మొఘల్ సుల్తాన్ అక్బర్ (పృథ్వీరాజ్ కపూర్), తనయుడు సలీం (దిలీప్ కుమార్), 'అనార్కలీ' (మధుబాల) ల మధ్యన ఈ చిత్రకథ నడుస్తుంది. చారిత్రక చిత్రాన్ని ప్రేమకథా చిత్రంగా మలచి, తయారయ్యింది ఈ సినిమా. అనేక చారిత్రక విషయాలు సత్యదూరాలే. కానీ, ఈ చిత్రంలో వాడిన భాష 'సాహిత్య భాష', సంగీతం నౌషాద్ సమకూర్చగా, లతా మంగేష్కర్, షంషాద్ బేగం, ముహమ్మద్ రఫీ లు పాటలు పాడారు;
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.