Remove ads
నాగాలాండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో మొకాక్ఛుంగ్ జిల్లా ఒకటి. మొకాక్ఛుంగ్ పట్టణం జీల్లాకేంద్రంగా ఉంది. ఇది ఆవో నాగాలగిరిజనులకు పుట్టిల్లు. జిల్లా వైశాల్యం 1,615 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులలో అస్సాం రాష్ట్రం, పడమర సరిహద్దులలో వోఖా జిల్లా, తూర్పుసరిహద్దులలో తుఏన్సాంగ్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో జునెబోటొ జిల్లా ఉన్నాయి.
మొకొక్ఛుంగ్ జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | మొకొక్ఛుంగ్ |
విస్తీర్ణం | |
• Total | 1,615 కి.మీ2 (624 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,93,171 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://mokokchung.nic.in/ |
భౌగోళికంగా నాగాలాండ్ రాష్ట్రంలో 6 పర్వతశ్రేణులు ఉన్నాయి. ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉన్న ఈ పర్వతశ్రేణులు ఈశాన్యం నుండి నైరుతి దిశగా విస్తరించి ఉన్నాయి. రాష్ట్రం 94.29, 94.76 డిగ్రీలు అక్షాంశం, 26.20, 26.77 డిగ్రీల రేఖాంశం మద్య ఉపస్థితమై ఉంది. మొకాక్ఛుంగ్ జిల్లా అంతా ఈ పర్వతశ్రేణుల ద్వారా ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది. జిల్లాలో ప్రధాన గ్రామాలు త్యూయన్సాంగ్, చంగ్కి, మిలక్ లోయలు మొదలైనవి. రాష్ట్రంలో ఈ జిల్లా వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా దిమాగ్, కోహిమా జిల్లా జిల్లాలులాగా అభివృద్ధిదిశలో ఉంది. చంగ్కి-లాంగ్నాక్, త్యూయంసాంగ్, మిలక్, దిఖు, త్య్యూయంసాంగ్ లోయల భూములు ప్రధానమైనవి. తులి-మిలాక్ భూభాగం, చంగ్కి-లాంగ్నాక్ లోయలు ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్నాయి.
వర్గీకరణ | ప్రాంతం (కి.మీ2) |
---|---|
మొత్తం భూభాగం | 1615 |
ఫారెస్ట్ డిపార్ట్మెంటు కొనుగోలుచేసిన భూమి | 49.66 |
వ్యవసాయం | 180.39 |
గ్రామాలు, పట్టణాలు | 10.50 |
హార్టి కల్చర్ | 8.12 |
పలు అభివృద్ధి శాఖలు | 386.07 |
ఉపయోగంలో లేని భూమి | 982.62 |
పేరు | జనసంఖ్య |
---|---|
చుచుయిమ్లాంగ్ | 9,524 |
చుచుయిమ్లాంగ్ గ్రామం | 7,846 |
చుచుయిమ్లాంగ్ కాంపౌండ్ | 1,678 |
చంగ్కి | 7,718 |
ఉంగ్మ | 7,189 |
లాంగ్జంగ్ | 7,005 |
మొకాక్చుంగ్ జిల్లా కేంద్రం మొకాక్చుంగ్ పట్టణం. జిల్లాకు దెఫ్యూటీ కమీషనర్ పాలనా బాధ్యతలు వహిస్తున్నాడు. మొకాక్చుంగ్ జిల్లా తులి, మాంగ్కోలెంబా, చంగ్తోంగ్యా అనే 3 విభాగాలుగా విభజించబడి ఉంది. నాగాలాండ్ రాష్ట్రంలో ఇది చాలా ప్రధానమైనది. ఇక్కడి నుండి 10 మంది అసెంబ్లీకి ఎన్నిక చెయ్యబడ్డారు. ప్రస్తుతం ఈ జిల్లకు చెందిన 4 అసెంబ్లీ సభ్యులు అధికార పార్టీలో ఉండగా 6 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారై ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా అలిచెన్-మొకాక్ఛుంగ్ ఉంది.రాష్ట్రంలో అతిపెద్ద నగరప్రాంతంగా ఈ జిల్లా ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 193,171, [1] |
ఇది దాదాపు | సమోవా దేశ [2] జనసంఖ్యకు సమానం |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 591 వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
స్త్రీ పురుష నిష్పత్తి | 927:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | తక్కువ |
అక్షరాస్యత శాతం | 70.68%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | తక్కువ |
నాగాలాండ్ రాష్ట్రంలో అత్యధికంగా క్రైస్తవమతం ఆచరణలో ఉంది. దాదాపు జనసంఖ్యలో 95% బాప్టిస్టులు ఉన్నారు. 19వ శతాబ్దంలో నాగాలలో ప్రారంభం అయిన క్రైస్తవ మతం తరువాతరోజులలో కొనసాగింది. క్రైస్తవ చర్చిలలో పెద్ద ఎత్తున సభలు కూడా నిర్వహిస్తుంటారు.
2001 గణాంకాలను అనుసరించి జిల్లా అక్షరాస్యతా శాతం 84.6%. ఇది రాష్ట్రంలో అత్యధికం, దృశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2007 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా 100% అక్షరాస్యత సాధించడం ప్రత్యేకత. స్త్రీ:పురుషుల నిష్పత్తి 1004:1000. భారతదేశంలోని జిల్లాలలో 6 సంవత్సరాలకు దిగువన ఉన్న పిల్లలలో ఇది అత్యధిక శాతమని అంచనా.
మొకొక్చంగ్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు;
మొకొక్చంగ్ జిల్లాలోని కాలేజీలు :
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.