మొండే జోండేకి

దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia

మొండే జోండేకి

మొండే జోండేకి (జననం 1982, జూలై 25) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, పది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ప్రస్తుతం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కేప్ కోబ్రాస్, వెస్ట్రన్ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
మొండే జోండేకి
Thumb
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1982-07-25) 25 జూలై 1982 (age 42)
కింగ్ విలియమ్స్ టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 292)2003 21 August - England తో
చివరి టెస్టు2008 26 November - Bangladesh తో
తొలి వన్‌డే (క్యాప్ 73)2002 6 December - Sri Lanka తో
చివరి వన్‌డే2008 2 November - Kenya తో
ఏకైక T20I (క్యాప్ 16)2006 9 January - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000–2004Border
2004Eastern Cape
2005Warriors
2005–Cape Cobras
2008Warwickshire
2009–2010Western Province
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 5 11
చేసిన పరుగులు 82 4
బ్యాటింగు సగటు 20.50 4.00
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 59 3*
వేసిన బంతులు 692 456
వికెట్లు 16 8
బౌలింగు సగటు 27.37 51.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/39 2/46
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/–
మూలం: Cricinfo, 2006 14 February
మూసివేయి

క్రికెట్ రంగం

2003లో ఇంగ్లాండ్‌తో జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్‌లో,[1] గాయం కారణంగా బౌలింగ్ కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, మొదటి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేశాడు. గ్యారీ కిర్‌స్టన్‌తో కలిసి కీలకమైన ఎనిమిదో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.[2] 2004-05లో జింబాబ్వేతో జరిగిన తన రెండో టెస్టులో 66 పరుగులకు 3 వికెట్లు, 39 పరుగులకు 6 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్ విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.[3]

2007-08 దక్షిణాఫ్రికా సీజన్‌లో 19.17 సగటుతో 62 వికెట్లు తీసి ప్రముఖ వికెట్-టేకర్‌గా నిలిచాడు.[4] 2008 సీజన్ ప్రారంభ వారాల్లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు, అక్కడ మాజీ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అలన్ డోనాల్డ్ చేత శిక్షణ పొందాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో 95 పరుగులకు 4 తీసుకున్నాడు. నాలుగు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో 42.33 సగటుతో 9 వికెట్లు, నాలుగు లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 158 పరుగులకు 1 వికెట్లు పడగొట్టాడు.

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.