మైఖేల్ బ్రేస్‌వెల్

From Wikipedia, the free encyclopedia

మైఖేల్ గోర్డాన్ బ్రేస్‌వెల్ (జననం 1991, ఫిబ్రవరి 14) వెల్లింగ్టన్ తరపున ఆడే న్యూజీలాండ్ క్రికెటర్. మాజీ టెస్ట్ ఆటగాళ్లు బ్రెండన్, జాన్ బ్రేస్‌వెల్‌ల మేనల్లుడు. ప్రస్తుత అంతర్జాతీయ ఆటగాడు డగ్ బ్రేస్‌వెల్, హాస్యనటుడు మెలానీ బ్రేస్‌వెల్ ల బంధువు. డునెడిన్‌లోని కవానాగ్ కళాశాలలో చదివాడు. 2022 మార్చిలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[1]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
మైఖేల్ బ్రేస్‌వెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మైఖేల్ గోర్డాన్ బ్రేస్‌వెల్
పుట్టిన తేదీ (1991-02-14) 14 ఫిబ్రవరి 1991 (age 34)
మాస్టర్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్ ఆల్ రౌండర్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 283)2022 జూన్ 10 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2023 మార్చి 17 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 201)2022 మార్చి 29 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2023 జనవరి 24 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.4
తొలి T20I (క్యాప్ 92)2022 జూలై 18 - ఐర్లాండ్ తో
చివరి T20I2023 ఫిబ్రవరి 1 - ఇండియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.4
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 8 19 16 104
చేసిన పరుగులు 259 510 113 5,521
బ్యాటింగు సగటు 19.92 42.50 18.83 32.28
100లు/50లు 0/1 2/0 0/1 11/23
అత్యుత్తమ స్కోరు 74* 140 61* 190
వేసిన బంతులు 1,551 738 245 3,891
వికెట్లు 24 15 21 51
బౌలింగు సగటు 41.79 42.26 10.42 44.82
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/75 3/21 3/5 5/43
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 9/– 8/– 106/–
మూలం: Cricinfo, 2023 20 March 2023
మూసివేయి

క్రికెట్ రంగం

2018 జూన్ లో, 2018–19 సీజన్ కోసం వెల్లింగ్‌టన్‌తో ఒప్పందం పొందాడు.[2] 2020 మార్చిలో, 2019-20 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఆరో రౌండ్‌లో, బ్రేస్‌వెల్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్లు సాధించాడు.[3]

2020 జూన్ లో, 2020–21 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు వెల్లింగ్టన్ ఒప్పందాన్ని అందించాడు.[4][5] 2022, జనవరి 8న, 2021–22 సూపర్ స్మాష్ టోర్నమెంట్‌లో, బ్రేస్‌వెల్ వెల్లింగ్‌టన్ ఫైర్‌బర్డ్స్ తరఫున సెంట్రల్ స్టాగ్స్‌పై 141 నాటౌట్‌గా స్కోర్ చేశాడు.[6] న్యూజీలాండ్‌లో జరిగిన ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది.[7]

2022 మార్చిలో, బ్రేస్‌వెల్ నెదర్లాండ్స్‌తో జరిగే వారి స్వదేశీ సిరీస్ కోసం న్యూజీలాండ్ వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు.[8] 2022, మార్చి 29న న్యూజీలాండ్ తరపున నెదర్లాండ్స్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[9] 2022 మేలో, ఇంగ్లాండ్ పర్యటన కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో బ్రేస్‌వెల్ ఎంపికయ్యాడు.[10] 2022, జూన్ 10న న్యూజీలాండ్ తరపున ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[11]

2022 జూలైలో, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, బ్రేస్‌వెల్ వన్డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.[12] బ్రేస్‌వెల్ తన టీ20 అరంగేట్రం 2022, జూలై 18న న్యూజీలాండ్ తరపున ఐర్లాండ్‌తో ఆడాడు.[13] రెండురోజుల తర్వాత, ఐర్లాండ్‌తో సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లో, బ్రేస్‌వెల్ అంతర్జాతీయ మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లో టీ20 క్రికెట్‌లో తన మొదటి హ్యాట్రిక్ సాధించాడు.[14]

2023 జనవరిలో, భారత్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్రేస్‌వెల్ వన్డే క్రికెట్‌లో న్యూజీలాండ్ తరపున మూడవ వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.[15] ఏడో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు.[15]

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.