మెకానిక్ అల్లుడు

From Wikipedia, the free encyclopedia

మెకానిక్ అల్లుడు

మెకానిక్ అల్లుడు 1993 లో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం, బి. గోపాల్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
మెకానిక్ అల్లుడు
(1993 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం బి.గోపాల్
నిర్మాణం అల్లు అరవింద్
కథ సత్యానంద్
చిత్రానువాదం బి. గోపాల్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
చిరంజీవి,
విజయశాంతి
సంగీతం రాజ్-కోటి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు వెళ్ళైస్వామి
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
భాష తెలుగు
మూసివేయి

కథ

జగన్నాథం (అక్కినేని నాగేశ్వరరావు) ఒక కోటీశ్వరుడు. తన సోదరి పార్వతి (శుభ) ని తన స్నేహితుడు నారాయణ (సత్యనారాయణ) కిచ్చి పెళ్ళి చేస్తాడు.నారాయణ దుష్టుడు. అతను తన సహచరుడు కోటప్ప (కోట శ్రీనివాసరావు) తో కలిసి, జగన్నాథాన్ని హత్య కేసులో ఇరికిస్తాడు. తన సోదరుడిపై అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వమని భార్య పార్వతిపై వత్తిడి చేస్తాడు. దాంతో జగన్నాధానికి శిక్ష పడుతుంది. ఆ తరువాత, వారు గర్భవతి అయిన పార్వతిని కూడా చంపబోతారు. మహాలక్ష్మి (శారద) ఆమెను రక్షిస్తుంది. తరువాత, ఆమె రవి అనే అబ్బాయికి జన్మనిచ్చిన తరువాత నగరం వదిలి వెళ్లిపోతుంది.

సంవత్సరాలు గడిచిపోతాయి. రవి (చిరంజీవి) ఒక చలాకీ యువకుడు. ఉద్యోగం చేసిన ప్రతిచోటా ఏదో ఒక గొడవపడి ఉద్యోగాలు కోల్పోతూంటాడు. సమాంతరంగా, అతను తన ప్రాంతంలో ఒక హోటల్ నడుపుతున్న జగన్నాథం కుమార్తె, ఆడ రౌడీ లాంటి చిట్టి (విజయశాంతి) తో గొడవ పడతాడు. ఆమె కూడా అతడి లాంటిదే. ప్రస్తుతం, జగన్నాథం మెకానిక్‌గా జీవిస్తున్నాడు, ఒకసారి రవి అతన్ని ఒక నర్తకి నుండి రక్షించి అతని షెడ్‌లోనే ఉద్యోగంలో చేరతాడు. కొన్ని ఫన్నీ సంఘటనల తరువాత రవి చిట్టి ప్రేమలో పడతారు. జగన్నాథం కూడా వారి పెళ్ళికి అనుమతిస్తాడు. వారి నిశ్చితార్థం సమయంలో, జగన్నాథం రవిని తన మేనల్లుడిగా తెలుసుకొని కోపంతో ఆ సంబంధాన్ని తిరస్కరిస్తాడు. కానీ తరువాత, నిజం తెలిసాక, జగన్నాథం, రవి కలిసి నారాయణపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వారు అతని ఇంట్లోకి ప్రవేశించి తమ సంబంధాలతో అతనిని గందరగోళానికి గురిచేస్తారు. ప్రస్తుతం, నారాయణ మహాలక్ష్మిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. నిజం తెలుసుకున్న తర్వాత ఆమె కూడా వారితో కలిసిపోతుంది. ఒక కామిక్ కథ తరువాత, వారు నారాయణకు ఒక పాఠం నేర్పుతారు. అందరూ ఏకమవుతారు. చివరగా, రవి, చిట్టి పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

తారాగణం

సాంకేతిక సిబ్బంది

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ప్రేమిస్తే ప్రాణమిస్తా"భువనచంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం4:19
2."చెక్కా చెక్కా చెమ్మ చెక్కా"భువన చంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:44
3."గురువా గురువా"భువన చంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ6:25
4."గుంతలక్కడి గుండమ్మా"భువన చంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:20
5."అంబ పలికింది"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర6:28
6."జుమ్మనే తుమ్మెద వేట"భువన చంద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:52
మొత్తం నిడివి:33:08
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.