From Wikipedia, the free encyclopedia
మృత సముద్రం (హీబ్రూ: יָם הַמֶּלַח, Yām Ha-Melaḥ, "ఉప్పు సముద్రం";అరబ్బీ: البَحْر المَيّت, al-Baḥr l-Mayyit, "మృత సముద్రం") పశ్చిమాన ఇజ్రాయేల్, వెస్ట్ బ్యాంక్, తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 420 మీటర్ల దిగువన ఉన్నది[2], దీని అంచులు భూతలంపై ఉన్న పొడిభూమిలన్నింటికంటే దిగువన ఉన్న ప్రాంతం. మృత సముద్రం 380 మీటర్ల లోతున, ప్రపంచంలో అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సు. అంతేకాక 33.7% శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే జలాశయాలలో ఒకటి. అస్సల్ సరస్సు (జిబూబీ), గరబొగజ్కోల్, అంటార్కిటికాలోని మెక్ముర్డో పొడి లోయలలోని లవణీయత ఎక్కువైన డాన్ హువాన్ కుంట వంటి కొన్ని సరస్సులు మాత్రమే మృతసముద్రాని కంటే ఉప్పగా ఉన్నాయి. అత్యంత లవణీయత కలిగిన సరస్సు, వాండా సరస్సు సముద్రం కంటే 8.6 రెట్లు అధిక లవణీయత కలిగి ఉంది.[3] మృత సముద్రం, మధ్యధరా సముద్రం కంటే పది రెట్లు ఉప్పగా ఉన్నదని నిపుణుల అంచనా (34% శాతంతో మధ్యధరా సముద్రం యొక్క 3.5% శాతంతో పోల్చినపుడు). ఈ లవణీయత వలన మృతసముద్రం జంతుజాలం యొక్క మనుగడకు అత్యంత కఠోరమైన ఆవరణంగా ఉంది. మృత సముద్రం 67 కిలోమీటర్ల పొడవు, అత్యంత వెడల్పైన ప్రదేశంలో 18 కిలోమీటర్ల వెడల్పు మేరకు విస్తరించి ఉంది. ఇది జోర్డాన్ రిఫ్ట్ లోయలో ఏర్పడినది. దీని ప్రధాన నీటివనరు జోర్డాన్ నది.
మృత సముద్రం | |
---|---|
అక్షాంశ,రేఖాంశాలు | 31°20′N 35°30′E |
రకం | endorheic hypersaline |
సరస్సులోకి ప్రవాహం | జోర్డాన్ నది |
వెలుపలికి ప్రవాహం | లేదు |
పరీవాహక విస్తీర్ణం | 40,650 కి.మీ2 (15,700 చ. మై.) |
ప్రవహించే దేశాలు | జోర్డాన్ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ |
గరిష్ట పొడవు | 67 కి.మీ. (42 మై.) |
గరిష్ట వెడల్పు | 18 కి.మీ (11 మై) |
ఉపరితల వైశాల్యం | 810 కి.మీ2 (310 చ. మై.) ఉత్తర బేసిన్ |
సరాసరి లోతు | 120 మీ (394 అడుగులు)[1] |
గరిష్ట లోతు | 380 మీ (1,247 అడుగులు) |
147 కి.మీ3 (35 cu mi) | |
తీరంపొడవు1 | 135 కి.మీ (84 మై) |
ఉపరితల ఎత్తు | −420 m (−1,378 ft)[2] |
మూలాలు | [1][2] |
1 Shore length is not a well-defined measure. |
వేలాది సంవత్సరాలుగా మృతసముద్రం మధ్యధరా సముద్రపు తీరప్రాంతాలనుండి అనేకమంది యాత్రికులను ఆకర్షించింది. బైబిల్లో దావీదు రాజు ఇక్కడే తలదాచుకున్నాడు. హేరోదు పాలనాకాలంలో ప్రపంచములోనే మొట్టమొదటి హెల్త్ రెసార్ట్్గా మృతసముద్రం పేరుతెచ్చుకున్నది. ఈజిప్టు ప్రజలు మమ్మీలను భద్రపరచడానికి ఉపయోగించిన లేపనాల నుండి ఎరువులలో వాడే పొటాష్ వరకు అనేక రకాల ఉత్పత్తులను మృత సముద్రం సరఫరా చేసింది. మృత సముద్రం నుండి లభ్యమయ్యే లవణాలు, ఖనిజాలు సౌందర్యసాధనాలు తయారుచేయటానికి ప్రజలు ఉపయోగించేవారు.
అరబ్బీ భాషలో మృతసముద్రాన్ని అల్-బహ్ర్ అల్-మయ్యిత్ [4] (help·info) ("మృత సముద్రం") అని పిలుస్తారు. దీన్ని బహ్ర్ లూత్ (بحر لوط, "లోత్ సముద్రం"). అని కూడా పిలుస్తారు. చారిత్రకంగా అరబ్బీ భాషలో సమీప పట్టణం పేరు మీద జోర్ సముద్రం అన్న పేరు కూడా ఉంది. హీబ్రూలో మృతసముద్రాన్ని యామ్ హ-మేలా (help·info), ("ఉప్పు సముద్రం," లేదా యామ్ హ-మావెత్ (ים המוות, "మృత్యువు సముద్రం") అని పిలుస్తారు. పూర్వము దీన్ని కొన్నిసార్లు యామ్ హ-మిజ్రాహీ (ים המזרחי, "తూర్పు సముద్రం") లేదా యామ్ హ-అరావా (ים הערבה, "అరబా సముద్రం") అని కూడా వ్యవహరించేవారు.. గ్రీకులు దీన్ని ఆస్ఫాల్టైట్స్ సరస్సు అని వ్యవహరించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.