హిబ్రూ /ˈhiːbruː/ (עִבְרִית ఆఫ్రోఆసియాటిక్ భాషా కుటుంబానికి చెందిన పశ్చిమ సెమెటిక్ భాష. చారిత్రికంగా దీన్ని ఇజ్రాయెల్/హిబ్రూల భాషగా పరిగణిస్తారు.[1][2] ప్రాచీన కాలంలో దీన్ని హిబ్రూ భాషగా కాక వేరే పేరు (ఇబ్రానీ) తో పరిగణించేవారు. తర్వాత హెలెనిస్టిక్ రచయితలైన జోసెఫస్, గాస్పెల్ ఆఫ్ జాన్లు హెబ్రైస్తీగా అర్మైక్, హిబ్రూ భాషలని కలిపి వ్యవహరించేవారు. హిబ్రూ అక్షరం పాలియొ యొక్క అత్యంత ప్రాచీన ఉల్లేఖనాలు క్రీ.పూ.10వ శతాబ్దం నుంచే ప్రాథమిక చిత్రాలుగా దొరుకుతున్నాయి.
సా.శ200 నాటికే హిబ్రూ నిత్యవ్యవహారంలోంచి తొలగిపోయింది. మధ్యయుగాల్లో ఈ భాషను యూదుల మతపరమైన కార్యక్రమాల్లోనూ, యూదు మతస్తుల మత సాహిత్యంలో మనుగడ సాగించింది. ఈ నేపథ్యంలో తిరిగి 19వ శతాబ్దిలో, హిబ్రూభాష పునరుజ్జీవనం పొంది తిరిగి వ్యావహారిక భాషగా, సాహిత్య భాషగా తన ఉనికిని చాటుకుంటోంది. భాషాపరమైన సమాచారాన్ని ప్రచురించే అంతర్జాల సంస్థ ఎత్నెలాగ్ ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హిబ్రూ భాషను 90 లక్షలమంది ప్రజలు మాట్లాడుతున్నారు.[3][4] హిబ్రూ భాషా వ్యవహర్తల్లో 70లక్షలమంది ఇజ్రాయెల్ దేశస్థులు.[5][6] 2,21,593 మంది భాషా వ్యవహర్తలతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు హిబ్రూ భాషీయుల సంఖ్యలో రెండవ స్థానాన్ని పొందింది. ఐతే వీరిలో చాలామంది ఇజ్రాయెల్ దేశం నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డవారే కావడం గమనార్హం.[7]
ఇజ్రాయెల్ దేశానికి రెండు అధికార భాషల్లో ఆధునిక హిబ్రూ ఒకటి (మరొకటి అరబిక్ భాష), కాగా ప్రాచీన హిబ్రూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు మతస్తుల ప్రార్థనలు, మత అధ్యయనాల్లో భాగంగా ఉంది. సమరిటన్స్‌కు ప్రాచీన హిబ్రూ మతపరమైన భాష కాగా, ఆధునిక హిబ్రూ లేదా అరబిక్ వ్యావహారిక భాష. యూదుమతస్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యూదుమతం, ఇజ్రాయెల్ దేశం వంటివి అధ్యయనం చేసే విద్యార్థులు, ముఖ్యంగా మధ్యప్రాచ్యాన్ని, అక్కడి నాగరికతను ప్రత్యేకంగా అధ్యయనం చేసే పురావస్తు శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు, మధ్యప్రాచ్యంలోని నాగరికతను ప్రత్యేకంగా అధ్యయనం చేసే పురావస్తు శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు, తత్త్వశాస్త్ర విద్యార్థులు, క్రిస్టియానిటీ మూలాలపై అధ్యయనం చేసేవారు హిబ్రూ భాషను విదేశీ భాషగా అధ్యయనం చేస్తూంటారు.
తోరాహ్ (ఐదు హిబ్రూ బైబిల్ గ్రంథాల్లో మొదటిది) పూర్తిగా, మిగిలిన హిబ్రూబైబిల్‌లో చాలాభాగం ప్రాచీన హిబ్రూలో రాశారు. హిబ్రూ నేటి రూపం ప్రధానంగా క్రీ.పూ. 6వ శతాబ్దంలో విలసిల్లినదని పరిశీలకులు బిబ్లికల్ (బైబిల్‌కు చెందిన) హిబ్రూ భాషా మాండలికం. హిబ్రూభాషను యూదుల పవిత్ర భాషగా ప్రాచీన కాలం నుంచీ పేర్కొన్నారు. అరేబియా ప్రదేశానికి చెందిన ఈ భాషకు అరబ్బులు "ఇబ్రానీ" భాషగా వ్యవహరిస్తారు.
వ్యుత్పత్తి
హిబ్రూ అనే ఆధునిక పదం ఇబ్రీ (బహువచనం ఇబ్రిమ్) నుంచి వచ్చింది. ఈ పదం యూదు ప్రజలను సూచించేందుకు ఉపయోగించే పదాల్లో ఒకటి. అబ్రహాం పూర్వీకునిగా భావించే ఎబెర్ పేరును ఆధారం చేసుకుని ఏర్పడ్డ విశేషణంగా సంప్రదాయ భావన. ఎబెర్ ప్రస్తావనలు జెనెసెస్ గ్రంథంలో 10:21 వద్ద వస్తాయి. ఈ పేరు "ʕ-b-r" (עבר) అనే ధాతువుపై ఆధారపడింది. దానికి దాటి వెళ్ళడమని అర్థం. ఇబ్రిం అనే పదాన్ని యూఫ్రోటిస్ అనే నదిని దాటి వెళ్ళిన ప్రజలు అనే భావాన్ని ఈ క్రియాధాతువు నుంచి స్వీకరిస్తారు.[8] బైబిల్ గ్రంథంలో, హిబ్రూ భాషను యెహుదిత్ (అరబిక్ లో యహూదీ) గా ప్రస్తావించారు. యూదుల రాజ్యమే ఆ ప్రస్తావనల నాటికి నిలిచివున్న రాజ్యం (క్రీ.పూ.8వ శతాబ్ది).
ఇవీ చూడండి
- తోరాహ్
- అరబ్బీ భాష
- Zuckermann, Ghil'ad 2020 Revivalistics: From the Genesis of Israeli to Language Reclamation in Australia and Beyond, Oxford University Press ISBN 9780199812790 / ISBN 9780199812776
- Zuckermann, Ghil'ad 2003 Language Contact and Lexical Enrichment in Israeli Hebrew, Palgrave Macmillan ISBN 9781403917232 / ISBN 9781403938695
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.