ముస్తాక్ హుస్సేన్ ఖాన్
From Wikipedia, the free encyclopedia
ఉస్తాద్ ముస్తాక్ హుస్సేన్ ఖాన్ (1878-1964 ఆగస్టు 13) భారతీయ శాస్త్రీయ గాయకుడు. ఆయన రాంపూర్-సహస్వాన్ వంశానికి చెందినవారు.
ముస్తాక్ హుస్సేన్ ఖాన్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | షేర్-ఇ-మౌసికి |
జననం | 1878 సహస్వాన్, నార్త్-వెస్ట్రన్ ప్రావిన్సులు, బ్రిటిష్ ఇండియా |
మూలం | సహస్వాన్, బుదౌన్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
మరణం | 13 ఆగస్టు 1964 85–86) ఢిల్లీ, భారతదేశం | (aged
సంగీత శైలి | హిందూస్తానీ సంగీతం |
వృత్తి | గాయకుడు |
క్రియాశీల కాలం | 1896 — 1964 |
లేబుళ్ళు | సరిగమ |
ప్రారంభ జీవితం
ముష్తాక్ హుస్సేన్ ఉత్తర ప్రదేశ్ బదౌన్ జిల్లాలోని సహస్వాన్ అనే చిన్న పట్టణంలో సాంప్రదాయ సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు. ఇక్కడే అతను పెరిగి, తన బాల్యాన్ని గడిపాడు. [1]
జీవితం ప్రారంభంలోనే సంగీతం ఆయనకు వచ్చినప్పటికీ, అతని తండ్రి ఉస్తాద్ కల్లన్ ఖాన్ అతనికి క్రమం తప్పకుండా పాఠాలు నేర్పడం ప్రారంభించాడు. ఈ కళలోకి పరిచయం చేయడం ప్రారంభించినప్పుడు అతనికి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే.[1]
ముష్తాక్ హుస్సేన్ ఖాన్ పన్నెండు సంవత్సరాల వయసులో ఉస్తాద్ హైదర్ ఖాన్ శిష్యుడు అయ్యాడు. అతనితో నేపాల్ ఖాట్మండుకు వెళ్ళాడు.[1] ఆ తరువాత అతను హైదర్ ఖాన్ నుండి కనీస సంగీత శిక్షణ పొందడం ప్రారంభించాడు. చివరగా రెండు సంవత్సరాల తరువాత, ముష్తాక్ హుస్సేన్ రాంపూర్-సహస్వాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలోకి వచ్చాడు.[2] సమిష్టిగా అతను తన జీవితంలో పద్దెనిమిది సంవత్సరాలు తన శిక్షకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ తో గడిపాడు.[1]
సంగీత వృత్తి
ముప్పై ఐదు సంవత్సరాల వయస్సులో ముష్తాక్ హుస్సేన్ రాంపూర్ ఆస్థాన సంగీతకారులలో ఒకరిగా నమోదు చేయబడ్డాడు. తరువాత అతను రాంపూర్ ప్రధాన ఆస్థాన సంగీతకారుడు అయ్యాడు. 1920లలో భారతదేశంలో సంగీత సమావేశాల ప్రచారం ప్రారంభమైనప్పుడు, వాటిలో పాల్గొనడానికి ముస్తాక్ హుస్సేన్ ఆహ్వానించబడ్డాడు. అదనంగా, ఆయన ఆల్ ఇండియా రేడియో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు.[1]
శిష్యులు
తన సుదీర్ఘ వృత్తి జీవితంలో ముష్తాక్ హుస్సేన్ ఖాన్ భారతరత్న పండిట్ భీమ్సేన్ జోషి, పద్మభూషణ్ శ్రీమతి షన్నో ఖురానా, ఆయన అల్లుడు పద్మశ్రీ ఉస్తాద్ గులాం సాదిక్ ఖాన్, పద్మశ్రీ శ్రీమతి. నైనా దేవి, శ్రీమతి. సులోచన బ్రహ్మపతి, పద్మశ్రీ శ్రీమతి సుమతి ముతత్కర్, ఉస్తాద్ అఫ్జల్ హుస్సేన్ ఖాన్ నిజామి, అలాగే అతని సొంత కుమారులు శిష్యులు.[1]
అవార్డులు, విజయాలు

- కళలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, 1952లో రాష్ట్రపతి అవార్డు అందుకున్న మొదటి గాయకుడు ఆయనే.[1]
- 1952లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి కూడా ఆయనే.[3]
- 1956లో రాంపూర్ నుండి పదవీ విరమణ చేసిన ఆయన, మరుసటి సంవత్సరం న్యూఢిల్లీలోని శ్రీరామ్ భారతీయ కళా కేంద్రం చేరారు, 1957లో పద్మభూషణ్ అందుకున్న మొదటి భారతీయ శాస్త్రీయ గాయకుడు అయ్యారు.[1]
డిస్కోగ్రఫీ
- "గ్రేట్ మాస్టర్, గ్రేట్ మ్యూజిక్" (ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్)
- "ఖ్యాల్ గుంకారి" (ఆల్ ఇండియా రేడియో)
- "ఖ్యాల్ & తరానా-బిహాగ్" (ఆల్ ఇండియా రేడియో)
- "రాంపూర్ సహస్వాన్ ఘరానా"[2]
- "క్లాసిక్ గోల్డ్-అరుదైన రత్నాలు"[4]
- "క్లాసిక్ గోల్డ్"
మరణం
ముష్తాక్ హుస్సేన్ చివరి కచేరీ నైనా దేవి నివాసంలో జరిగింది. అక్కడ అతనికి గుండెపోటు వచ్చింది. పాత ఢిల్లీ ఇర్విన్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన 1964 ఆగస్టు 13న మరణించాడు.[5]
మూలాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.