ముత్తయ్య భాగవతార్‌గా పిలువబడే హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు. ఇతడు 20 రాగాలను కూడా సృష్టించాడు.

త్వరిత వాస్తవాలు ముత్తయ్య భాగవతార్, జననం ...
ముత్తయ్య భాగవతార్
Thumb
జననం
హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్

(1877-11-15)1877 నవంబరు 15
హరికేశనల్లూరు, తిరునల్వేలి, తమిళనాడు, భారతదేశం
మరణం1945 జూన్ 30(1945-06-30) (వయసు 67)
జాతీయతభారతీయుడు
వృత్తికర్ణాటక సంగీత స్వరకర్త
మూసివేయి

ప్రారంభ జీవితం

ముత్తయ్య 1877, నవంబరు 15న తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన హరికేశనల్లూరు అనే కుగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కళాపోషకుడు కావడంతో ఇతనికి చిన్ననాటనే సంగీతంలో పరిచయం ఏర్పడింది. ఇతనికి ఆరు ఏళ్ళవయసులో ఇతని తండ్రి మరణించాడు. దానితో ఇతని మేనమామ ఎం.లక్ష్మణసూరి ఇతడిని పోషించాడు. ఇతడు సంస్కృతము, వేదము అభ్యసించాడు. కాని ఇతనికి సంగీతం పట్ల అభిమానం పెరిగి సరైన గురువును అన్వేషిస్తూ తన స్వగ్రామాన్ని వదిలి దేశాలు తిరిగాడు. చివరకు తిరువారూరులో పదినైదుమండప సాంబశివ అయ్యర్ అనే గురువు ఇతడి ప్రతిభను గుర్తించి ఇతడికి సంగీతాన్ని నేర్పించాడు. సాంబశివ అయ్యర్ సంగీత కళానిధి టి.ఎస్.సబేశ అయ్యర్ తండ్రి. ముత్తయ్య సాంబశివ అయ్యర్ వద్ద 9 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో అభ్యసించి హరికథా విద్వాంసుడైనాడు.

స్వరకల్పన

ఇతడు 400లకు పైగా కీర్తనలకు రాగాలను సమకూర్చాడు. వీటిలో అనేక "వర్ణాలు", "కృతులు", "తిల్లానాలు" ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ సర్వ దేవతలకు సంబంధించింది కావడం విశేషం. ఇతడు తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ భాషలలో సంగీతాన్ని సమకూర్చాడు.

ఇతడు స్వరపరచిన కీర్తనల వలన నేటికీ విజయ సరస్వతి, కర్ణరంజని, బుధమనోహరి, నిరోష్ట, షణ్ముఖప్రియ, మోహనకళ్యాణి వంటి రాగాలు వాటి ఉనికిని కోల్పోకుండా ఉన్నాయి.

1934లో ఇతడు తమిళనాడు టాకీస్‌ నిర్మించిన లవకుశ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఇతడు 63 పాటలను సమకూర్చాడు. దానితో ఈ సినిమా పేరును "సంగీత లవకుశ"గా మార్చారు.

సంగీత కళ

ఇతడు గోటువాద్యంలోను, మృదంగంలోను అపారమైన నైపుణ్యాన్ని కలిగివున్నాడు. ఇతడు "సంగీత కల్పద్రుమం" అనే ఉద్గ్రంథాన్ని రచించాడు. సంగీతశాస్త్రానికి సంబంధించి అనేక ప్రసంగాలు చేశాడు. 1943లో కేరళ విశ్వవిద్యాలయం ఇతనికి డి.లిట్., పట్టా ప్రదానం చేయడంతో భారతదేశంలో సంగీతంలో మొట్టమొదటి డాక్టరేట్ పట్టాను పొందిన వ్యక్తిగా పేరుగడించాడు. 1939లో త్రివేండ్రంలో స్థాపించిన స్వాతి తిరునాళ్ సంగీత అకాడమీకి ఇతడు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాడు. ఇతడు సంస్కృతంలో "త్యాగరాజ విజయం" అనే కావ్యాన్ని రచించాడు. తిరువనంతపురం దేవాలయంలో పూజాసమయంలో నాదస్వరాన్ని వినిపించే సాంప్రదాయాన్ని ఇతడే ప్రవేశపెట్టాడు.

ఇతని కీర్తనలను ప్రచారంలో తీసుకురావడనికి ఇతని వంశస్థులు హరికేశాంజలి ట్రస్టును నడుపుతున్నారు.

అవార్డులు, గుర్తింపులు

ఇతడు మైసూరు మహారాజా "కృష్ణరాజ ఒడయార్ IV" వద్ద ఆస్థాన విద్వాంసునిగా నియమించబడ్డాడు. ఇతడు మైసూరులో ఉన్నప్పుడు చాముండీ దేవిని కీర్తిస్తూ 115 కృతులను కన్నడ భాషలో రచించాడు. తరువాత ఇతడు తిరువాంకూరు సంస్థానానికి ఆహ్వానించబడ్డాడు. అక్కడ స్వాతి తిరునాళ్ కృతులను అధ్యయనం చేసి "సంగీత కల్పద్రుమం" అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం ఇతనికి కేరళ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించి పెట్టింది[1]. ఇతడు "మద్రాసు సంగీత అకాడమీ" ప్రథమ వార్షిక సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 1930లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది.

కీర్తనలు

ముత్తయ్య భాగవతార్ తెలుగులో స్వరపరచిన కీర్తనల వివరాలు[2]:

మరింత సమాచారం పల్లవి, రకం ...
పల్లవిరకంరాగంతాళం
అంబా వాణి నన్నాదరించవే కృతికీరవాణిఆది
ఇకనే తాళజాలనురా నన్నింతటి శోధన సేయకురా గుహా కృతిగుహరంజనిఆది
ఇది మంచి సమయమురా నన్నేలుకోరా కృతిఆనందభైరవిఆది
ఇది వేళ నన్నేల ఈశసుతా నీకుకృతికోకిలభాషణిసంకీర్ణజాతి రూపక
ఎన్నాళ్ళూ తిరుగుదును ఈ జన్మమెత్తినే కృతిమందారిఖండచాపు
కలిలో హరి చరణమొకటియే గాక ఇతర మార్గం మరి లేదయ్యాకృతికాపిఆది
చలమేల చేసేవు నా సామి చాల నమ్మియున్నానురా కృతినారాయణ గౌళ ఆది
జగద్గురో దయానిధే శ్రీ శంకర శివాకృతే కృతిఅఠాణా రూపక
జనని ఆశ్రిత పాలిని జగజ్జీవ రత్నాంగి కృతిరత్నాంగి రూపక
తారక నామ దశరథ రామా కృతిమాయామాళవగౌళఆది
తెలియక నేజేసిన దుడుకెల్ల మాంచరాకృతిహుసేనీరూపక
తోడు నీడ నీవే సుందర షణ్ముఖాకృతిపున్నాగవరాళిఆది
త్యాగరాజ సద్గురువని దలచవే ఓ మనసా కృతిహిందోళరూపక
దర్శనమే జన్మ సాఫల్యముకృతిరక్తిమార్గినిఆది
దేవకి తనయుని బాగ సేవింపరారే కృతిశంకరాభరణంఆది
ధీర శిఖామణి దశరథ కులమణి కృతిరీతిగౌళఆది
నా పుణ్యము గాదా ఈశా కృతికీరవాణిఆది
నిన్ను నమ్మినాను జనని బ్రుహన్నాయకికృతిఅభోగిమిశ్ర ఏక
నిన్ను నెరనమ్మినానురా రామాకృతిదేవమనోహరిఆది
నీ భజన గానామృతము నిత్యానందమురాకృతికాంభోజిఆది
నీ పాదములను నమ్మితిని నిఖిల లోక జనని శ్రీ కాంతిమతికృతినటభైరవిఆది
నీ పాదమే గతియనుచు నిన్నే శరణంటి నిఖిలలోక నాయకకృతిభైరవిఆది
నీదు మహిమ పొగడ నా తరమా రామా నిత్య సుఖదాకృతిహంసానందిఆది
నీలాయతాక్షి నీవే జగత్ సాక్షికృతివిజయశ్రీఆది
నీవే ఇటు పరాకు చేసితే నేనెందు పోదురా గుహాకృతిఖరహరప్రియఆది
నేను చేసిన పూజా ఫలముకృతిదేవమనోహరిఆది
పంకజ లోచనిరా భామా పరమ సుగుణి మణిరా ఈ పడతికృతిఆనందభైరవిఆది
పశుపతి పాదసేవనమే పరమానందము ఓ మనసాకృతికళ్యాణిఆది
పశుపతి ప్రియసతి పావని నీవే గతికృతిపశుపతి ప్రియరూపక
బంధము సేయరాదు పామరుడైన నాపైకృతినాగేశ్వరావళిఆది
బలుమోస మయ్యనురా బాగాయరా సామికృతిసహనఖండచాపు
మంచి పణదిరా నిన్ను జూచి మరులు కొన్నదిరా మారుబారి తాళదురా చక్కని సామిగావురాకృతిహిందోళఆట
మనమోహనా మానిని నీపై చాల మరులుకొని గాసి యున్నదిరావర్ణంమోహనఆట
మనసు కరగి అమృతధార వర్షము వర్షింపు గుహా నీకృతిమేఘరంజనిరూపక
మానము కావలెను తల్లి మహిషాసురమర్ధిని అభికృతిసహనరూపక
మీనలోచని అంబా వేగ నన్ను బ్రోవవే అంబాకృతితోడిరూపక
రాజరాజేశ్వరి రాజ పరమేశ్వరి రక్షించవే రాఘవ సోదరికృతిగరుడధ్వని ఆది
లంబోదర సోదరా నవమణి హారాకృతికళ్యాణి సంకీర్ణ చాపు
వాగీశ్వరి వాణి సరస్వతి వరదాయకి వనజప వసతికృతిసరస్వతి ఆది
శక్తి వినాయక సజ్జన తారక సద్గుణ నాయకా బ్రోవుముకృతిశ్రీరంజనిఆది
శరవణభవానంద స్వామి షణ్ముఖా నీదు చరణముల చూపరాదా కృతికామవర్ధనిఆది, ఖండగతి
శరవణభవా సమయమిదిరా సరగున నన్ను బ్రోవరా కృతిపశుపతిప్రియఆది
శోదన సేయకవే అంబా సుముఖీ నీదు బాలుడైన నన్నుకృతిబిలహరిఆది
శ్రీ మహా గణపతే నిన్నుకోరి సేవించితికృతికాంభోజిఆట
శ్రీ మహాబల శైల వాసిని చాముండేశ్వరి కాపాడుముకృతిశుద్ధ సావేరి రూపక
శ్రీ మహిషాసుర మర్ధిని శ్రితజన పరిపాలినికృతిహంసగామినిరూపక
శ్రీ రఘువర చిన్మయ రామా క్షేమకరా నన్ను బ్రోవుమాకృతినాయకి ఆది
శ్రీ రాజమాతంగి చాముండేశ్వరి నారాయణి రక్షించు గౌరి వర్ణంశుద్ధ ధన్యాశిఆది
శ్రీ శరవణ బహునివినా దైవముగలదా కలిలోకృతిసుమన ప్రియ రూపక
శ్రీ సాంబశివ సద్గురు దివ్య చరణ దాసోహంకృతిగురుప్రియఖండచాపు
సన్నుతాంగి శ్రీ చాముండేశ్వరి శతోదరి సాధు జనావనే సారస నయనేవర్ణంవసంతఆది
సమయమిదే నన్ను బ్రోచుటకు సనకాదినుత షణ్ముఖదేవకృతిబుధమనోహరిఆది
సరసిజాక్షా నిన్ను కోరినదిరా సరసగాన నిపుణ శృంగార రసానుభవ సుగుణరాకృతికళ్యాణిఆట
సారసాక్షి నీ పద పంకజమున సేవించిన నన్ను బ్రోవ సమయము పరమ మంగళదాయిని కృతికేదారగౌళఆది
మూసివేయి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.