ముంతాజ్

From Wikipedia, the free encyclopedia

ముంతాజ్

ముంతాజ్ అసలు పేరు నగ్మా ఖాన్. ఆమె భారతీయ మోడల్, తమిళ నటి. ఆమె తమిళ చిత్రాలతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాలలో కూడా నటించారు.[1]

త్వరిత వాస్తవాలు ముంతాజ్, జననం ...
ముంతాజ్
Thumb
జననం
నగ్మా ఖాన్

1980 జూలై 5
ఇతర పేర్లుమోనిషా
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
మూసివేయి

బాల్యం

ముంతాజ్ తన పాఠశాల విద్యను ముంబైలోని బాంద్రాలో మౌంట్‌ మేరీస్ కాన్వెంట్ స్కూల్ నుంచి పూర్తిచేసింది. చిన్నప్పటినుంచే సినిమాలపై మమకారం పెంచుకుంది. శ్రీదేవికి అభిమానిగా మారిపోయింది. స్కూల్ బస్సు ఫిల్మిస్తాన్ స్టూడియోస్‌ను చేరుకోగానే సినిమానటులను చూసేందుకు చాలా ఇష్టపడేది.[2][3]

కెరీర్

1999లో టి. రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం మోనిషా ఎన్ మోనాలిసాతో చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరవాత తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషీ (2001), చాలా బాగుంది (2000) లూటీ (2001), చాక్లెట్ (2001), జెమిని (2002), ధీరుడు (2006),ఆగ‌డు (2014) వంటి చిత్రాలలో ఆకర్షణీయమైన పాత్రలలో కనిపించి ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2013లో అత్తారింటికి దారేదిలో ఓ పాటలో ఆలరించారు ఆమె కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రెండవ సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌గా పాల్గొని తమిళనాడులో మరింత పాపులర్ అయ్యారు.[4][5]

వివాదం

ముంతాజ్ చెన్నైలోని అన్నానగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు మైనర్ బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారని, ఇక పని చేయడం ఇష్టం లేక వారు ఉత్తరప్రదేశ్‌లోని తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నా బయటకు వెళ్లకుండా నిర్భందించారని ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.[6] ఇద్దరు బాలికలైన అక్కాచెల్లెళ్లను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.