From Wikipedia, the free encyclopedia
మిజోరం క్రికెట్ జట్టు భారత దేశీయ పోటీలలో మిజోరాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. 2018 జూలైలో , భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో సహా 2018–19 సీజన్ కోసం దేశీయ టోర్నమెంట్లలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో ఒకటిగా ఈ జట్టును ప్రకటించింది. [1] [2] [3] అయితే, రంజీ ట్రోఫీలో జట్టును చేర్చే నిర్ణయాన్ని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నిస్తూ, పోటీలో జట్టు పాల్గొనడానికి అర్హత ప్రమాణాలు ఉండాలని పేర్కొంది. [4]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | తరువార్ కొహ్లి |
కోచ్ | మొహమ్మద్ సైఫ్ |
యజమాని | క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం |
జట్టు సమాచారం | |
స్థాపితం | 2018 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
2018 సెప్టెంబరులో వారు 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయారు. [5] [6] విజయ్ హజారే ట్రోఫీలో వారి మొదటి సీజన్లో, వారు తమ ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఆరు ఓటములతో ప్లేట్ గ్రూప్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. [7] తరువార్ కోహ్లి 373 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిది వికెట్లతో జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [8]
2018 నవంబరులో 2018-19 రంజీ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్‌లో, వారు నాగాలాండ్‌తో ఇన్నింగ్స్ 333 పరుగుల తేడాతో ఓడిపోయారు. [9] [10] రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జట్టుకు ఇది అతిపెద్ద ఓటమి. [11] 2018–19 టోర్నమెంటులో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఒక్క గెలుపూ లేకుండా, పట్టికలో చివరి, తొమ్మిదవ స్థానంలో ముగించారు. [12]
2019 మార్చిలో, మిజోరం 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ D లో ఏడు మ్యాచ్‌లలో ఒక్కదానిలో కూడా గెలుపొందకుండా చివరి స్థానంలో నిలిచింది. [13] తరువార్ కోహ్లి 222 పరుగులతో టోర్నమెంట్లో జట్టు తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సినాన్ ఖదీర్ ఏడు ఔట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[14]
పేరు | పుట్టినరోజు | బ్యాఅటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
తరువార్ కోహ్లీ | 1988 డిసెంబరు 17 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Captain |
జోసెఫ్ లాల్‌థాన్‌ఖుమా | 2000 సెప్టెంబరు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
వికాష్ కుమార్ | 1996 డిసెంబరు 1 | కుడిచేతి వాటం | ||
జోతంజువాలా | 1999 డిసెంబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
లాల్హ్రుఐజెలా | 1996 డిసెంబరు 30 | కుడిచేతి వాటం | ||
జెహు ఆండర్సన్ | 1999 నవంబరు 12 | కుడిచేతి వాటం | ||
వనలల్హ్రుఅలుంగ | 1999 మార్చి 14 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ఎఫ్ లాల్మౌంజువాలా | 1998 ఆగస్టు 20 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
లాల్హ్మంగైహ | 1983 నవంబరు 17 | ఎడమచేతి వాటం | ||
ఆల్ రౌండర్లు | ||||
పర్వేజ్ అహ్మద్ | 1996 జనవరి 1 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
సుమీత్ లామా | 1996 ఫిబ్రవరి 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
వికెట్ కీపర్లు | ||||
శ్రీవత్స గోస్వామి | 1989 మే 18 | ఎడమచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
అవినాష్ యాదవ్ | 1986 అక్టోబరు 2 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
బాబీ జోతన్సంగా | 1986 ఆగస్టు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
రిన్సాంగ్జెలా హ్మమ్టే | 2002 జూన్ 7 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
రోసియామ్లియానా రాల్టే | 1987 డిసెంబరు 21 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
పేస్ బౌలర్లు | ||||
రెమ్రుతడిక రాల్తే | 1998 ఆగస్టు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
నవీన్ గురుంగ్ | 2002 మార్చి 5 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం | |
జి లాల్బియాక్వేలా | 1988 జనవరి 28 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
లాల్హ్రూయ్ రాల్టే | 1992 మార్చి 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
లాలరించానా | 1996 డిసెంబరు 29 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
2023 జనవరి 17 నాటికి నవీకరించబడింది
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.