మార్క్ చాప్‌మన్
From Wikipedia, the free encyclopedia
మార్క్ సింక్లైర్ చాప్‌మన్ (జననం 1994 జూన్ 27) హాంకాంగ్‌లో జన్మించిన న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను హాంకాంగ్, న్యూజిలాండ్‌ల కోసం పరిమిత ఓవర్లలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తరపున ఆడుతున్న చాప్‌మన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. ఎడమచేతి ఆర్థోడాక్స్ బౌలింగ్ చేస్తాడు. అతను 2015 నవంబరు 16న 2015–17 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై హాంకాంగ్ తరపున తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు [1] తండ్రి ద్వారా న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి అర్హత పొందాడు. [2] 2018 ఫిబ్రవరిలో, అతను ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ తరపున T20I, వన్‌డే ల్లో ప్రవేశించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మార్క్ సింక్లెయిర్ చాప్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బ్రిటిష్ హాంకాంగ్ | 27 జూన్ 1994|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batting ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 32/194) | 2015 నవంబరు 16 Hong Kong - UAE తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మే 03 న్యూజీలాండ్ - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 4/77) | 2014 మార్చి 16 Hong Kong - నేపాల్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 1 న్యూజీలాండ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2016 | Hong Kong Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16–present | ఆక్లండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | St Lucia Stars | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 07 May 2023 |
ప్రారంభ, దేశీయ కెరీర్
చాప్‌మన్ హాంకాంగ్‌లో హాంకాంగ్ తల్లి, న్యూజిలాండ్ తండ్రికి జన్మించాడు. అతని తండ్రి పీటర్, హాంకాంగ్ ప్రభుత్వానికి క్రౌన్ ప్రాసిక్యూటరుగా, తల్లి అన్నే ఆర్థిక రంగంలోనూ పనిచేశారు. [3] అతను 14 సంవత్సరాల వయస్సులో కింగ్స్ కాలేజీ, ఆక్లాండ్‌లో చేరడానికి ముందు హాంగ్‌కాంగ్‌లోని ఐలాండ్ స్కూల్‌లో చదివాడు. ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివాడు. [4] 15 సంవత్సరాల వయస్సులో 2010 అండర్-19 ప్రపంచ కప్‌లో హాంకాంగ్ అండర్-19 జట్టు కోసం ఆడాడు.[5] [6]
చాప్‌మన్ 16 సంవత్సరాల వయస్సులో USA తో జరిగిన 2011 డివిజన్ త్రీ టోర్నమెంట్‌లో హాంకాంగ్ తరపున ప్రపంచ క్రికెట్ లీగ్‌లోకి రంగప్రవేశం చేసాడు [7] [8] 2011 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీ టోర్నమెంటు ఫైనల్‌లో పాపువా న్యూ గినియాను ఓడించి హాంకాంగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అతను హాంకాంగ్ తరఫున 70 పరుగులతో అజేయంగా అత్యధిక స్కోరు చేశాడు. [9] ఇది 2011 వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూకు ప్రమోషన్ పొందేందుకు హాంకాంగ్‌కు సహాయపడింది. [10] [11] తరువాతి టోర్నమెంట్‌లో ఉగాండాపై చాప్‌మన్ తన లిస్టు A లో అడుగుపెట్టాడు.[12] అతను పోటీలో మరో ఐదు లిస్టు A మ్యాచ్‌లు ఆడాడు, అందులో చివరిది పాపువా న్యూ గినియా . [13] పోటీలో మొత్తం ఆరు మ్యాచ్‌లలో, రెండు అర్ధ సెంచరీలతో, 38.40 బ్యాటింగ్ సగటుతో 192 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 81, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై. [14] [15] అతను 2013 ICC వరల్డ్ ట్వంటీ 20 క్వాలిఫైయర్ సందర్భంగా 2013 నవంబరు 15న ఇటలీపై T20 రంగప్రవేశం చేసాడు. [16]
చాప్‌మన్ 2015 డిసెంబరు 17న 2015–16 ప్లంకెట్ షీల్డ్‌లో ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [17] అతనికి న్యూజిలాండ్, హాంకాంగ్ రెండింటిలోనూ పౌరసత్వం ఉన్నందున, అతన్ని విదేశీ ఆటగాడిగా పరిగణించరు.
2018 జనవరి 1న, చాప్‌మన్ 2017–18 సూపర్ స్మాష్‌లో కాంటర్‌బరీకి వ్యతిరేకంగా ఆక్లాండ్ తరపున బ్యాటింగ్ చేస్తూ ట్వంటీ20 మ్యాచ్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. [18]
2017–18 ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో 480 పరుగులతో చాప్‌మన్ అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [19] 2018 జూన్లో, అతనికి 2018–19 సీజన్ కోసం ఆక్లాండ్‌తో ఒప్పందం లభించింది. [20] 2020 మార్చిలో, 2019–20 ప్లంకెట్ షీల్డ్ సీజన్ ఐదవ రౌండ్‌లో, చాప్‌మన్, జో కార్టర్‌లు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించారు. [21] ప్లంకెట్ షీల్డ్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. [22]
అంతర్జాతీయ కెరీర్
అతను 2014 ICC వరల్డ్ ట్వంటీ 20 కొరకు హాంకాంగ్ జట్టులో ఎంపికయ్యాడు. ఇది ఒక ప్రధాన ICC టోర్నమెంట్‌లో హాంకాంగ్ మొదటి ప్రదర్శన కూడా. [23] [24] అతను 2014 ICC T20 వరల్డ్ కప్ గ్రూప్ A మ్యాచ్‌లో నేపాల్‌తో 2014 మార్చి 16న హాంకాంగ్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు. [25] అతను 2014 ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ టోర్నమెంటు కోసం హాంకాంగ్ జట్టులో కూడా ఎంపికయ్యాడు. [26] బంగ్లాదేశ్‌తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో అతను 31 బంతుల్లో 38 పరుగులతో హాంకాంగ్ తరపున అత్యధిక స్కోరు సాధించాడు. అతని ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ హాంకాంగ్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. [27]
2015 నవంబరులో, UAEతో జరిగిన రెండు ప్రపంచ క్రికెట్ లీగ్ మ్యాచ్‌ల కోసం హాంకాంగ్ జట్టులో చాప్‌మన్ వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ రెంటికీ వన్‌డే హోదా ఉంది.[1] మొదటి మ్యాచ్‌లో. తన తొలి వన్‌డేలో, అతను 116 బంతుల్లో నాటౌట్‌గా 124 పరుగులు చేసి , వన్‌డే సెంచరీ చేసిన మొదటి హాంకాంగ్ ఆటగాడిగా నిలిచాడు. [28] [29] చాప్‌మన్, వన్‌డే రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన మొదటి ఆటగాడు, డెస్మండ్ హేన్స్ తర్వాత 100.00 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేసిన రెండవ ఆటగాడు అయ్యాడు. [30]
అతను 2016 ICC వరల్డ్ ట్వంటీ20, 2016 ఆసియా కప్ క్వాలిఫైయర్ కోసం హాంకాంగ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [31] 2016 ఆసియా కప్ క్వాలిఫైయర్ సందర్భంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో, అమీర్ కలీమ్ అతన్ని మ&కాడింగు రనౌట్వి చేసాడు.[32] [33] అలాగే టీ20 మ్యాచ్‌లో మాన్‌కడింగు అయిన గురైన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [34] ఆక్లాండ్ క్రికెట్ జట్టుతో అతని ఒప్పందం కారణంగా అతన్ని, 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం హాంకాంగ్ జట్టులో ఎంపిక చేయలేదు. బదులుగా భవిష్యత్తులో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయాలను పెంచుకున్నాడు. [35]
2018 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన ట్రాన్స్-టాస్మాన్ ట్రై-సిరీస్ కోసం చాప్‌మన్ న్యూజిలాండ్ T20I జట్టుకు ఎంపికయ్యాడు.[2] 2018 ఫిబ్రవరి 13న ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ తరపున తన T20I రంగప్రవేశం చేసి, రెండు అంతర్జాతీయ జట్లకు T20Iలు ఆడిన ఆరవ క్రికెటరు అయ్యాడు. [36] గాయపడిన కేన్ విలియమ్సన్‌కు కవర్‌గా చాప్‌మన్ న్యూజిలాండ్ వన్‌డే జట్టులోకి ఎంపికయ్యాడు. [37] 2018 ఫిబ్రవరి 28న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, చాప్‌మన్ న్యూజిలాండ్ తరపున తన వన్‌డే రంగప్రవేశం చేశాడు. [38] దీంతో రెండు అంతర్జాతీయ జట్ల తరఫున వన్డేలు ఆడిన పదో క్రికెటర్‌గా నిలిచాడు.
2021 ఆగష్టులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఛాంప్‌మన్ ఎంపికయ్యాడు. [39] [40]
T20Iలలో రెండు దేశాలకు 50+ స్కోర్‌లు చేసిన మొదటి ఆటగాడు మార్క్ చాప్‌మన్. 2021 నవంబరు నాటికి యాభై కంటే ఎక్కువ స్కోర్లు అతనికి రెండు ఉన్నాయి. ఆ రెండూ ఒకే స్కోరు, 2015లో హాంకాంగ్ v ఒమన్‌కు 63*, 2021లో న్యూజిలాండ్ v భారత్ 63
2023లో న్యూజిలాండ్ పాకిస్థాన్ పర్యటనలో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. 5వ T20Iలో అతను 104*లో అజేయంగా శతకం సాధింసి, సిరీస్‌ను 2-2తో సమం చేసేందుకు దోహదపడ్డాడు. ఆ సిరీస్‌లో టాప్ స్కోరరు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కార గ్రహీత.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.