Remove ads

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మాన్సా జిల్లా (పంజాబీ - ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ ) ఒకటి. జిల్లాలో బుధ్లడ, మాన్సా అనే 2 తాలూకాలు ఉన్నాయి.[1] భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్, సర్దుల్గర్ అనే 5 డెవలెప్మెంటు బ్లాకులు 3 ఉపతాలూకాలు ఉన్నాయి. మాన్సా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం.

త్వరిత వాస్తవాలు మాన్సా జిల్లా ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ, దేశం ...
మాన్సా జిల్లా
ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా
Thumb
దేశం India
రాష్ట్రంపంజాబ్
ముఖ్య పట్టణంమాన్సా
విస్తీర్ణం
  Total2,174 కి.మీ2 (839 చ. మై)
జనాభా
 (2011)
  Total7,68,808
  జనసాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
భాషలు
  అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-PB
Vehicle registrationPB-31
లింగ నిష్పత్తి1000/880 /
అక్షరాస్యత63%
మూసివేయి

భౌగోళికం

Thumb
పంజాబు జిల్లాలు, వాటి ముఖ్య పట్టణాలు

భౌగోళికంగా జిల్లా త్రికోణాకారంగా ఉంటుంది. జిల్లా వాయవ్య సరిహద్దులో భటిండా, ఈశాన్య సరిహద్దులో సంగ్రూర్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రం ఉన్నాయి. ఇది భటిండా- జింద్ - ఢిల్లీ రైలు మార్గంలో ఉంది. అలాగే బర్నాలా- సర్దుల్గర్- సిర్సా (హర్యానా) రహదారి మార్గంలో ఉంది. జిల్లాలో 3 తాలూకాలున్నాయి: బుధ్లడా, మాన్సా, సత్దిల్గర్. జిల్లాలోని సర్దుల్గర్ తాలూకా గుండా ఘగ్గర్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పంజాబీ అధికార భాషగా ఉంది.

చరిత్ర

మాన్సా జిల్లా మునుపు ఫుకియా సిఖ్ సామ్రాజ్యం (1722- 1948) లో భాగంగా ఉంటూ వచ్చింది తరువాత కైథల్ సిఖ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. ఈ జిల్లా 1992 ఏప్రిల్ 13 న ఏర్పాటైంది. భటిండా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. ఈ పట్టణాన్ని భాయి గురుదాస్ స్థాపించాడని భావిస్తున్నారు. భాయి గురుదాస్ ధింగర్‌లో నివసించే వాడు. ఆయన మాన్సాలో నివసిస్తున్న ధైల్వాల్ జాట్ సిఖ్ కన్యను వివాహం చేసుకున్నాడు. ఒకరోజు ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళడానికి ఈ ఊరికి వచ్చిన సమయంలో ఆయన అత్తమామలు భార్యను పంపడానికి నిరాకరించారు. తరువాత గురుదాస్ వారింటి ముందు తపసు చేయడం ఆరంభించాడు. తరువాత కొంతకాలానికి అత్తమామలు భార్యను పంపడానికి అంగీకరించినా గురుదాస్ భార్యను నిరాకరించి తన తపస్సు ఆపలేదు. ఈ సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ సమాధి నిర్మించి ప్రతిసంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లాడూలు, గురు సంప్రదాయానికి చెందిన ప్రజలు ఈ సమాధి దర్శించడానికి అధికంగా వస్తుంటారు. 1952 నుండి ఇక్కడ నగరపాలక వ్యవస్థ ఆరంభం అయింది.

  • నగరంలో రెండు కాలేజీలు ఉన్నాయి: నెహ్రూ మెమోరియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్, ఎస్.డి కన్య మహావిద్యాలయ కాలేజ్.
  • 3 సీనియర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి.
  • 90 పాఠశాలలు ఉన్నాయి.
  • 1 మిడిల్ స్కూల్
  • 1 ప్రైమరీ స్కూల్ ఉంది.
  • జిల్లా గ్రంథాలయం ఉంది.
  • 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.: పి.ఎస్ సిటీ, పి.ఎస్ సాదర్
  • ఒక రైల్వేస్టేషను ఉంది.
Remove ads

పురాతన కాలం

ఈ ప్రాతంలో ఒకప్పుడు సింధూనాగరికత ఉండేది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పురాతన కాలంలో హరప్పా, మొహంజుదారో సంస్కృతి ఉన్నట్లు పురాతత్వ పరిశోధనలు ౠజువు చేస్తున్నాయి.

[2][3] ఈ ప్రాంతం 3 సంస్కృతికి చెంది ఉంది : ప్రి హరప్పా, హరప్పా, లేట్ హరప్పా సంస్కృతులకు చెంది ఉంది.

పూర్వ హరప్పన్

  1. అలిపూర్ మంద్రన్
  2. బగ్లియన్ డీ థెన్
  3. బారెన్
  4. చోటి మానస
  5. గుర్ని కలాన్
  6. హాసంపూర్
  7. హిర్కే
  8. లక్ష్మీర్వాలా
  9. నైవాన్ తెహ్
హరప్పా కాలం
  1. అలి డా తెహ్
  2. అలిపూర్ మంద్రన్
  3. బగ్లియన్ డీ తెహ్
  4. చోటి మానస
  5. డాలేవన్
  6. గుర్ని కలాన్
  7. హాసన్‌పూర్
  8. హిర్కెబ్
  9. కర్నపురా
  10. లక్ష్మీర్ వాలా
  11. వాలా
  12. లలియన్ వాలి
  13. నైవాలా తెహ్
Remove ads

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 7,68,808,[4]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 489వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 350
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.62%.
స్త్రీ పురుష నిష్పత్తి. 880:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.8%[4]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

వ్యవసాయం , పరిశ్రమలు

మాన్సా జిల్లా పంజాబు కాటన్ బెల్టులో భాగంగా ఉంది. అందువలన ఈ ప్రాంతాన్ని " ఏరియా ఆఫ్ వైట్ గోల్డ్ " (తెల్ల బంగారు ప్రాంతం) అని అంటారు. జిల్లాకు వ్యవసాయభూములు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. జిల్లాలో రాష్ట్రంలోని అతిపెద్ద " థర్మల్ పవర్ స్టేషను " ఉంది. ఈ థర్మల్ పవర్ స్టేషను సామర్థ్యం 1980 మె.వా. ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వాణిజ్యం అరుదుగా నగర ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి.

ప్రధాన నగరాలు , పట్టణాలు

బుధ్లడ

ఖత్లి కులానికి చెందిన బుధ, లఢ అనే అన్నదమ్ములు నివసించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి బిధ్లడ అనే పేరు వచ్చింది. ఇది ఢిల్లీ, భతిండా రైల్వే మార్గంలో ఉంది. ఇది మిలటరీ ఉద్యోగుల నియామక కేంద్రంగానూ, ముఖ్యమైన వ్యాపార కేంద్రంగానూ గుర్తించబడుతుంది.

ప్రముఖ వ్యక్తులు

* కెప్టెన్ కె.కె గౌర్
* గవీ చాహల్ -ఏక్టర్
* డీప్ ధిల్లాన్ -గాయకుడు
* కుల్‌వీందర్ బిల్లా - గాయకుడు
* లాభ్ హీరా - గాయకుడు
* జైస్మీన్ జస్సి -

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads