Remove ads
From Wikipedia, the free encyclopedia
బర్నాలా పంజాబ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది 2006 లో ఏర్పడిన బర్నాలా జిల్లాకు ముఖ్య పట్టణం. బర్నాలా జిల్లా ఏర్పడటానికి ముందు, ఈ నగరం సంగ్రూర్ జిల్లాలో ఉండేది. ఇది భటిండా సమీపంలో ఉంది.
సిక్కు చరిత్రకారుడు జియానీ ఖల్సా చరిత్రలో బర్నాలా ఏర్పాటు గురించి వివరాలను నమోదు చేశాడు. 1775 వ సంవత్సరంలో బాబా అలా సింగ్ తన సోదరుడు దునా సింగ్కు భదౌర్ (కింగ్ పాధర్ సైన్ ఏర్పాటు చేసాడు) ను అర్పించిన తరువాత బర్నాలా ప్రాంతానికి వచ్చాడు. అప్పటికి బర్నాలా ఏ గుర్తింపూ లేకుండా ఉండేది. దానిని తన రాజధానిగా చేసుకుని, చుట్టుపక్కల గ్రామాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అనాహద్గఢ్ ఇంతకు ముందే ఉండి ఉండవచ్చు; ధర్వీల దాడుల తరువాత నిర్జనమై ఉండాలి.
బర్నాలా నామకరణం గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అభిప్రాయం, తరచూ తుఫానుల (వర్ణ అని పిలిచేవారు) వచ్చే ప్రాంతం వారన్. ఈ పేరే బర్నాలా గా మారింది. కాబట్టి బర్నాలా అనేక తుఫానుల భూమి అని అర్థం. మరొక కథనంలో, ఇక్కడ బాబా అలా సింగ్ ఒక కోటను నిర్మించినట్లు చెబుతారు. ఇందులో 'బాహులి' (మెట్లబావి) ఉంది. దాన్ని మాళ్వాయీ యాసలో 'బైన్' అని పిలుస్తారు. ఆ బైన్ వాలాయే చివరికి బర్నాలా అయింది. ఇవి భిన్నమైన కథనాలు మాత్రమే కాని బర్నాలా పేరు ఎలా ఉనికిలోకి వచ్చిందో చెప్పే చారిత్రక వివరాలు అందుబాటులో లేవు.
పూర్వపు సంస్థాన వ్యవస్థలో బర్నాలా జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. కానీ, తరువాత దీనిని పెప్సు (పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్) లో విలీనం చేసాక, ఉప డివిజనల్ ప్రధాన కార్యాలయ స్థాయికి దిగజారింది.
బర్నాలాకు ఆనుకొని ఉన్న హండియా గ్రామంలో, నాథ్ వాలా డేరా లో "రామేశ్వరం స్టోన్" అనే రాయి ఉంది. అది నీటిలో తేలుతూంటుంది.
బర్నాలాలో మతం[1] | ||||
---|---|---|---|---|
మతం | శాతం | |||
సిక్ఖులు | 50.37% | |||
హిందువులు | 47.67% | |||
ముస్లిములు | 1.53% | |||
క్రైస్తవులు | 0.15% | |||
ఇతరులు | 0.29% |
2011 జనగణన ప్రకారం, బర్నాలా జనాభా 1,16,449. వీరిలో పురుషులు 62,554, మహిళలు 53,895. పట్టణ అక్షరాస్యత 79.59%. [2] బర్నాలా సిక్కుల మెజారిటీ నగరం. జనాభాలో వీరి శాతం సుమారు 50.37.
బర్నాలా పట్టణానికి చెందిన ప్రముఖులు
బర్నాలా పట్టణం లోని విద్యా సంస్థలు:
ఉన్నత విద్యాసంస్థలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.