మహ్మద్ షకీల్ ఆమేర్

From Wikipedia, the free encyclopedia

మహ్మద్ షకీల్ ఆమేర్

మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున బోధన్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
మహ్మద్‌ షకీల్‌ ఆమేర్
Thumb


పదవీ కాలం
2014 – 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం బోధన్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 7, 1976
అచ్చంపల్లి, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మహమ్మద్ అజామ్, షాగుఫ్తా ఆదిబ్
జీవిత భాగస్వామి ఆయేషా ఫాతిమా అమీర్
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
మూసివేయి

జననం, విద్య

మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ 1976, మార్చి 7న మహమ్మద్ అజామ్, షాగుఫ్తా ఆదిబ్ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలంలోని అచ్చంపల్లి గ్రామంలో జన్మించాడు. 1991లో బోధన్ లోని మధుమలాంచ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి పూర్తి చేశాడు.[4] ఆ తరువాత జర్నలిజంలో డిప్లమా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో సర్టిఫికెట్ కోర్సు చేశాడు.[5]

వ్యక్తిగత జీవితం

షకీల్ అహ్మద్ కు ఆయేషా ఫాతిమా అమీర్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం వ్యాపారం చేశాడు.

రాజకీయ విశేషాలు

టిఆర్ఎస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పై 14,00 వందలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. 2016, మే 26 నుండి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ ఛైర్మన్ గా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పై 8,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[6]

ఇతర వివరాలు

  1. ఆస్ట్రేలియా, కెనడా, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.
  2. తను చదువుకున్న మధుమలాంచల్ ఉన్నత పాఠశాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చాడు.[7]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.