మలైకా అరోరా
భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత. From Wikipedia, the free encyclopedia
మలైకా అరోరా భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత. ప్రధానంగా హిందీ సినిమాల్లో ఈమె పలు రంగాల్లో పనిచేసింది. 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది.[2]
మలైకా అరోరా | |
---|---|
![]() 2018 లో మిస్ దివా కార్యక్రమంలో అరోరా | |
జననం | థానే, మహారాష్ట్ర | అక్టోబరు 23, 1973
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి • నాట్యకారిణి • మోడల్ • వీడియో జాకీ • టీవీ వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 1997–ప్రస్తుతం |
ఎత్తు | 160 cమీ. (5 అ. 3 అం.) |
జీవిత భాగస్వామి | [1] |
భాగస్వామి | అర్జున్ కపూర్ (2019–ప్రస్తుతం) |
పిల్లలు | అర్హాన్ ఖాన్ |
బంధువులు | అమృత అరోరా (సోదరి) |
బాల్యం, విద్యాభ్యాసం
మలైకా అంటే స్వాహిలి భాషలో దేవత (ఏంజెల్) అని అర్థం.[3] ఈమె మహారాష్ట్రలోని థానేలో 1973, అక్టోబరు 23న జన్మించింది. ఈమెకు 11 సంవత్సరాల వయసుండగా విడిపోయారు. తర్వాత తల్లి, సోదరి అమృత అరోరాతో కలిసి ఈమె చెంబూరుకు మారింది. ఈమె తల్లి జాయ్స్ పాలీకార్ప్ మలయాళీ క్యాథలిక్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త. మర్చంట్ నావీ[4][5][6][7]లో పనిచేశాడు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.