మలేర్‌కోట్ల జిల్లా

భారతదేశం, పంజాబ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia

మలేర్‌కోట్ల జిల్లాmap

మలేర్‌కోట్ల జిల్లా భారతదేశం, పంజాబ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. మలేర్‌కోట్ల పట్టణం ఈ జిల్లా ముఖ్యపట్టణం ఇది సంగ్రూర్ జిల్లాను విభజించగా 2021 జూన్ 02న పంజాబ్‌లో 23వ జిల్లాగా అవతరించింది.[1]మలేర్‌కోట్ల జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం మలేర్‌కోట్ల, అమర్‌ఘర్, అహ్మద్‌ఘర్ అనే మూడు ఉపవిభాగాలుగా విభజించబడింది:

త్వరిత వాస్తవాలు Malerkotla district, Country ...
Malerkotla district
District of Punjab, India
Thumb
Eidgah in Malerkotla
Thumb
Location in Punjab
Coordinates: 30.53°N 75.88°E / 30.53; 75.88
Country భారతదేశం
StatePunjab
DivisionPatiala
Established02 June 2021
HeadquartersMalerkotla
Government
  Deputy CommissionerSh.Sanyam Agarwal, IAS
  Senior Superintendent of PoliceSmt. Alka Meena IPS
విస్తీర్ణం
  Total684 కి.మీ2 (264 చ. మై)
జనాభా
 (2011)
  Total4,29,754
  Rank23rd
  జనసాంద్రత629/కి.మీ2 (1,630/చ. మై.)
Languages
  OfficialPunjabi
Time zoneUTC+5:30 (IST)
PIN
148XXX
Vehicle registrationPB-28(for Malerkotla)
PB-76(for Ahmedgarh)
PB-82(for Ahmedgarh SDM)
PB-92(for Amargarh)
Nearest cityMalerkotla
Sex ratio896 /
Literacy76.28%
Lok Sabha constituencySangrur
Fatehgarh Sahib
Punjab Legislative Assembly constituency2 •Malerkotla •Amargarh
Precipitation450 milliమీటర్లు (18 అం.)
Avg. summer temperature48 °C (118 °F)
Avg. winter temperature7 °C (45 °F)
మూసివేయి

చరిత్ర

మలేర్‌కోట్ల ప్రాంతం సా.శ. 1454 నుండి 1948 ఆగస్టు 20 వరకు పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్ర సమాఖ్యలో భాగమయ్యే వరకు మలేర్‌కోట్ల రాష్ట్రం రాచరిక రాష్ట్రంగా ఉంది. ఇది 1956లో పంజాబ్‌లో విలీనమై, సంగ్రూర్ జిల్లాలో భాగమైంది.

పరిపాలన

మలేర్‌కోట్ల జిల్లా ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో 23వ జిల్లాగా ఏర్పడింది. [2] ఈ జిల్లా 14 మే, 2021న సంగ్రూర్ జిల్లా నుండి వేరు చేయబడింది. [3] మలేర్‌కోట్ల, అహ్మద్‌ఘర్ ఉపవిభాగాలు, అమర్‌ఘర్ ఉప - తహసీల్‌లో భాగంగా ఉన్నాయి. [4]

గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మలేర్‌కోట్ల జిల్లాలో 4,29,754 మంది జనాభాను కలిగిఉంది. [5] దీని వైశాల్యం 684 చ.కి.మీ. ఇది 3 రెవెన్యూ డివిజన్లు,పురపాలక సంఘాలు,కమ్యూనిటి డెవలప్మెంట్ బ్లాక్‌లను కలిగి ఉంది. జిల్లా పరిధిలో 175 గ్రామ పంచాయతీలు, 192 గ్రామాలు ఉన్నాయి. 40.50% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 93,047 (21.65%) మంది ఉన్నారు. [6]

పట్టణ మొత్తం జనాభాలో సిక్కు మతం జనాభా ఎక్కువమందితో మొదటి స్థానంలో ఉంది. ప్రధానంగా వీరిలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు అత్యధిక ప్రజలు. పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, విభజన సమయంలో మలేర్‌కోట్ల ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. మలేర్‌కోట్లలో ఇప్పటికీ గణనీయమైన మైనారిటీ ముస్లింలు ఉన్నారు. [7]పట్టణ ప్రాంతాల్లో హిందువులు మూడవ అతిపెద్ద సమాజంగా ఉంది. [8] 2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 96.69% మంది పంజాబీ, 3.21% మంది ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడతారు. [9]

రాజకీయం

మలేర్‌కోట్ల జిల్లా మలేర్‌కోట్ల శాసనసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్ 2022 నుండి శాసనసభ సభ్యుడుగా కొనసాగుచున్నాడు.[10]

మలేర్‌కోట్ల జిల్లా సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి 2022 జూన్ 23న ఉపఎన్నిక జరిగింది. ఆఎన్నికలో సిమ్రంజిత్ సింగ్ మాన్ లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యాడు. [11]

చిత్రమాలిక

మలేర్‌కోట్ల స్మారక చిహ్నాలు, ఆకర్షణలు

ఇది కూడా చూడు

  • మలేర్‌కోట్ల రాష్ట్రం

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.